Thursday, June 24, 2010

ముఖాలు రకరకాలేల? , Faces are different - Why?


ప్రశ్న: వివిధ దేశాల్లో ఉండే ప్రజల ముఖాలు వివిధ రకాలుగా ఉండడమెందుకు? ఆఫ్రికా వాళ్ల ముఖాలు ఒక తీరుగా, భారతదేశంలో మరో తీరుగా, చైనావారివి మరోలా ఉంటాయెందుకు?


జవాబు: జీవజాతులు (species) పరిణామ క్రమం (evolution) ద్వారా రూపుదాల్చాయని చెప్పే డార్విన్‌ సిద్ధాంతం గురించి చదువుకుని ఉంటారు. ముఖాలు వేర్వేరుగా ఉండడం అందుకొక సాక్ష్యం. పరిసరాలకు అనుగుణంగా, ప్రకృతితో తలపడేందుకు అనుకూలంగా జీవులు రూపొందుతాయనేదే పరిణామ సిద్ధాంతం. ప్రతి జీవీ ఆయా ప్రాంతాల్లో లభించే వనరులు, పరిస్థితులలో నెగ్గుకు వస్తూ జీవించేలా మార్పులు సంతరించుకుంటుంది. పరిసరాలు వేడిగా ఉన్న ప్రాంతాల్లో ఉండే జీవులకు దాన్ని తట్టుకునేందుకు వీలైన చర్మం, రూపం లాంటివి ఏర్పడతాయి. అందులో భాగంగానే మెలనిన్‌ వర్ణద్రవ్యం వాటి చర్మంలో పెరుగుతుంది. దీని వల్లనే ఆఫ్రికా, దక్షిణ భారతదేశం, మధ్య అమెరికాలాంటి ఉష్ణప్రదేశాల్లో మనుషులు నల్లగా లేదా చామనఛాయగా ఉంటారు. చైనా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వేడి తక్కువ కాబట్టి మెలనిన్‌ తక్కువగా ఏర్పడి వారు తెల్లగా ఉంటారు. ఇలాగే రకరకాల భౌతిక స్థితిగతులు శరీరపు ఎత్తును, ముఖం నిర్మాణాన్ని నిర్దేశిస్తాయి.
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...