Friday, June 25, 2010

క్వాజర్స్‌ అంటే ఏమిటి? , Quasars .. what are they?





ప్రశ్న: అంతరిక్షానికి సంబంధించి క్వాజర్లు అనే పదం విన్నాను. వేటినిలా పిలుస్తారు?

జవాబు: విశ్వంలోని ఖగోళ వస్తువుల్లో క్వాజర్లు (Quasers) అత్యంత ప్రకాశవంతమైనవి. ఇవి వెలువరించే కాంతి విశ్వంలోని మొత్తం నక్షత్రమండలాలు (గెలాక్సీలు) వెలువరించే కాంతి కన్నా ఎక్కువగా ఉంటుంది. అనేక సంవత్సరాల పరిశోధనలు, ప్రయోగాల ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని గెలాక్సీల అంతరాల్లో క్వాజర్లు ఉంటాయని కనిపెట్టగలిగారు. అవి తమలో ఉండే అత్యంత శక్తిని మన సూర్యుని కన్నా కోట్లాది రెట్ల ద్రవ్యరాశిగల అనేక కృష్ణబిలాల (బ్లాక్‌హోల్స్‌) నుండి సంగ్రహిస్తాయి. అత్యధిక గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉండే ఈ క్వాజర్లు వాటి పరిసరాల్లో ఉండే ద్రవ్యాన్ని పీల్చుకునే క్రమంలో అనూహ్యమైన పరిమాణంలో శక్తి విడుదల అవుతుంది. క్వాజర్లను కాస్మిక్‌ వాక్యూమ్‌ క్లీనర్స్‌ అని కూడా అంటారు.
  • =======================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...