ఒక్క ముక్కలో చెప్పాలంటే మామూలు పొయ్యి లో ఆహారపదార్ధాలు బయటి నుంచి లోపలికి ఉడికితే , మైక్రోవేవ్ ఓవెన్ లో అవి లోపలి నుంచి బయటకి ఉడుకుతాయి . ఇది అర్ధం కావాలంటే కాంతి గురించి తెలుసుకోవాలి . కాంతి ఓ విద్యుదయస్కాంత(ElectroMagnatic) తత్త్వం గల శక్తి స్వరూపము . ఇది తరంగాలు గాను , ఫోటాన్లు అనే కనాలుగాను ప్రయాణిస్తుంది . మనం కంటి తో చూడగల కాంతితరంగాలను దృశ్య కాంతి (VisibleLight) అంటాము . మనం చూడగల ద్రుష్యకాంటి కన్నా తక్కువ శక్తిగల కాంతి తరంగాలు కొన్ని ఉన్నాయి . వాటిలో ఒకటే ' మైక్రోవేవ్ ' తరంగాలు ... ఇవి ఒక విధంగా ప్రత్యేకమైన పౌనః పుణ్యం గల రేడియో తరంగాలే . మైక్రోవేవ్ వవెన్ లో ఆహారం ను ఉదికిన్చేవి ఇవే .
మనం వంట వండుకోవడం అంతే ఏమిటో తెలుసా ? ... ఆహారపదార్ధాల లోని అను బంధాలను చేదించడమే(BondCleavage) . దీన్నే ఉడకడం అంటాము . వవెన్ లో ఆహారపదాదాలను పెట్టి ఆన్ చేస్తే మైక్రోవేవ్ తరంగాల వల్ల ఆహారపదార్దాల్లోని అణువులు ఉత్తేజం పొందుతాయి . నీటి అణువులు గిరగిరా తిరిగి అనుబంధాల్ని చేదిస్తాయి . తద్వారా ఆహారము త్వరగా ఉడుకుతుంది . ఆహారపు అణువులు , నీరు వంటి పదార్దాలే microవవె తరంగాల శక్తిని గ్రహించగలవు . పింగాణి , గాజు వంటివి ఆ తరంగాలను అడ్డుకోలేవు .. కాబట్టి ఈ తరంగాల శక్తి నేరుగా ఆహారపదార్ధాల అనుస్తాయి లో పనిచేసి వంట త్వరగా పూర్తీ అవుతుంది . మామూలు పొయ్యిమీద వంట చసేతపుడు ఆహారపదార్ధాలను ఉడికించడానికి ఉష్ణ శక్తి పనిచేస్తుంది . మంట నుండి పుట్టే ఉష్ణ శక్తి మొదట పాత్రను వేదేక్కిస్తుంది .. చుట్టుప్రక్కల గాలి కుడా వేడెక్కుతుంది .. అంతే వేడి ఆహారపదార్ధాల అణువుల వరకు చేరార్ లోపల చాలా వరకు వృధా అవుతుంది అన్నమాట. అందువల్ల చాలచేపు ఉదికిన్చితే తప్ప ఆహారము ఉదాకడు .
======================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...