Sunday, December 06, 2009

కలర్ టీవీ కి ఆ పట్టీ ఎందుకు , Black band round the color tv monitor why?





కలర్ టీవీ తెర అంచు చుట్టూ నల్లటి పట్టీ ఉంటుంది ఎందుకు ?

ఒక విధం గా చెప్పాలంటే రంగుల టీవీ తెర అంచు చుట్టూ కనిపించే నల్లని పట్టీ టీవీ లోని పిక్చర్ ట్యూబ్ కి రక్షణ కవచం లాంటిది . పిక్చర్ ట్యూబ్ లోపల ఉండేది శూన్య ప్రదేశం కాబట్టి అది టీవీ వెలుపల ఉండే వాతావరణ పీడనాన్ని తట్టుకోవాలి . పాతకాలం టీవీ లలో ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ షీల్డులు పిక్చర్ ట్యూబ్ చుట్టూ అమర్చి ఉండేవి . పిక్చర్ ట్యూబ్ కి లోపల ,వెలుపల ఉండే వాతావరణ పీడనాల తేడా వల్ల పేలుడు సంభవించకుండా ఇవి కాపాడేవి . . . కాని ఇప్పటి టీవీ లలో పేలుళ్ళ నుంచి రక్షణ కోసం ప్లాస్టిక్ షీల్దులకు బదులు " కిమ్ కోడ్ "అనే లోహపుచాత్రాన్ని పిక్చర్ ట్యూబ్ చుట్టూ తన్యతతో ఉండే పట్టీతో బిగిస్తున్నారు . మనకు తెర అంచుల చుట్టూ కనిపించే నల్లని పట్టీ ఇదే .









visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...