తెలుగుపు అనేది ఒక రంగు కాదు ... అన్ని రంగుల మేలు కలయికే తెలుపు . ఒక వస్తువుగుండా దృశ్య కాంతి లోని ఏడు రంగులు యధేచ్చగా తరిగిపోకుండా పతనమైన (incident) దిశలోనే ప్రసరిస్తే ఆ వస్తువు ను పారదర్శక వస్తువు (TransparentBody) అంటాము . అదే వస్తువు ముక్కలు ముక్కలు గా ఉన్నప్పుడు గానీ .. ఒకే విధమైన అంతర్గత నిర్మాణము లేనపుడు గానీ దాని మీదపడే కాంతి (IncidentLight) పలు దిశల్లో వక్రీభవనం (Refraction) చెంది వివిధ మార్గాల ద్వారా బయటకు వస్తుంది . ఇలా అన్ని వైపూలనుండి తెలుపు కాంతి రావడం వల్ల ఎటు నుంచి చూసినా ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది .
గాజు పలక పారదర్శకం గ కనిపించినా దాన్ని పొడిగా నూరితే సుద్ద పోడిలా తెల్లగా కనిపిస్తుంది . ఇందుకు కారణమూ శ్వేత కాంతి (WhiteLight)పలు దిశల్లో వెదజల్లు కోవడమే (ScatteredLight) . ఐస్ క్యూబ్లలో కుడా వక్రీభవన దిశలు మారి తెల్లని కాంతి పలు మార్గాల్లో బయట కు వస్తుంది . . . అందుకే తెల్లగా కనిపిస్తుంది .
ప్రశ్న: మంచు తెల్లగానే ఎందుకు ఉంటుంది?
జవాబు: తెలుపు ఓ నిర్దిష్ట వర్ణం (specific colour) కాదు. ఇది ఎన్నో వర్ణాల కలయిక. సాధారణంగా ఏదైనా పదార్థంలోని అణువులు (molecules)లేదా పరమాణువులు (atoms) దృశ్య కాంతిలో ఉన్న ఏ రంగు కాంతినీ శోషించుకోలేనట్లయితే ఆ పదార్థం తెల్లగా గానీ, పూర్తి పారదర్శకంగాగానీ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి పదార్థంలో ఉన్న పరమాణువులు స్వచ్ఛమైన స్ఫటికాకృతిలో (crystal structure) ఉన్నా, అణువులు లేదా పరమాణువుల మధ్యన ఖాళీ ప్రదేశం (ద్రవాలు, అణువులలో లాగా) బాగా ఎక్కువగా ఉన్నా ఆ పదార్థాలు పారదర్శకం (transparent) గా ఉంటాయి. కానీ అదే పదార్థంలో ఉన్న అణువులు, పరమాణువులు చిందరవందరగానో, శకలాల్లాగానో (polycrystalline or defective crystalline)ఉన్నట్లయితే ఆ పదార్థాల మీద పడ్డ తెల్లని కాంతి అన్ని వైపులకు పరావర్తనం (reflection) లేదా వ్యాపనం (diffusion) లేదా పరిక్షేపణం (scattering)అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఏ వైపు నుంచి చూసినా మనకు అంతో ఇంతో తెలుపు కాంతి కంటికి చేరడం వల్ల ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. సాధారణంగా మంచుగడ్డలు నిర్దిష్ట స్ఫటికాకృతిలో కాకుండా చెల్లా చెదురుగా ఏర్పడ్డ బహుస్పటిక శకలాలు (poly crystalline segments)గా ఉంటుంది. ఇటువంటి శకలాలమీద పడ్డ కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆ మంచు ముక్కలు తెల్లగా అగుపిస్తాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...