వేసవి కాలములో కుక్కలు నాలుక బయటకు చాపి గసపెడుతు ఉంటాయి ... ఎందుకు ?
వేసామీ కాలములో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనా ... మనుష్యులు , జంతువులూ దేహ ఉష్ణోగ్రత మాత్రం స్థిరము గా ఉండాలి . మనుష్యుల దేహములో ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి . అందులో ముఖ్యమైనది చర్మము ... దీనిలోని స్వేదగ్రందులు ద్వారా చెమట శరీరుపరితలం పైకి వస్తుంది .ఆ చెమట ఎప్పటికప్పుడు భాస్పీకరణం (Evaporation) చెంది ఆరిపోవడానికి మనశారీరము నుండే ఉష్ణాన్ని గ్రహిస్తుంది ... అందువల్ల శరీరము చల్లబడుతుంది . కాని కుక్కలాంటి జంతువులకు స్వేదగ్రందులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాటికి చెమట అంతగా పట్టదు ..అందువల్ల వీటి శరీర ఉష్ణోగ్రత పరిసరాల ప్రభావము వల్ల పెరుగుదలకు లోనవుతుంది . కుక్క అందుకనే తన నోరు తెరచి నాలుక బయటకు చాపి గసపెట్టడం లేదా వగర్చడం (panting) చేస్తుంది . దీనివల శరీర ఉష్ణోగ్రత స్థిరము గా ఉంటుంది .
======================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...