Tuesday, December 29, 2009






==============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

బారోమీటార్ లో వాతావరణ మార్పులు ఎలా తెలుస్తాయి?,Barometer and Atmosphere changes-How?





బారోమీటర్ లోని పాదరసం మట్టం ద్వారా వాతావరణం లోని మార్పులు ఎలా తెలుస్తాయి ?.

బారోమీటర్ లోని పాదరసం మట్టం వాతావరణం లో ఉండే గాలి పీడనాన్ని తెలియజేస్తుంది . పాదరసం మట్టం పైకి పోయిందంటే గాలిపీడనం ఎక్కువగా ఉన్నట్లు అర్ధం , ఆ మట్టం కిందకు పడిందంటే గాలి పీడనం తగ్గిందన్నమాట . బారోమీటర్ ని అంతరిక్షం లోకి తీసుకెళితే , ఆ శూన్య ప్రదేశం లో గాలి పీడనమనే ప్రశ్నే ఉండదు కాబట్టి ... పాదరసం మట్టం పూర్తిగా కిందికి పడిపోతుంది .

భూమి ఉపరితలం నుంచి అనేక కిలోమీటర్ల ఎత్తికు వ్యాపించి ఉండే వాతావరణం లోని గాలి గురుత్వాకర్షణ వల్ల ఒత్తిడి (pressure) కలుగజేస్తుంది . భూమి పై వివిధ ప్రదేశాలలో గాలి పీడనం వేరువేరు గా ఉండడమే కాకుండా కాలం తో పాటు మారుతూ ఉంటుంది . చల్లని గాలి కన్నా వేడి గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది . అంటే వేడి గాలి , చల్ల గాలి కన్నా తేలిగా ఉంటుంది . అందువల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ఎడారుల్లో గాలి పీడనం తక్కువగా ఉంటే , మంచు వలన చల్లగా ఉండే ధ్రువ ప్రాంతాల్లో గాలి పీడనం ఎక్కువగా ఉంటుంది .

వాతావరణం లోని గాలి పీడనం హెచ్చు తగ్గులను సూచించే బారోమీటర్ రీడింగులను బట్టి వాతావరణం లో కలుగాబోయే మార్పులను ముందుగానే తెలుసుకోవచ్చు . పీడనం ఎక్కువై బారోమీటర్ లోని పాదరసం మట్టం పైకి పోయిందంటే ఆ ప్రాంతం నిర్మలం గా ఉండబోతున్నట్లు . పీడనం తగ్గి పాదరసం మట్టం తటాలున పడిపోతే ఆ ప్రాంతం మేఘాలతో కూడిన వర్షాలు రాబోతాయని అర్ధం . మట్టం మరీ పడిపోతే తుఫాన్ లాంటి బీబత్సాలకు సూచిక .



===========================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆక్షిజన్ మాత్రమే రక్తం లో కలుస్తుంది-ఎందుకు? , Oxygen only disolves in blood-Why?





ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళినపుడు కేవలం ఆక్షిజన్ మాత్రమే ఎందుకు రక్తం లో కలుస్తుంది ... నైట్రోజన్ తదితర వాయువులు ఎందుకు కలవవు ?.

గాలిలో ప్రధానం గా నైట్రోజన్ , ఆక్షిజన్ వాయువులు 4:1 నిష్పత్తి లో ఉన్నాయి ... నిజానికి గాలిలో 80% ఉండేది నైట్రోజన్ వాయువే . అది మన శ్వాసక్రియలో ఉపిరితిత్తుల్లోకి ప్రవేశించినా వచ్చిన దారినే తిరిగి బయటికి వస్తుంది ... అది రక్తం లో కలవదు . ఆక్షిజన్ గాలిలో 20% మాత్రమె ఉన్నా అది రక్తం లో కలుస్తుంది .

ఉపిరితిత్తులు స్పాంజి లు గా ఉంటాయి . గాలి మూలమూలలా వ్యాపిస్తుంది . . ఆ గాలి చిట్టచివరికి శ్వాస గుళిక (Alviolous) లో చేరుకుంటుంది . ఈ శ్వాసగులిక గోళాల్లో పలుచని చర్మంగల రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది , ఈ రక్తం లో "హీమోగ్లోబిన్ " ఉంటుంది , ఈ హీమోగ్లోబిన్ కు అయస్కాంత ధర్మం ఉన్నది . . . మనం పీల్చే గాలిలోని ఆక్షిజన్ కి కుడా అయస్కాంత లక్షణం ఉన్నది . అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి . ఈ లక్షణం వల్ల ఆక్షిజన్ రక్తం లోనికి ఆకర్షితమవుతుంది . అంతే గాని వ్యాపనం (diffusion) వల్ల మాత్రమే కాదు . వ్యాపనం పాత్ర చాలా పరిమితం . వ్యాపనం ద్వారానే అయితే నైట్రోజన్ కుడా రక్తం లో కలవాలి . జైత్రోజన్ కు అయస్కాంత ధర్మం లేదు ... అందువల్ల అది రక్తం లో కలవలేదు . అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియ లో వృధా అని తెల్చేయకూడదు . గాలి పీడనానికి ప్రధాన అంశం ఈ నైట్రోజన్ . ఆ పీడనం వల్లే గాలి మన ఉపిరితిట్టుల్లో మారుమూల ప్రాంతాలకు కుడా చేరుకుంటుంది .



===================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కరోనా లో అంత వేడేల?, Corona has very heat -Why?




సూర్యుని అంతర్భాగం నుంచి ఎంతో దూరం లో ఉండే చివరి పొర "కరోనా" ఉష్ణోగ్రత ఎందుకంత ఎక్కువగా ఉంటుంది ?.

సూర్యుని ఉపరితలం తో పాటు చుట్టూ ఉండే వాతావరణాన్ని - కాంతి మండలం (Photosphere) , వర్ణ మండలం (Chromosphere) , కాంతి వలయం (Corona) అనే మూడు భాగాలు గా విభజించ వచ్చు . సూర్యుని వాతావరణం లో అట్టడుగున ఉండే కాంతి మండలం ఉష్ణోగ్రత 5500 కేల్విన్లు ఉంటే , వర్ణ మండలం లో ఉష్ణోగ్రత ౪౫౦౦ కేల్విన్ల నుండి 10,000 కేల్విన్లు వరకు ఉంటుంది . ఈ మండలం తన కింద ఉండే కాంతి మండలం లో ఉత్పన్నమైన ఉష్ణం వల్ల వేడెక్కుతుంది .. కరోనా సూర్యుని వాతావరణం లోని చివరి ఉపరితల పొర . దీని ఉష్ణోగ్రత 2,౦౦౦,౦౦౦ .కేల్విన్ల నుండి 5,౦౦౦,౦౦౦ కేల్విన్ల వరకు ఉంటుంది . కరోనా లో ఉష్ణానికి కారణం సూర్యునిలో ఉండే "కరోనియం" అనే మూలకము.

కాంతి మండలాన్ని సలసల మరుగుతున్న నీటి ఉపరితలం తో పోల్చవచ్చు . ఇక్కడ అత్యంత ఉష్ణోగ్రతలో ఉన్న ప్రవాహి ద్రవ్యం (Fluid) పైకి , కిందికి ఎగిసి పడుతూ విపరీతమైన శబ్దం కలిగి ఉంటుంది . ఈ శబ్దతరంగాలు కరోనాలోకి చొచ్చుకొని రావడం తో అక్కడి ఆ ధ్వని శక్తి ఉష్ణ శక్తి గా మారుతుంది . కరోనా లో ఉన్న పదార్ధం కాంతి మండలం లోని పదార్ధం తో పోలిస్తే అతి సుక్ష్మమ గా పల్చగా ఉండటం తో అక్కడకు చొచ్చుకొని వచ్చిన ధ్వని శక్తి ఉత్పాదించిన ఉష్ణ శక్తి వల్ల ఆ పొర అతి త్వరగా , సులభం గా వేడెక్కుతుంది . దీనితో కరోనా లోని ఉష్ణోగ్రత సూర్యుని అంతర్భాగం లోని ఉష్ణోగ్రత కన్నా ఎన్నోమిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది . సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడినపుడు కరోనా తీవ్రత , తీక్షణ లను ప్రకాశవంతమైన తెలుపు రంగులో సునిషితం గా చూడవచ్చును . ఆ స్థితి నే " డిమాండ్" రింగ్ అంటారు .

====================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కాంతి - తరంగామా ? కణమా?, Light-is a cell or a ray?




కాంతి (LightRay) - తరంగమ?కణమా ? అంటే చెప్పడము కష్టమే ! ఒక్కొక్క సారి ప్రశ్న కు ఎదురు ప్రశ్నే జవాబునిస్తుంది . ఉదాహరణకి నానేనికున్నది బొమ్మా లేదా బొరుసా? అంటే ఏం చెబుతాం ?. కాంతికి కుడా నాణేనికిలాగే కణ(Corpuscular) స్వభావము , తరంగ (Wave)స్వభావము సంయుక్తం గా అవిభాజ్యం గా ఉంటాయి . ఎలాగైతే నేల మీద పడేసిన నాణెపు రెండు పక్కలు (బొమ్మ , బొరుసు) ఒకే సారి ఎలా చూడ లేమో ... ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్ని , కణ స్వభావాన్ని ఏకకాలం లో పరిశీలించాలేము .

కాంతి వక్రీభవనం(Refraction) , వివర్తనం (Disfraction) , వ్యతికరణం (Interference), ద్రువనం (Polarisation) అనే ధర్మాలను కలిగి ఉంటుంది . కాంతి కున్న తరంగ స్వభావానికి ఈ ద్రుగ్విషయాలు కారణము . కాంతి విద్యుత్ఫలితము (PhotoElectricEffect), కాంఫ్తాన్ ఫలితము , కాంతి రసాయనిక చర్యలు (PhotoChemical phinomena) , కృష్ణ వస్తు వికిరణం (BlackBodyRadiation) ఉద్గార వర్ణ పటాలు (EmissionSpectra) వంటి ప్రయోగ ఫలితాలు , పరిశీలనలు , కాంతి కున్న కనస్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకం గా రెండు లక్షణాలు ఏక సమయం లో ఉండడం వల్ల కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం (WaveParticleDuality) ఉందంటారు.









=================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

ఐస్ క్యూబ్ లకు తెలుపు రంగు ఎందుకు ?, Ice Cubes appear white-Why?




స్వచ్చమైన నీటికి రంగు ఉండదు కాని అదే నీటి తో తయారైన ఐస్ క్యూబ్ లు తెల్లగా ఉంటాయి ఎందుకు ?.
తెలుగుపు అనేది ఒక రంగు కాదు ... అన్ని రంగుల మేలు కలయికే తెలుపు . ఒక వస్తువుగుండా దృశ్య కాంతి లోని ఏడు రంగులు యధేచ్చగా తరిగిపోకుండా పతనమైన (incident) దిశలోనే ప్రసరిస్తే ఆ వస్తువు ను పారదర్శక వస్తువు (TransparentBody) అంటాము . అదే వస్తువు ముక్కలు ముక్కలు గా ఉన్నప్పుడు గానీ .. ఒకే విధమైన అంతర్గత నిర్మాణము లేనపుడు గానీ దాని మీదపడే కాంతి (IncidentLight) పలు దిశల్లో వక్రీభవనం (Refraction) చెంది వివిధ మార్గాల ద్వారా బయటకు వస్తుంది . ఇలా అన్ని వైపూలనుండి తెలుపు కాంతి రావడం వల్ల ఎటు నుంచి చూసినా ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది .

గాజు పలక పారదర్శకం గ కనిపించినా దాన్ని పొడిగా నూరితే సుద్ద పోడిలా తెల్లగా కనిపిస్తుంది . ఇందుకు కారణమూ శ్వేత కాంతి (WhiteLight)పలు దిశల్లో వెదజల్లు కోవడమే (ScatteredLight) . ఐస్ క్యూబ్లలో కుడా వక్రీభవన దిశలు మారి తెల్లని కాంతి పలు మార్గాల్లో బయట కు వస్తుంది . . . అందుకే తెల్లగా కనిపిస్తుంది .


ప్రశ్న: మంచు తెల్లగానే ఎందుకు ఉంటుంది?

జవాబు: తెలుపు ఓ నిర్దిష్ట వర్ణం (specific colour) కాదు. ఇది ఎన్నో వర్ణాల కలయిక. సాధారణంగా ఏదైనా పదార్థంలోని అణువులు (molecules)లేదా పరమాణువులు (atoms) దృశ్య కాంతిలో ఉన్న ఏ రంగు కాంతినీ శోషించుకోలేనట్లయితే ఆ పదార్థం తెల్లగా గానీ, పూర్తి పారదర్శకంగాగానీ కనిపిస్తుంది. ఒకవేళ అలాంటి పదార్థంలో ఉన్న పరమాణువులు స్వచ్ఛమైన స్ఫటికాకృతిలో (crystal structure) ఉన్నా, అణువులు లేదా పరమాణువుల మధ్యన ఖాళీ ప్రదేశం (ద్రవాలు, అణువులలో లాగా) బాగా ఎక్కువగా ఉన్నా ఆ పదార్థాలు పారదర్శకం (transparent) గా ఉంటాయి. కానీ అదే పదార్థంలో ఉన్న అణువులు, పరమాణువులు చిందరవందరగానో, శకలాల్లాగానో (polycrystalline or defective crystalline)ఉన్నట్లయితే ఆ పదార్థాల మీద పడ్డ తెల్లని కాంతి అన్ని వైపులకు పరావర్తనం (reflection) లేదా వ్యాపనం (diffusion) లేదా పరిక్షేపణం (scattering)అవుతుంది. అటువంటి సందర్భాల్లో ఏ వైపు నుంచి చూసినా మనకు అంతో ఇంతో తెలుపు కాంతి కంటికి చేరడం వల్ల ఆ వస్తువు తెల్లగా కనిపిస్తుంది. సాధారణంగా మంచుగడ్డలు నిర్దిష్ట స్ఫటికాకృతిలో కాకుండా చెల్లా చెదురుగా ఏర్పడ్డ బహుస్పటిక శకలాలు (poly crystalline segments)గా ఉంటుంది. ఇటువంటి శకలాలమీద పడ్డ కాంతి పరిక్షేపణం చెందడం వల్ల ఆ మంచు ముక్కలు తెల్లగా అగుపిస్తాయి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ===========================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, December 28, 2009

దేసిబెల్ అంటే ఏమిటి ?, What is decibel ?




శబ్ద తీవ్రతను కొలవడానికి వాడే ప్రమాణాన్ని "డేసిబెల్(db)అంటారు . మన చెవులు శబ్దగ్రాహన విషయం లో అతి సున్నితమైనవి . మనం గోరుతో ఏదైనా వస్తువు పై గీస్తున్నప్పుడు జనించే అతి స్వల్పమైన శబ్దం నుంచి జెట్ విమానాలు చేసే తీవ్రమైన శబ్దాలన్నింటికీ మన కర్నెంద్రియం స్పందింస్తుంది .

డేసిబెల్ స్కేలులో అన్నిటికంటే అతి స్పల్ప తీవ్రత గల శబ్దం (పూర్తిగా నిశ్శబ్దం) "౦ - db" (సున్నా),దానికంటే పదింతల తీవ్రత 10db , సున్నా దేసిబెల్ కన్నా నూరు రెట్లు శబ్ద తీవ్రత 20db . వెయ్యి రెట్లు గల తీవ్రత 30db .

ఈ విలువలన్నీ శబ్ద ఉత్పత్తి స్థానం దగ్గరలో ఉంటేనే . శబ్ద ఉత్పత్తి స్థానం దూరంగా పోయేకొలదీ దీని తీవ్రత తగ్గుతుంది . 85 దేసిబెల్స్ కన్నా శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటే వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది . వినికిడి శక్తిని కోల్పోవడం అనేది ఆ ధ్వనిని మన చెవులు ఎంతసేపు వినగాలిగాయనే అంశము పై ఆధారపడి ఉంటుంది .

visit My website > Dr.Seshagirirao - MBBS.

బ్లాకు బాక్స్ అంతే ఏమిటి?, What is Black box?





హెలికాప్టర్ , విమాలన్లలో వాడే బ్లాకు బాక్స్ అంతే ఏమిటి , అది ఎలా ఉపయోగపడుతుంది ?

నీటిలో తడిచినా ఏమీ కాదు , అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది .. కాబట్టి మంటలలో కాలిన పాడు అవదు . గట్టి పదార్ధం తో తయారు చేస్తారు కనుక ఎంత ఎత్తి నించి కింద పడినా విరగదు . అదే బ్లాకు బాక్స్ . .. విమానాలు , హెలికాప్టర్ లలో తప్పనిసరిగా వీటిని అమర్చుతారు . చిత్రమేమంటే బ్లాకు బాక్స్ నల్లగా ఉండదు . నారింజ రంగులో ఉంటుంది . విమానము పేలిపోయినా , ముక్కలైపోయినా ... ఇది మాత్రము సురక్షితం గానే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు . విమానము నడిపే సమయము లో పైలట్ల సంభాషణలను ఇతర శబ్దాలను కొన్ని గంటలపాటు రికార్డ్ చేసే ఏర్పాటు దీనిలో ఉంటుంది . అంతే పమాదానికి ముందు ఎవరేం మాట్లాడారో శబ్దాలు ఏమిటో లాంటి సమాచారాన్ని బ్లాకు బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చును . అందుకే దీని పాత్ర చాలా కీలకమైనది .

బ్లాకు బాక్స్ ఆంటీ ఒక వ్యవస్థ లాంటిదన్నమాట , ఫ్లైట్ డాటా రికార్డర్ (FDR) కాకపిట్ వాయిస్ రికార్డర్ (CVR) అనే రెండు శబ్దగ్రాహక యంత్రాలు ఇందులో ఇమిడి ఉంటాయి . ఇందులో fdr యంత్రం లో విమానము ఎంత ఎత్తులో వెళ్ళింది , ఏ దిశలో వెళ్ళింది , ఎంత వేగం తో గాలి వీచింది లాంటి సాంకేతిక సమాచారము నమోదవుతూ ఉంటుంది . cvr యంత్రము లో అన్ని రకాల శబ్దాలు కొన్ని గంటల పాటు నమోదై ఉంటాయి . ఈ సమాచారము మొత్తాన్ని పరిశోధించి , విశ్లేషించడం ద్వారా నిపుణులు వాయు వాహనాల ప్రమాదాలము కారణాలేంటో తెలుసుకో వచ్చును .

అందుకే ఎక్కడ విమాన ప్రమాదం జరిగినా .. వెంటనే బ్లాకు బాక్స్ కోసమే వెతుకుతారు . నీటిలో మునిగిపోయినా సరే సునిశితమైన ఆల్త్రసోనిక్ శబ్దతరంగాలను వెలువరించే ఏర్పాటు కుడా వీటిలో ఉంటుంది . దీని ధర ఏడున్నర లక్షల రూపాయల వరకు ఉంటుంది . ఈ బ్లాకు బాక్స్ యంత్రాలతో అనుసంధానం చేసిన సెన్సార్లు విమానమంతా అమర్చి ఉంటాయి .

విమానాన్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ కుడా కొంత సమాచారాన్ని నమోదు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసారని చెబుతారు ... అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వీటి వాడకం విస్తరించబడింది , ఇప్పుడైతే విమానము లో బ్లాకు బాక్స్ తప్పనిసరి . మొదట్లో సమాచారము నమోదుకు మాగ్నటిక్ టేప్ లను ఉపయోగించినా ఇప్పుడు దృఢమైన మెమరీ చిప్ లను వాడుచున్నారు . మొదటిగా బ్లాకు బాక్స్ ఫ్లైట్ రికార్డర్ ఉండాలనే అల్లోచన ఆస్ట్రేలియా శాస్త్రవేత్త " డేవిడ్ వారెన్"కి వచ్చించి . అలా 1953 కల్లా ఆస్ట్రేలియాలో దీన్ని తాయారు చేశారు .





=========================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

గిటార్ పై కన్నమెందుకు ?, Guitar has hole on it-why?




గిటార్ ముందు భాగములో ఒక రంద్రం ఉంటుంది ,.. దాని అవసరము ఏమిటి?

గిటార్ లో తంత్రులు (Strings) ఒక పొడవైన బద్దలాంటి భాగము, దానికి అనుసంధానము గా బోలుగా ఉండే పట్టేలాంటి భాగాలపై బిగించి ఉంటాయని మనకు తెలుసు . గిటారును వాయించడం అంటే బిగించి తన్యతతో (Tensoin) తో కూడిన లోహపు తీగెలను మీటడమే ... అలా మీటినపుడు ఏర్పడిన ధ్వని తరంగాలు గిటారు నుంచి బయటకు వస్తేనే ఆ శబ్దాన్ని శ్రోతలు వినగాలుగుతారు . aలా శబ్ద తరంగాలు బయటకు రావడానికే పెట్టేలాంటి భాగము లో రంద్రాన్ని ఏర్పరుస్తారు . పెట్టె బోలుగా ఉండడము వల్ల దాని లో ఉండే గాలి తీగల్లో ఉత్పన్నమయ్యే శబ్దతరంగాల కంపనాలతో పాటు బలాత్క్రుత తరంగ కంపనాలను (ForcedVibrations) ఉత్పన్నము చేస్తాయి. ఇందువల్ల గిటార్ నుంచి వలువదే ధ్వని గంభీరము గా , శ్రావ్యము గా ఉంటుంది .

అందుకనే వీణ , వయోలిన్ , గిటార్, తంబురా .. లాంటి వాయిద్యాలలో కుడా తీగలను బోలుగా రంద్రాలన్దే పెట్టెల(SoundBoxes) పై బిగిస్తారు .


==========================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, December 06, 2009

మిక్రో వోవెన్ కి పొయ్యికి తేడా ఏమిటి?, Microwoven and Stove cooking-difference




పదార్ధాలను మైక్రోవేవ్ ఓవెన్ లో వండడానికి , మామూలు పొయ్యి మీద వండడానికి తేడా ఏమిటి ?.

ఒక్క ముక్కలో చెప్పాలంటే మామూలు పొయ్యి లో ఆహారపదార్ధాలు బయటి నుంచి లోపలికి ఉడికితే , మైక్రోవేవ్ ఓవెన్ లో అవి లోపలి నుంచి బయటకి ఉడుకుతాయి . ఇది అర్ధం కావాలంటే కాంతి గురించి తెలుసుకోవాలి . కాంతి ఓ విద్యుదయస్కాంత(ElectroMagnatic) తత్త్వం గల శక్తి స్వరూపము . ఇది తరంగాలు గాను , ఫోటాన్లు అనే కనాలుగాను ప్రయాణిస్తుంది . మనం కంటి తో చూడగల కాంతితరంగాలను దృశ్య కాంతి (VisibleLight) అంటాము . మనం చూడగల ద్రుష్యకాంటి కన్నా తక్కువ శక్తిగల కాంతి తరంగాలు కొన్ని ఉన్నాయి . వాటిలో ఒకటే ' మైక్రోవేవ్ ' తరంగాలు ... ఇవి ఒక విధంగా ప్రత్యేకమైన పౌనః పుణ్యం గల రేడియో తరంగాలే . మైక్రోవేవ్ వవెన్ లో ఆహారం ను ఉదికిన్చేవి ఇవే .

మనం వంట వండుకోవడం అంతే ఏమిటో తెలుసా ? ... ఆహారపదార్ధాల లోని అను బంధాలను చేదించడమే(BondCleavage) . దీన్నే ఉడకడం అంటాము . వవెన్ లో ఆహారపదాదాలను పెట్టి ఆన్ చేస్తే మైక్రోవేవ్ తరంగాల వల్ల ఆహారపదార్దాల్లోని అణువులు ఉత్తేజం పొందుతాయి . నీటి అణువులు గిరగిరా తిరిగి అనుబంధాల్ని చేదిస్తాయి . తద్వారా ఆహారము త్వరగా ఉడుకుతుంది . ఆహారపు అణువులు , నీరు వంటి పదార్దాలే microవవె తరంగాల శక్తిని గ్రహించగలవు . పింగాణి , గాజు వంటివి ఆ తరంగాలను అడ్డుకోలేవు .. కాబట్టి ఈ తరంగాల శక్తి నేరుగా ఆహారపదార్ధాల అనుస్తాయి లో పనిచేసి వంట త్వరగా పూర్తీ అవుతుంది . మామూలు పొయ్యిమీద వంట చసేతపుడు ఆహారపదార్ధాలను ఉడికించడానికి ఉష్ణ శక్తి పనిచేస్తుంది . మంట నుండి పుట్టే ఉష్ణ శక్తి మొదట పాత్రను వేదేక్కిస్తుంది .. చుట్టుప్రక్కల గాలి కుడా వేడెక్కుతుంది .. అంతే వేడి ఆహారపదార్ధాల అణువుల వరకు చేరార్ లోపల చాలా వరకు వృధా అవుతుంది అన్నమాట. అందువల్ల చాలచేపు ఉదికిన్చితే తప్ప ఆహారము ఉదాకడు .




======================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సోలార్ బేటరీ ఎలా పనిచేస్తుంది?,How does SolarBatary work?





సూర్యని కాంతి శక్తిని విద్యుచ్చక్తి గా మార్చడమే సౌర ఘటాల (SolarBataries) పని . ఆ విద్యుత్ ను ఏ ప్రయోజనము కోసం వాడతామనే విసయాన్ని బట్టి అవి పనిచేసే విధానము కుడా మారుతుంది . కొన్ని సౌరఘటాలు ఎప్పటికప్పుడు కాంతి శక్తిని విద్యుత్ శక్తి గా మారుస్తూ పరికరాలను నడిపిస్తుంటాయి . కేవలం తక్కువ మోతాదు విద్యుత్ మాత్రమే అవ సరమయ్యే కాలిక్యులేటర్లు ,డిజిటల్ గడియారాల్లాంటివి ఈ విధానం లో పనిచేస్తాయి . చీకటిలో ఇవి పని చేయవు . ఇక ఎక్కువ విద్యుత్ కావాల్సిన బల్బులు , యంత్రాలు , టార్చిలైట్లు , వీదిలైట్లు పని చేయాలంటే తొలుత కాంతి శక్తిని చాలా గంటల పాటు విధుత్ శక్తి గా మారుస్తూ నిలువున్చుకునే విధానాని వాడతారు . సినికాన్ వంటి పదార్ధాలలోని ఎలక్ట్రాన్లు కాంతి శక్తివల్ల ఉత్తేజితమై ఒక శక్తి స్థాయి నుంచి పైశక్తి స్థాయికి మారుతూ ధన , రుణ విద్యుత్దావేశాల్ని ఏర్పరచ గలవు . ఇలాంటి ఘటాలను వందలాదిగా వరుసగా కలపడం ద్వారా కొంత మోతాదులో ''విద్యుత్ పోటన్సియాల్'' ఏర్పడుతుంది .





=====================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కుక్కలు అలా వగరుస్తాయేమి?,Dogs panting why?






వేసవి కాలములో కుక్కలు నాలుక బయటకు చాపి గసపెడుతు ఉంటాయి ... ఎందుకు ?

వేసామీ కాలములో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనా ... మనుష్యులు , జంతువులూ దేహ ఉష్ణోగ్రత మాత్రం స్థిరము గా ఉండాలి . మనుష్యుల దేహములో ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి . అందులో ముఖ్యమైనది చర్మము ... దీనిలోని స్వేదగ్రందులు ద్వారా చెమట శరీరుపరితలం పైకి వస్తుంది .ఆ చెమట ఎప్పటికప్పుడు భాస్పీకరణం (Evaporation) చెంది ఆరిపోవడానికి మనశారీరము నుండే ఉష్ణాన్ని గ్రహిస్తుంది ... అందువల్ల శరీరము చల్లబడుతుంది . కాని కుక్కలాంటి జంతువులకు స్వేదగ్రందులు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాటికి చెమట అంతగా పట్టదు ..అందువల్ల వీటి శరీర ఉష్ణోగ్రత పరిసరాల ప్రభావము వల్ల పెరుగుదలకు లోనవుతుంది . కుక్క అందుకనే తన నోరు తెరచి నాలుక బయటకు చాపి గసపెట్టడం లేదా వగర్చడం (panting) చేస్తుంది . దీనివల శరీర ఉష్ణోగ్రత స్థిరము గా ఉంటుంది .





======================================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కలర్ టీవీ కి ఆ పట్టీ ఎందుకు , Black band round the color tv monitor why?





కలర్ టీవీ తెర అంచు చుట్టూ నల్లటి పట్టీ ఉంటుంది ఎందుకు ?

ఒక విధం గా చెప్పాలంటే రంగుల టీవీ తెర అంచు చుట్టూ కనిపించే నల్లని పట్టీ టీవీ లోని పిక్చర్ ట్యూబ్ కి రక్షణ కవచం లాంటిది . పిక్చర్ ట్యూబ్ లోపల ఉండేది శూన్య ప్రదేశం కాబట్టి అది టీవీ వెలుపల ఉండే వాతావరణ పీడనాన్ని తట్టుకోవాలి . పాతకాలం టీవీ లలో ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ షీల్డులు పిక్చర్ ట్యూబ్ చుట్టూ అమర్చి ఉండేవి . పిక్చర్ ట్యూబ్ కి లోపల ,వెలుపల ఉండే వాతావరణ పీడనాల తేడా వల్ల పేలుడు సంభవించకుండా ఇవి కాపాడేవి . . . కాని ఇప్పటి టీవీ లలో పేలుళ్ళ నుంచి రక్షణ కోసం ప్లాస్టిక్ షీల్దులకు బదులు " కిమ్ కోడ్ "అనే లోహపుచాత్రాన్ని పిక్చర్ ట్యూబ్ చుట్టూ తన్యతతో ఉండే పట్టీతో బిగిస్తున్నారు . మనకు తెర అంచుల చుట్టూ కనిపించే నల్లని పట్టీ ఇదే .









visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, December 05, 2009

జున్ను లో రంద్రాలు ఎలా ఏర్పడతాయి ? , Pores in cheese Why ?





జున్ను అంటే ఇష్టపడని వారుండరేమో ! ప్రపంచం లో 2000 రకాల జున్నులు లభిస్తున్నాయి . జున్ను తయారీ అనేది ఒక బ్యాక్టీరియా చర్య . పాలను జున్నుగా మార్చే బ్యాక్టీరియా విడుకలచేసే లాక్టిక్ ఆమ్లాన్ని తినే కొన్ని బ్యాక్తీరియాలు పాలలో ఉంటాయి . ఇవి లాక్టిక్ ఆమ్లాన్ని తిని కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేస్తాయి . అలా విడుదలైన వాయువు బయటకు వచ్చేందుకు చేసే ప్రయాణం లో రంద్రాలు ఏర్పడతాయి . ఆ రంద్రాలు లోపల ఏర్పడిన కార్బ కార్బన్ దయాక్శైడ్ విడుదల మార్గాలు , జున్ను తయారుచేసిన ఉష్ణోగ్రత ను బట్టి ఈ రంద్రాలలో తేడా ఉంటుంది .





visit My website > Dr.Seshagirirao - MBBS.

ఓడ నీళ్ళమీద ఎలా తేలుతుంది ?,Ship float on sea How?




చిన్న రాయి నీళ్ళలో మునుగుతుంది . . కాని టన్నుల బరువు మోసే ఓడ మాతము నీటిమీద తేలుతుంది ... దీనికి కారణము ఆయా వస్తువులు నీటిని ఏ మేరకు పక్కకు నేడతాయి అనే సూత్రము .

వస్తువు పరిమాణం ,సాంద్రత అధిక మైనపుడు అవి ఎక్కువగా నీటిని పక్కకు నేడతాయి . నీరు ఆ వస్తువును పైకి నెట్టడం తో అది పైన తేలుతుంది . ఓడల రూపము , దాని నిర్మాణం , దాని ఉపరితలం వల్ల ఓడ నీటిపై తేలుతూ వెళ్ళుతుంది .

====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.