Thursday, September 10, 2009

కోమాలో బ్రతికి ఉన్నట్లేనా?, Life is there in Coma?



  • మనిషి కోమా లో ఉండడం అంటే దేమిటి? అలా అయ్యేందుకు కారణం ఏమిటి? కోమా లో ఉన్నారంటే బ్రతికి ఉన్నట్లేనా?
కోమా అంటే ఓ రకమైన దీర్ఘ నిద్ర లాంటిది . మనం నిద్రమత్తులో ఉన్నప్పుడు అప్రమత్తం (conscious) గా ఉండే పనులు చేయలేము . కేవలం స్వతంత్ర నాడీ వవ్యస్త (autonomousNervousSystem) అధీనం లో ఉండే శ్వాసక్రియ , హృదయ చలనం , రక్తప్రవాహం , జీర్ణక్రియ వంటి జీవ క్రియలు (PhysiologicalActivities) మాత్రమె జరుగురాయి . మనుషుల్ని చూసి గుర్తుపట్టడం , నడవడం , మాట్లాడడం , బాహ్యపరిస్తితులకు సనుగునం గా స్పందించడం వంటి కార్యకలాపాలను కొనసాగించలేరు .

తలపై గట్టి దెబ్బతగిలినా , కొన్ని రసాయన ద్రవ్యాల విషప్రభావం , ఆక్షిజన్ సరఫరా తగ్గడం , రక్తం లో ఉండే గ్లూకోజ్ ను కణాలకు అందించే 'ఇన్సులిన్' లోపం వల్ల కలిగే చెక్కెర వ్యాధి ముదరడం లేదా దాని వల్ల గ్లూకోజ్ స్థాయి తగ్గడం , మెదడులో ఏదైనా కణితి ఏర్పడడం , తదితర కారణాలు వల్ల మెదడు దేహాన్ని సజావుగా నడిపించలేని విపత్కర స్థితి ఏర్పడుతుంది .. కాని స్వతంత్ర నాడీ వ్యవస్థ బాగానే పనిచేయును .. అలాంటి సమయంలో మనిషి కోమాలోకి వెళ్ళును . కోమాలోకి ఎందువల్ల వేల్లారనే కారణము తెలుసుకొని చికిత్స చేస్తే వ్యక్తి మామూలు స్థితి కి వస్తాడు .
నిద్రపోవుచున్న వ్యక్తీ జీవించి ఉన్నట్లే ... కోమాలో ఉన్నా వ్యక్తీ బ్రతికి ఉన్నట్లే .

No comments:

Post a Comment

your comment is important to improve this blog...