Thursday, September 03, 2009

కొవ్వొత్తి వెలుగుతూనే ఉంటుంది ఎలా?, How is candle continuously lighting?




కొవ్వొత్తి ఆర కుండా ఎలా వెలుగుతుంది ? ... కొవ్వొత్తి వెలిగేందుకు దాంట్లోని రెండు ముఖ్యమైన భాగాలు పనిచేస్తాయి . ఒకటి ఇంధనం లా పనిచేసే కొవ్వు పదార్ధము . . . పారఫిన్ మైనము , రెండోది కరిగిన మైనాన్ని పీల్చుకొనే 'ట్వయిన్ దారము' తో తయారుచేసిన వత్తి .

కొవ్వొత్తి మండుతున్నప్పుడు కరుగుతూ ద్రవరుపం లోకి మారుతున్న మైనము , వత్తిలో ఉన్న అతి సన్నని మార్గాలగుండా పైకి ఎగబాకుతుంది . ఈ ప్రక్రియను కేశనాలికీయత (capillarity) అంటారు . పారఫిన్ వేక్స్ (మైనం) క్రూడ్ ఆయిల్ నుంచి లభించే ఒక రకమైన హైడ్రోకార్బన్ . మనం కొవ్వొత్తిలొని వత్తిని వెలిగించినపుడు ఉత్పన్నమైన ఉష్ణము వత్తిచుట్టు ఉండే కొవ్వును కరిగిస్తుంది . అలా కరిగి ద్రవ రూపం లో ఉన్న మైనాన్ని వత్తి పీల్చుకొని ఆ ద్రవాన్ని పైవైపునకు లాగుతుంది . మంటలోని ఉష్ణం పైకి వచ్చిన మైనపు ద్రవాన్ని భాష్ప రూపంలోకి మార్స్తుంది . ఆ విదంగా కొవ్వొత్తి లో మండేది భాష్ప(ఆవిరి)రూపం లో ఉండే మైనమే .

మండుతున్న కొవ్వొత్తిని తటాలున ఆర్పేస్తే , వత్తి నుంచి వెలువడే తెల్లని పొగ ఒక ప్రవాహం లాగా పైకిపోవడం గమనిస్తాం . ఈ పొగ కంటికి కనబడే విధంగా ఘనీభవించిన పారఫిన్ మైనం భాస్పమే . వత్తి వేడిగా ఉన్నంతవరకు ఈ తెల్లని పొగ పవాహ రూపము లో వస్తూనే ఉంటుంది .


No comments:

Post a Comment

your comment is important to improve this blog...