Saturday, May 16, 2015

What is geo stationary satellite?, భూస్థావర ఉపగ్రహం అంటే ఏమిటి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







 ప్రశ్న: భూస్థావర ఉపగ్రహం అంటే ఏమిటి?

జవాబు: ఒక గ్రహం గురుత్వాకర్షణ శక్తికి లోబడి ఒక నిర్ణీత మార్గంలో దాని చుట్టూ తిరిగే వాటిని ఉపగ్రహాలు (satellites)అంటారు. ఈ నిర్ణీత మార్గాన్నే కక్ష్య (ఆర్బిట్‌) అంటారు. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు సహజ ఉపగ్రహం. అయితే శాస్త్రజ్ఞులు ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహాలు భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంటాయి. ఇవి భూమి చుట్టూ నిర్ణీత కక్ష్యల్లో తిరుగుతూ టెలికమ్యూనికేషన్‌ వ్యవస్థ, వాతావరణ సూచనలు, టెలివిజన్‌ కార్యక్రమాల ప్రసారాలకు, ఖనిజ సంపదలు గుర్తించడానికి తదితర అవసరాలకు ఉపయోగపడతాయి. కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహాలు ప్రయోగించిన దేశానికి ఉపయోగపడాలంటే, భూమి తిరుగుతున్నప్పటికీ అది ఆ దేశంపై స్థిరంగా ఉండాలి. ఇలా ఉండే ఉపగ్రహాన్ని భూస్థావర ఉపగ్రహం(geo stationary satellite) అంటారు. రెండు రైళ్లు ఒకే దిశలో సమాన వేగంతో వెళ్తున్నాయనుకుందాం. అప్పుడు ఒక రైలులోని వ్యక్తి మరో రైలులో ఉన్న వ్యక్తికి స్థిరంగా ఉన్నట్లు కనబడతాడు కదా. అలాగే కృత్రిమ ఉపగ్రహం భూ పరిభ్రమణ వేగంతో సమానంగా భూమి చుట్టూ తిరుగుతుంటే, అది భూమి మీద నిలకడగా ఉన్నట్లు ఒకే దగ్గర కనిపిస్తుంది. దీనిని 'పార్కింగ్‌ కక్ష్య' అంటారు. భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ కక్ష్య ఉంటుంది. ఇక్కడ ఉపగ్రహ వేగం సెకనుకు 3.1 కిలోమీటర్లు. కక్ష్య వ్యాసార్థం 42,000 కిలోమీటర్లు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌


  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...