Thursday, May 14, 2015

How islands are forming?,ద్వీపాలు ఎలా ఏర్పడతాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్ర : ద్వీపాలు ఎలా ఏర్పడతాయి?

జ : నాలుగు దిక్కులా నీరున్న భూభాగాన్ని ద్వీపం ('Island) అంటారు. ద్వీపాలనేవి రెండు రకాలుగా ఏర్పడతాయి. కాలక్రమములో ప్రధాన ఖండమునుండి విడిపోయిన చిన్న భూభాగము ద్వీపం గా తయారవుతుంది. లోతట్టు భూమికి మధ్యలో వున్నభాగము సముద్రమట్టం పెరిగి మునిగిపోతే ఒక ద్వీపం ఏర్పడవచ్చు. సముద్రములోని అగ్నిపర్వతాలు బద్దలైనపుడు పైకి ఎగిసిపడిన లావా నెమ్మదిగా ఒకచోట పేరుకుని ద్వీపం గా రూపు దిద్దుకుంటాయి. ప్రధాన నదులు సముద్రములోకి తెస్తున్న ఇసుక మేట వేయడం ద్వారా కూడా కొత్త ద్వీపం ఏర్పడుతుంది.

శ్రీలంక ద్వీపము కాలక్రమేనా  భారత ఖండము నుండి విడిపోయినదే .

  • ====================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...