Thursday, March 12, 2015

Hen or Cock cannot fly why?-కోడి ఎందుకు ఎగరలేదు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్ర : కోడి ఎందుకు ఎగరలేదు?

జ : మన ఇంటిలో వెంచుకునే కోళ్ళకు  . . ఎగిరే పక్షులకు ఉండే అవయవాలైన  రెక్కలు , ఎగిరే కండరాలు , గాలి బాగా పీల్చే ఊపిరితెత్తులు ఉన్నప్పటికీ  అవి ఎగరవు . మరీ ప్రాణహాని అనిపిస్తే మాత్రము ఒక్క సారిగా ఎగిరి ఎత్తయిన ప్రదేశాన్ని చేరతాయి. కోడి ఎగరటం మరిచిపోయేలా చేసింది మానవుడే .

ఏ జీవికైనా బతికేందుకు ఆహారము , శత్రు జీవుల నుండి రక్షణ అవసరము . . . వీటికోసమే పరుగెత్తడము , ఎగరడము . కోడి ఇప్పుడు మనిషి జీవితములో ఒక భాగమైపోయిందది. కోళ్ళను మనిషి పెంపుడు జీవిగా మార్చుకుని  వాటికి ఆహారము , భద్రత సమకూర్చాక  వాటికి ఎగరాల్చిన అవసరము లేకుండాపోయింది.


  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

1 comment:

your comment is important to improve this blog...