Saturday, May 24, 2014

What is Computer UPS?,కంప్యూటర్‌ (UPS‌) యుపిఎస్‌ అంటే ఏమిటి?.

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q : What is Computer UPS?,కంప్యూటర్‌ (UPS‌) యుపిఎస్‌ అంటే ఏమిటి?.

Ans : కంప్యూటర్‌ కరెంట్‌పై ఆధారపడి పనిచేసే పరికరం. కరెంట్‌ లేకపోతే కంప్యూటర్‌ పనిచేయదు. కరెంట్‌ సప్లైలోని హెచ్చు తగ్గులు సిస్టమ్‌ యూనిట్‌పై ప్రభావం చూపి మానిటర్‌లో పిక్చర్‌ట్యూబ్‌ పోవటమో, మదర్‌బోర్డు పాడవటమా, హార్డ్‌డిస్క్‌ క్రాష్‌ అవడమో జరిగిపోయే ప్రమాదముంది. మరీ ఇంతటి ప్రమాదాలు గురించి ఎందుకు? ఒక ఫైల్‌ మీద పని చేస్తున్నపుడు సడెన్‌గా కరెంట్‌పోతే ఆఫైల్‌లో ఇంకా సేవ్‌ చేయని భాగం తూడిచి పెట్టు కుపోవచ్చు. లేదంటే ఆ ఫైలే కరఫ్ట్‌ అయిపోవచ్చు.ఇటువంటి సమస్యలను నివారించడానికి తయారుచేయబడినదే యుపిఎస్‌. - అన్‌ ఇంట్రప్టెడ్ పవర్ సప్లై - పేరులోనే ఈ పరికరం ఉపయోగం చెప్పబడింది. అడ్డంకులు లేకుండా కరెంట్‌ను సప్లై చేస్తుంది అని అర్థం. అంటే ఓల్టేజి హెచ్చు తగ్గులను ముందుగానే తాను గ్రహించి కావల్సినంత కరెంట్‌ను కంప్యూటర్‌కు అందిస్తుంది. బ్యాటరీ సహాయంతో కరెంట్‌పోయినా కొంతసేపు అంటే పనిచేస్తున్న ఫైల్‌ను సేవ్‌ చేసుకుని కంప్యూటర్‌ను షట్‌డౌన్‌ చేసేంత వరకూ కావల్సిన కరెంట్‌ సప్లై ఇస్తుంది.

యుపిఎస్‌లో ముఖ్యమైన భాగం బ్యాటరీ, ఇంకా ఎలక్ట్రానిక్‌ సర్క్యూటీ, పవర్‌ సప్లై యూనిట్‌ ఉంటాయి. కరెంట్‌ సప్లైలోని హెచ్చు తగ్గుల్ని భాగం బ్యాటరీ - ఇంకా ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్రీ ది. పవర్‌ సప్లై యూనిట్‌ ఎసి కరెంట్‌ను బ్యాటరీ శక్తిగా (డిసి కరెంట్‌) మార్చు కుని బ్యాటరీలో నిల్వ చేస్తుంది.

కంప్యూటర్‌ ఏ కరెంట్‌తో పని చేస్తుంది? కంప్యూటర్‌ డిసి కరెంట్‌తో పని చేస్తుంది. కాబట్టి మెయిన్‌ లైన్‌ నుండీ వచ్చే కరెంట్‌ను సిపియులోని పవర్‌ సప్లై బాక్స్‌ తీసుకుని డిసి గా మార్చి కంప్యూటర్‌ భాగాలకు అందిస్తుంది. మధ్యలో యుపిఎస్‌ ఉంటే అది ముందుగా మెయిన్‌ లైన్‌ నుండీ కరెంట్‌ను స్వీకరించి కంప్యూటర్‌కు అవసరమైనంత ఓల్టేజిలో పవర్‌  సప్లై బాక్స్‌కు కరెంట్‌ను అందిస్తుంది.

యుపిఎస్‌ల్లోనూ రకాలున్నాయి.

1. ఆఫ్‌లైన్‌ యుపిఎస్‌, 2. హైబ్రిడ్‌ యుపిఎస్‌, 3. ఆన్‌లైన్‌ యుపిఎస్‌

ఆఫ్‌లైన్‌ యుపిఎస్‌ కరెంట్‌లో వచ్చే హెచ్చుతగ్గుల్ని నియంత్రించి కంప్యూ టర్‌కు నేరుగా కరెంట్‌ను అందిస్తుంది. కరెంట్‌ పోయినపుడు బ్యాటరీ ద్వారా కరెంట్‌ను అందిస్తుంది.

ఆన్‌లైన్‌ యుపి ఎస్‌ కరెంట్‌ను నేరుగా బ్యాటరీకి తీసు కుని కరెంట్‌ ఉన్నా లేకున్నా బ్యాటరీ నుండే కంప్యూటర్‌కు అందిస్తుంది.

హైబ్రిడ్‌ యుపిఎస్‌ లేదా లైన్‌ ఇంట రాక్టివ్‌ యుపిఎస్‌పై రెండింటి పనుల్నీ ఏ సమయంలో ఏది అవసరమో దాని ఆధారంగా చేస్తుంది. యుపిఎస్‌ కంప్యూటర్‌లో భాగం కాదు.కంప్యూ టర్‌కు ఒక అదనపు అవసరం. యుపిఎస్‌ లేకున్నా కంప్యూటర్‌ పని చేస్తుంది. అయితే యుపిఎస్‌ లేని కంప్యూటర్‌ ఓల్టేజి హెచ్చుతగ్గులకు గురయ్యి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
  • ==========================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Modem is using for what?,మోడెమ్‌ ఎందుకు వాడుతారు?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : Modem is using for what?,మోడెమ్‌ ఎందుకు వాడుతారు?
జ : 'టెలిఫోన్‌' టెక్నాలజీలో 'సౌండ్‌'ను 'ఎనలాగ్‌ సిగ్నల్స్‌'గా మార్చి ఒక చోటి నుండీ మరొక చోటకి పంపుతారు. కంప్యూటర్‌లో ఉండే 'డేటా' 'డిజిటల్‌' సిగ్నల్స్‌ రూపంలో ఉంటుంది. దీనిని 'ఎనలాగ్‌'గా మార్చగలిగితే సమా చారాన్ని కూడా ఒక చోటనుంచీ మరొక చోటికి పంపవచ్చు కదా! అన్న ఐడియా తో కనుగొనబడిందీ మోడెమ్‌.

మన కంప్యూటర్‌లో ఉన్న డిజిటల్‌ డేటాని అనలాగ్‌ సిగ్నల్స్‌ మాడ్యులేట్‌ చేయాలి. వేరే కంప్యూటర్‌కు చేరగానే మరలా 'అనలాగ్‌' నుండీ డిజిటల్‌ డేటాగా డీమాడ్యులేట్‌ చేయాలి. ఈ రెండు పనులూ చేయగలిగే పరికరముంటే సమాచారాన్ని ఒక చోట నుండీ మరోక చోటికి పంపటం సాధ్యం.  దానికే పేరు పెట్టాలి? అది చేసే పని మాడ్యులేటింగ్‌, డీమాడ్యులేటింగ్‌ కాబట్టి మొదటి పదంలోని మొదటి రెండక్షరాలు, రెండో పదంలోని మొదటి మూడక్షరాలు కలిపి మోడెమ్‌గా పేరు పెట్టారు.

మోడెమ్‌ ప్రవేశంతో ఇంట ర్నెట్‌ అవతరించింది. నేడు కమ్యూ నికేషన్‌ రంగంలో కంప్యూటర్‌ తన విశ్వరూపాన్ని చూపుతోంది. మోడెమ్‌ ఆవిర్భావంతో మొట్టమొదటి 'ఫాక్స్‌' ప్రవేశపెట్టబడింది. డాక్యుమెంట్లను, ఉత్తరాలను ఫోన్‌ చేరగలిగేంత దూరమూ వెంటనే యధాతధంగా పంపే వీలు ఫ్యాక్స్‌కు ఉండేది.

మోడెమ్‌ సామర్థ్యం :

మోడెమ్‌ సేకన్‌కు ఎన్ని బిట్స్‌ సమాచారాన్ని తరలిస్తుంది లేదా స్వీకరిస్తుంది అనే విషయాన్ని మోడెమ్‌ సామర్థ్యంగా గుర్తిస్తారు. దీనిని బిట్స్‌ పవర్‌ సెకండ్‌లలో కొలుస్తారు. ఈ వేగాన్నే 'బాడ్‌రేట్‌' అంటారు. బైనరీ డిజిట్స్‌ రూపంలో సమాచారాన్ని పంపేటపుడు '1' నుండీ '0' కీ  '0' నుండీ '1' మారడాన్ని స్టేట్‌ ఛేంజ్‌ అంటారు. ఈ స్టేట్‌ ఛేంజ్‌ లేదా స్థితి మార్పు సెకన్‌కు ఎన్ని సార్లు జరుగుతుందో దానినే బాడ్‌రేట్‌ అంటారు. మోడెమ్‌ వేగాన్ని బిట్స్‌ పర్‌ సెకండ్‌, కిలోబైట్స్‌ పర్‌ సెకండ్‌, మెగా బైట్స్‌ పర్‌ సెకండ్‌లలో కొలు స్తారు.

మోడెమ్‌లో రకాలు : మోడెమ్‌లు ప్రధానంగా రెండు రకాలు

1. ఇంటర్నల్‌ మోడెమ్‌
2. ఎక్స్‌టర్నల్‌ మోడెమ్‌

ఇంటర్నల్‌ మోడెమ్‌ కంప్యూటర్‌ లోపల ఫిక్స్‌ చేయడానికి వీలుగా ఉండే కార్డు రూపంలో ఉంటుంది. ఎక్స్‌టర్నల్‌ మోడెమ్‌ విడిగా బయట నుంచి సిపి యుకు సీరియల్‌ పోర్ట్‌ ద్వారా కనెక్టు చేస్తారు. రెంటింటి పనీతీరు, మన్నిక అన్నీ ఒక్కటే. ఎక్స్‌టర్నల్‌ మోడెమ్‌ అయితే దాని పనితీరును ఇండికేటర్‌ లైట్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్నల్‌ మోడెమ్‌కు ఆ ఆవకాశం ఉండదు.

మరిన్ని మోడెమ్‌ విషయాలు :

సెకన్‌కు 600 కంటె ఎక్కువ బిట్స్‌ సమాచారాన్ని పంపవలసి వచ్చినపుడు మోడెమ్‌ ఆ సమాచారాన్ని పాకెట్లుగా కుదించి పంపుతుంది. దీని కోసం మోడెమ్‌లోనే బిల్టిన్‌ కంప్రెషన్‌ ప్రోగ్రామ్‌ ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్‌ ఎలా పని చేస్తుంది. ఏ నిష్పత్తిలో సమాచారాన్ని కుదించి పంపుతుంది అనే విషయాన్ని గుర్తించండి.

మాడెమ్‌ పాకెట్‌లలో సమాచారాన్ని పంపేటపుడు కొన్ని పాకెట్లు మిస్సయ్యే ప్రమాదముంది. అలాంటి సందర్భంలో ఆ పొరపాటును సర్దుకుని మిస్సయిన పాకెట్‌ను తిరిగి పంపగలిగే ఎర్రర్‌ కరెక్షన్‌ కూడా ఉండాలి.

టెలిఫోన్‌ లైన్‌ సరిగా లేనపుడు మోడెమ్‌ పని చేసే భాగం కూడా తగ్గుతుంది. దీనిని ఫాల్‌ బ్యాక్‌ స్పీడ్‌ అంటారు. లైన్‌ క్లియర్‌గా ఉంటే ఆ లైన్‌లో ఎంత వేగంతో పంపవచ్చో అంత వేగం పెరుగుతుంది. దీనిని 'ఫాల్‌ ఫార్వార్డ్‌ స్పీడ్‌' అంటారు. ఇంటర్నెట్‌లో డౌన్‌లోడ్‌ చేస్తున్నపుడు ఈ వేగాన్ని మనం గమనించవచ్చు.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, May 17, 2014

What isYam? - talk about the precept,యమ - నియమము ల గురించి తెలుపండి

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 Q : What isYam? - talk about the precept,యమ - నియమము ల గురించి తెలుపండి ?

Ans : పతంజలి ద్వార మనకు యోగ శాస్త్రం అందినది.యమనియమాలందులోవే . పతంజలి యోగ సూత్రాలు మనలోని పవిత్రతను పినరుద్ధరించటం ఎలాగో చెప్తాయి.

1.యమములు 2.నియమములు.---యమ అంటే basics, నియమాలు(precepts) అంటే తరువాత చెప్పినవి.

1.యమ అని పేరుగలవి ఐదునీతిసూత్రాలు. వీటిని దేశకాల పరిస్ధితులతో సంబంధం లేకుండా పాటించాలంటారు(i) అహింస; (ii)ఆత్మనిగ్ర్హం ;(iii)సత్యపాలన;(iv) దోంగతనం చేయకుండా;(v) ఎవరిదగ్గర నుంచి ఏదీ ఉరికే తీసుకొకుండా ఉండటం.............ఇవి ఐదూ యమం.ఇవి ప్రాధమికం.
  1. అహింస : ఎవరికీ హాని తలపెట్టకుండుట . . . హాని చేయకుండా ఉండుట . 
  2. బ్రహ్మ చర్యము (ఆత్మ నిగ్రహం) : ఆత్మ సంయమమును పాటించి వీర్యమును రక్షించుకోవడం .. బ్రహ్మ సాక్షాత్కారము చేసుకోవడము . 
  3. సత్యము : మనసు , వాక్కు , కర్మ - వీటి ద్వారా సత్యమును ఆచరించుట .
  4. ఆస్తేయము : దొంగతనము చేయకుండుట ... ఇతరుల వస్తువులు వారి అనుమతి లేకుండా తీసుకోకూడదు .
  5. అపరిగ్రహము :  అవసరాలకు మించి భోగ్యవస్తువులను సమకూర్చుకొనకపోవడము .

2.నియమాలు కూడా ఐదు. ఈ గుణములను అలవర్చుకొన్నట్లయితే  వ్యక్తి తన సౌశీల్యాన్ని చక్కదిద్దుకొని వికసింప చేసుకోవడానికి వీలు కలుతుతుంది  ;(i)శౌచం లేదా పవిత్రత ;(ii)సంతోషం ;(iii)ఇంద్రియనిగ్రహం/తపస్ (iv)స్వాధ్యాయం (v)ఈశ్వరప్రణిధానం/భగవంతుడికి అర్పి,చుకోవటం. ఈ యమనియమాలను పాటిస్తే గురువు అనుగ్రహిస్తాడు.
  • (i)శౌచం లేదా పవిత్రత : శరీరమును ,మనసును స్వచ్చముగా ఉంచుకోవడం .
  • (ii)సంతోషం : తనకున్న దానితో తృప్తిపడడము . లేనిదానికోసము ఏ సమయము లొనైనా విచారించకుండుట .
  • (iii)ఇంద్రియనిగ్రహం/తపస్ : ఒక ఉన్నతమైన ధ్యేయముకోసము  కష్టాల్ని సహించడము లేదా అలుపెరగ కుండా పరిశ్రమించడము .
  • (iv)స్వాధ్యాయం :  సధ్గ్రంధములను అద్యయనము చేయడం . సత్పురుషులతో సాంగత్యము(స్నేహము)చేయడము .
  • (v)ఈశ్వరప్రణిధానం / భగవంతుడికి అర్పి,చుకోవటం : తాను చేసేటటువంటి కర్మలను , తనకు కలిగే కోరికలను భగవంతునికి సమర్పించడము .


- (అంతర్భాగము: మౌని-రచయిత / సేకరణ: ప్రసాద్)
  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How to termite eat wood?,చెదలు చెక్కను ఎలా తింటాయి ?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్ర : How to termite eat wood?,చెదలు చెక్కను ఎలా తింటాయి ?
జ : చెద అనేది చీమ వంటి కీటకమే . మూడు జతల కాళ్ళు ఉంటాయి. రెక్కలు ఉండవు . చెదలు పట్టి పుస్తకాలు , చెక్కబీరువాలు దెబ్బతినటం తెలిసిందే . చెదలు భూమిలోపల పుట్ట కలిగిఉంటాయి . వాటి కుండే బలమైన నోటిభాగాలవల్ల చెక్కను కొరుకుతాయి ... అయితే చెక్కలను జీర్ణం చేసుకోగలిగిన శక్తి చెదలకు సహజము గా లేదు .చెదల జీర్ణవ్యవస్థ లో సూక్ష్మజీవులు చెదలు తిన్న చెక్కలలోని సెల్యులోజని జీర్ణం చేసుకునేందుకు అవసరమైన ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఆ సూక్ష్మజీవులకు ఆవాసము , రక్షణ ... చెద కల్పిస్తే ... అవి మరోరూపము లో చెద రుణము తీర్చుకుంటున్నాయి. చెదల లోపల ఆ సూక్ష్మజీవులు కనుక లేకుంటే అవి చెక్కను తినలేవు .
  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-