ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : ఋణము అంటే ఏమిటి? అవి ఎన్ని ?
జ : ఋణము అంటే మనము బాకీ పడ్డ డబ్బులు కావు . దైవకము గా ఆద్యాత్మికముగా ఋణము అంటే మనము జీవితములో బదులు చేయవల్సిన కార్యములు అని అర్ధము .అవి మూడు ...>
త్రిఋణాలు అనగా మనిషికి ఈ భూమి మీద జన్మనిచ్చిన వారికి అతను మూడు విధాలుగ ఋణపడి ఉంటాడు. ఈ ఋణములను అతను తన జీవిత కాలంలొ తీర్చుకోవలసి ఉంటుంది. అవి 1) దైవ ఋణములు, 2) పితృ ఋణములు,3) ఋషి ఋణములు.
ఆశ్రమ ధర్మాలు అనగా మనిషి జన్మ తంతు ప్రారంభమయినప్పటి నుండి పరమపదించేవరకు మనిషి వివిధ వయసులలో చెయ్యవలసిన కర్మలే.
దైవ ఋణాలు:
మనిషి జన్మకు మూల కారణం దేవుడు కనుక మొదటగ మనిషి దేవతలకు ఋణము తేర్చుకోవాలి! యజ్ఞ యాగాదులు నిర్వహించడము దైవఋణములు తీర్చుకోవడనికి ఒక త్రోవగా చెప్పడమయినది. యజ్ఞ తంతు లో వైధిక దేవతలయిన ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, అస్విని దేవతలు మొదలయినవారిని పూజించడం చెయ్యవలెను. వివిధ రకాలయిన ద్రవ్యములు ప్రధానంగా ఆవు నెయ్యి యజ్ఞ కుండలిలొ అగ్నికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి భూతబలులు ఇచ్చి దేవతలకు ఆహారముగ సమర్పించడం జరుగుతుంది. అనగా యజ్ఞ తంతు లో తోటి జనులకు విందు భోజనములు నిర్వహించాలన్నమాట.
పితృ ఋణములు:
భౌతికంగా మనిషి కి జన్మనిచ్చిన జనకులకు, వారికి జన్మనిచ్చిన వారి పితృలకు...ప్రతి మనిషి ఋణపడి ఉంటాడనేది పితృ ఋణ సిద్ధాంతానికి ప్రాతిపదిక కావొచ్చు. ఈ పితృ ఋణాలు భారతీయులు చక్కగా తీర్చు కుంటారు. అది ఎలానంటె ప్రధానంగా పిల్లల్ని కనడం ద్వారా! పిల్లల్ని సాంప్రదాయబద్ధంగా పెంచడం ద్వార!మన సాంప్రదాయములలొ వివహం ప్రతి మనిషి జీవితంలొ ఒక ప్రధానమయిన తంతు గా నిర్వహించబడుతుంది. "ధర్మ ప్రజా సంపత్యర్ధం రతి సుఖ సిధ్యర్ధం స్త్రియముద్వహె"ఈ వాక్యానికి అర్ధం ఏమిటంటె ధర్మాన్ని కాపాడడానికి, పిల్లల్ని కనడానికి, రతి సుఖాన్ని పొందడానికి భార్య చేయిని పట్టవలెను."ప్రజయాహి మనుష్యా పూర్నాః" అనగా పిల్లల్ని కనడం వల్లనె మనిషి జన్మానికి పూర్ణత్వము లభిస్తుంది."ఆచార్యాయ ప్రియమ్ ధనమహ్రుత్య ప్రజాతమ్తుమ్ మవ్యవత్సెత్సిహ్" అనగా బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమంలోకి మారడానికి గురువుకు తగిన దక్షిణ సమర్పించుకొని ఆయన అనుజ్ఞ స్వీకరించి వివాహం చేసుకోవాలని చెప్పబడినది. ఇక్కడ విషేషమేమిటంటే మనిషి తన యొక్క తన పూర్వికుల యొక్క వంశము నిర్మూలనము కాకుండా వుండడనికి తన ధర్మ నిర్వహణలో భాగంగా వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించి పిల్లల్ని పొంది వారిని పెంచి పోషించడం చెయ్యవలెను. ఈ విధంగా పితృ ఋణాన్ని తేర్చుకోవలెను.
ఋషి ఋణములు:
ఋషి ఋణములు అనగా సన్యాసులకు ఋణములు అని కాదు. ఋషులు అనగా మనకు జ్ఞ్నాన సంపదను అందించిన మన పూర్వ గురువులు. మనకు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న వేదములు, పురాణాలు, వేదాంగాలు, ఇతిహాసాలు - రామాయణ, భారతాలు, ఉపనిషత్తులు, శిక్ష, నిరుక్తి, వ్యాకరణము, యోగ, మొదలయిన జ్ఞాన సంపదను మనకు అందించిన దైవంశ సంభూతులయిన మహా పురుషులే ఋషులు. వీరికి మనము అనగా హిందువులు ప్రత్యేకంగా ఋణపడి ఉంటారు. పైన ఉదహరించిన శాస్త్రల్ని అభ్యసించడం ద్వారను జ్ఞ్నాన సముపార్జన చెయ్యడం ద్వారాను మరియు పర్వ దినాల్లో బ్రహ్మచర్యం , ఉపవాసము పాటించడం ద్వారాను హిందువులు ఋషులకు చెల్లించాల్సిన ఋణాల్ని తీర్చుకోవలెను. మనిషి తన ఈ జన్మ లో ఈ మూడు ఋణాల్ని తీర్చుకోవడం ప్రధానకర్తవ్యం అని తెలుసుకోవలెను.
వేదాల్లో పుత్రుని యొక్క గొప్పతనము అనేక విధాలుగా వివరించబడింది. పుత్రుని ముఖము చూచినంతనే మానవుడు పితృ ఋణము నుండి విముక్తి పొందును. మనవడి శరీర స్పర్శ వలన పితృ ఋణము, దేవ ఋణము, ముని ఋణము... ఈ మూడు ఋణాలు వల్ల విముక్తి కలుగును. పుత్ర, పౌత్రులచే భయంకరమైన యమలోకమును దాటి స్వర్గమునకు వెళ్ళు మార్గము కనిపించును.
visit My website >
Dr.Seshagirirao - MBBS.