ప్ర : మహాభారతం లో పర్వాలు ఎన్ని అవి ఏవి ? (సుందరరావు పట్నాయిక్ - శ్రీకాకులం టౌన్)
జ : మహాభారత కథ ని శౌనకాది మునులకి సత్రయాగం చేస్తుండగా అక్కడికి వచ్చిన రోణమహర్షి కుమారుడున్ను, మంచి కథకుడున్ను అయిన ఉగ్రశ్రవుడు వినిపించాడు. ఉగ్రశ్రవుడు మంచి పురాణ కథకుడు కాబట్టి ఏదైనా మంచి ఇతిహాసం చెప్పమంటే మహాభారతం చెప్పాడు.
ఈ మహాభరతంన్ని .............
ధర్మశాస్త్రం తెలిసినవారు ధర్మశాస్త్రం అనిన్ని,
నీతి విషయాలలో నేర్పు కలిగినవారు నీతిశాస్త్రం అనిన్ని,
పరమాత్మా, జీవాత్మ తారతమ్యం తెలిసిన వారు వేదాంత శాస్త్రం అనిన్ని,
కవిశ్రేష్టులు గొప్ప కావ్యం అనిన్ని, పూర్వ కథలు తెలిసిన వారు ఇతిహాసం అని ప్రశంసించారు.
ఇందులో మొత్తం 18 పర్వాలు ఉన్నాయి!
1. ఆదిపర్వం,
2. సభాపర్వం,
3. అరణ్యపర్వం,
4. విరాట పర్వం,
5. ఉద్యోగపర్వం
6. భీష్మపర్వం,
7. ద్రోణ పర్వం,
8. కర్ణపర్వం,
9. శల్యపర్వం
10. సౌత్పిక పర్వం,
11. స్త్రీపర్వం,
12. శాంతిపర్వం,
13. ఆనుశాసానిక పర్వం,
14, అశ్వమేధపర్వం,
15. ఆశ్రమవాస పర్వం,
16. మౌసల పర్వం,
17. మహాప్రస్థానిక పర్వం,
18. స్వర్గారోహణ పర్వం..
ఇవి కాక సంస్కృత భారతంలో హరివంశ పర్వం, భవిష్య పర్వం వున్నాయి కాని నన్నయ్య గారు ఆ రెంటిని ఆంద్ర మహాభారతంలో చేర్చలేదు. నన్నయ్య కొనసాగించిన ఆచారాన్నే తిక్కన్న , ఎర్రన్న కొనసాగించారు.. ఐతే ఎర్రన హరివంశ పర్వంలోనే భవిష్య పురాణం చేర్చి హరివంశం పేరుతొ ప్రత్యేకంగా గ్రంధం రచించాడు.
మహాభారతం లో మొత్తం 18 పర్వాలు కలిపి ఉపపర్వాలతో మొత్తం 100 పర్వాలు ఉన్నాయి.. ఆంద్ర మహాహరతంలో మొత్తం 63 అశ్వాసాలు ఉన్నాయి. ఇందులో (తెలుగులో)21,507 పదగధ్యాలు , సంస్కృతంలో 1,00,500 శ్లోకాలతో మహాభారతం రచించారు.
Courtesy with : http://mahabharatamblog.blogspot.in/Sri Krishna.
- =======================