Thursday, March 22, 2012

నిర్మల్‌ గ్రామ పురస్కారాలు అంటే ఏమిటి ? - What is Nirmal village awards?


  • image : courtesy with Surya Telugu daily news paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


పారిశుద్ధ్యంలో నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్న అత్యుత్తమ గ్రామ పంచాయతీలను కేంద్రం జాతీయస్థాయి 'నిర్మల్‌ గ్రామ్‌ పురస్కార్‌-'లతో సత్కరింస్తుంది. . నిర్మల్ గ్రామ పురస్కారాలు స్వచ్చతకు, పరిశుభ్రతకు నిదర్శనంగా చెప్పుకుంటారు. గ్రామంలో పారిశుద్ద్యం , అభివృద్ది తదితర అంశాల పై ఎంపిక చే్స్తారు . ఈ పురస్కారాలను అందజేసే కేంద్రం కొన్ని సామాజిక అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటోంది. వాటిని మాత్రమే ఆధారం చేసుకుని పురస్కారాలకు గ్రామాలను ఎంపిక చేస్తారు. కానీ ఆ సాంకేతిక అంశాలను మినహాయిస్తే మిగిలిన పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయంలో మాత్రం అన్ని ప్రాంతాలు దాదాపు ఒకేవిధంగా ఉన్నట్లు కన్పిస్తుంది. పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్యం విషయంలో తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నిర్మల్‌ గ్రామ పురస్కారానికి ఎంపికైన గ్రామాలకు వెయ్యి జనాభా ఉన్న గ్రామానికి రూ.50వేలు, వెయ్యి నుండి రెండు వేలు లోపు జనాభా కలిగిన గ్రామానికి లక్ష రూపాయలు, రెండు వేల నుండి నాలుగువేల జనాభా కలిగిన గ్రామాలకు రూ.2లక్షలను నగదు ప్రోత్సాహక పురస్కరంగా ప్రభుత్వం అందజేయనున్నది. భారత ప్రభుత్వం ద్వారా ఈ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ ఆయా గ్రామాల సర్పంచులు, ప్రతినిధులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర 442, గుజరాత్‌ 422, మేఘాలయ 365, హర్యానా 330, హిమాచల్‌ప్రదేశ్‌ 323 గ్రామ పంచాయతీలు ఈ పురస్కారాలను అందుకున్నాయి.

గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్యం సాధించడం ద్వారా 80శాతం అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు..బహిరంగ మలవిసర్జన దురాచారాన్ని రూపుమాపి అందరికీ స్వచ్చమైన గాలి, నీరు, ఆహారం అందిస్తూ గ్రామ సీమల్లో ఆహ్లాదకరమైన పరిశుభ్ర వాతావరణాన్ని అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. గ్రామాల ఆవాసాల్లో సంపూర్ణ పారిశుద్ధ్య విప్లవం వెల్లివిరియాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్ష. వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణము . చెట్లు పెంపకము , మెరుగైన రహదారులు నిర్మించడము విషయములో సలహాలు ఈ పురష్కారాలు అమలులో ముఖ్య ఉద్దేశము .
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...