Sunday, March 04, 2012

చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు?- How did Moon formed?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు?- How did Moon formed?


జవాబు: విశ్వంలో సూర్యుడు, గ్రహాలు ఏర్పడిన తర్వాత కొన్ని గ్రహశకలాలు (ఆస్టరాయిడ్లు) గ్రహాల ఆకర్షణకు లోనై వాటి చుట్టూ తిరిగేవని, అవే కాలక్రమేణా ఉపగ్రహాలుగా మారాయని శాస్త్రవేత్తలు చెబుతారు. కానీ భూమి చుట్టూ తిరిగే చంద్రుడి కథ వేరు. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న సిద్ధాంతాల ప్రకారం సుమారు 4.5 బిలియన్‌ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిన తొలిరోజుల్లో మరో గ్రహం వచ్చి ఢీకొట్టింది. ఆ అభిఘాతానికి భూమిలోని కొంత భాగం, ఆ ఢీకొన్న గ్రహంలోని కొంత భాగం అంతరిక్షంలోకి విసిరివేయబడ్డాయి. ఈ భాగాలు ఒక చక్రంలాగా ఏర్పడి భూమి గురుత్వాకర్షణకు లోనై భూమి చుట్టూ తిరగసాగాయి. క్రమేణా ఆ భాగాలన్నీ గోళాకారంలోకి మారాయి. ఆ గోళమే చంద్రుడు. అప్పట్లో కేవలం 30 వేల కిలోమీటర్ల దూరంలోనే తిరిగే చంద్రుడు, భూమిపై తీవ్రమైన ఆటుపోట్లకు సంబంధించిన స్పర్శతరంగాలను ఉత్పన్నం చేశాడు. అందువల్ల భూమి పరిభ్రమణ వేగం తగ్గడమే కాకుండా, చంద్రుడు భూమి నుంచి మరింత దూరం జరిగిపోయాడు. ఇప్పటికీ చంద్రుడు ఏటా 3.7 సెంటీమీటర్ల వంతున దూరం జరుగుతున్నాడు. ప్రస్తుతం భూమి నుంచి చంద్రుడి సరాసరి దూరం 3,84,400 కిలోమీటర్లు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...