Saturday, March 03, 2012

Are Ravanasura Lanka and present Srilanka same?,రామాయణం లో ఉన్న రావణుడి లంక ఈనాటి శ్రీలంక ఒకటేనా?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : రామాయణం లో ఉన్న రావణుడి లంక ఈనాటి శ్రీలంక ఒకటేనా?

జ : కాదనలేము , ఔననలేము ... ఎందుకంటే ఈ భూగోళము ఎప్పుడూ ఒకే రకము గా ఉండబోదు . లక్షల సంవత్సరాల క్రితము ఈ గోళము లో ఐదు ఖండాలు లేవు . అంతా ఒకే మట్టి ముద్ద . ఒకనాడు అగాధ సముద్రము వుండే చోట హిమాలయాలు మొలిచాయి అని శాస్త్రజ్ఞులు అంటున్నారు . పర్వతాలు పెరుగు తున్నాయి. నదులు గతులు మారుస్తున్నాయి. సముద్రాలు ఒక వంక మేటవేసి మరోవైపు పల్లెలు, నగరాలు మునుగుతున్నాయి . ఖండాలు అటూ ఇటూ జరుగుతున్నాయి. అందుచేత లంక , శ్రీలంక కి అటో ఇటో తప్పక ఉండవచ్చు . అదీకాక రామాయణములోనే కిషిందకాండములో భూగోళ వర్ణన వున్నది. భారతములో భీష్మపర్వములో భూగోళ విశేషాలు కొన్ని ఉన్నాయి. ఈ రెండింటిలో తేడా కనిపిస్తుంది . అంటే రామాయణము నాటి భూగోళం భారతం నాటికి మారింది . అలా మారుతునే ఉంటుంది .

మూలము : ఉషశ్రీ. ->www.ushasri.org/
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...