Saturday, March 17, 2012

What are the eight difficulties?-అష్ట కష్టాలంటే ఏవి ?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : అష్ట కష్టాలంటే ఏవి ?

జ : కష్టము అంటే ఆరోగ్యముగా ఉండి మనషుకి , శరీరానికి.. ఏ ఒక్కదానికైనా లేదా రెండింటికీ బాధకలిగించేది ... అని అర్ధము . మన పూర్వీకులు అప్పటి పరిస్థితులను బట్టి కష్టాలను ఎనిమిదిగా బావించారు .
  1. ఇష్టములేకపోయినా తప్పనిసరిగా పనిచేయవలసి రావడము ,
  2. భయంకర దారిద్ర్యము ,
  3. భార్య ఉండీ ఉపయోగపడకపోవడము ,
  4. అడుక్కు తినే పరిస్థితి దాపురించడము ,
  5. అప్పు అడిగినా ఇచ్చేవారు లేకపోవడము ,
  6. వీసమెత్తు ఉప్పుకూడా అప్పు గా దొరక్కపోవడము ,
  7. రెండు కాళ్ళ తోనే ఎక్కడికైనా వెళ్ళాల్సి రావడము ,
  8. బిడ్డలున్నా ఒంటరి గా బ్రతకడము .
  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...