ప్రశ్న: ధ్రువాల వద్ద ఉండే ఎలుగుబంటి ఒంటిపై చర్మం నల్లగా ఉండి, దానిపై వెంట్రుకలు తెల్లగా ఉంటాయి. ఎందుకు?
జవాబు: సామాన్యంగా అడవుల్లో ఉండే ఎలుగు బంటి దేహంపై ఉండే చర్మం రంగు, దానిపై గుబురుగా ఉండే వెంట్రుకల రంగూ నల్లగానే ఉంటుంది. అదే ధ్రువ ప్రాంతాల్లో ఉండే ఎలుగుబంటి దేహంపై చర్మం నల్లగా ఉంటే, దానిపై గుబురుగా ఉండే వెంట్రుకలు (బొచ్చు) రంగు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. మామూలు ఎలుగుబంటి చర్మంపై ఉండే మందమైన, గుబురైన వెంట్రుకలు శీతాకాలంలో చలి బారిన పడకుండా ఒక కవచంలా, ఉష్ణ బంధకంలా పనిచేస్తుంది. అదే ధ్రువ ప్రాంతంలో పరిసరాలను గడ్డ కట్టించే చలి బారి నుంచి అక్కడి ఎలుగుబంట్లను కాపాడడానికి వాటి చర్మం, దానిపై ఉండే తెల్లటి వెంట్రుకలు బోలుగా ఉండి, వాటిలో గాలి నిండి ఉండడంతో అవి ఉత్తమ ఉష్ణ బంధకరూపంలో పని చేస్తాయి. గాలి ఉత్తమ ఉష్ణ బంధకం.
ధ్రువపు ఎలుగుబంట్ల చర్మం తెల్లగానో లేక లేత పసుపు రంగులోనో కనబడుతుంది. కారణం బోలుగా ఉండే వెంట్రుకల ద్వారా పయనించే సూర్యరశ్మి దాని చర్మంపై ప్రతిఫలించడమే. నిజానికి వాటి చర్మం రంగు నలుపు. అందువల్ల బోలుగా ఉండే వెంట్రుకలగుండా పయనించే సూర్య రశ్మి రంగులు బాగా శోషించడంతో వాటి రంగు తెల్లగా మెరుస్తూ ఉంటుంది.
Polar bear hair looks white because the air spaces in the hairs scatter light of all colors. When something reflects all of the visible wavelengths of light, we see the color white.
చలి ఎక్కువగా లేని జూలో ("zoo") పెరిగే పోలార్ బే్ర్స్ కొన్ని నల్ల రంగులొనూ కొన్ని గోధుమ రంగులోనూ ఉంటాయి
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు--హైదరాబాద్
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...