Sunday, November 23, 2014

Why that difference in Milk and Butter milk,పాలు-మజ్జిగల్లో ఆ తేడా ఏల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  



ప్రశ్న: మజ్జిగలో కలిపిన నీరు కాసేపయ్యాక పైన తేటగా తేలుతుంది. మజ్జిగ తెలుపు కింద పేరుకుంటుంది. కానీ పాలలో నీళ్లు పోస్తే నీరు ఎప్పటికీ పైకి తేలదు ఎందుకని?

జవాబు: ఇద్దరి మధ్య బాగా సాన్నిహిత్యం ఏర్పడితే వారిద్దరూ పాలు నీళ్లలాగా కలిసిపోయారు అంటూ సామెత కూడా ఉంటుంది. గతంలో పలుమార్లు చెప్పుకున్నట్లు పాలు ఓ కొల్లాయిడ్‌ తరహా మిశ్రమ పదార్థం. అధిక భాగం నీరే ఉన్నా అందులో ఉన్న మిగిలిన పీలిక పదార్థాలు, తైల బిందువుల మీద సూక్ష్మ స్థాయిలో విద్యుదావేశం ఉండటం పరస్పర వికర్షణ ద్వారా అవి చెల్లాచెదరుగా పాల భాగం మొత్తం సమానంగా విస్తరించి ఉంటాయి. తోడు వేసి పెరుగుగా మార్చితేగానీ, లేదా ఉప్పు వేసి పాలు విరిగేలా చేస్తేగానీ లేదా నిమ్మరసం పిండి విరిగేలా చేస్తేగానీ పాలలోని కొల్లాయిడల్‌ తత్వం పోదు. కానీ మజ్జిగ అంటేనే చిలికిన పెరుగు. పెరుగు అంటనే పాలలో ఈస్ట్‌ బాక్టీరియా విడుదల చేసిన రసాయనాల వల్ల కొల్లాయిడల్‌ తత్వం పోగొట్టుకొని పాలలోని పాల పదార్థాలు గడ్డకట్టుకున్న స్థితి. కాబట్టి అటువంటి పెరుగును చిలికి మజ్జిగ చేసినా కొల్లాయిడల్‌ తత్వాన్ని (విద్యుదావేశాల్ని) పోగొట్టుకున్న పాలలోని పదార్థాలు భూమ్యాకర్షణ వల్ల కిందికి ఎప్పడికపుడు జారుకుంటాయి. కానీ అంతటా వ్యాపించి ఉన్న నీరు పైకి తేరుకున్నట్టు అనిపిస్తుంది.

పాలస్థితిలో అందులోని పదార్థాలకు విద్యుదావేశం ఉండటం వల్ల కలిగే కొల్లాయిడల్‌ తత్వం వల్ల నీరు ఎంత పోసినా సమంగా విస్తరించి ఉంటాయి. కానీ మజ్జిగలోని పాల పదార్థాలకు విద్యుదావేశం లోపించడం వల్ల కొల్లాయిడల్‌ తత్వాన్ని పోగొట్టుకుని భూమ్యాకర్షణ వల్ల కిందికి చేరుకుంటాయి. ఇదే తేడా.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...