Saturday, November 08, 2014

కొయ్యను కరిగించవచ్చా?,కొయ్య ద్రవరూపంలో ఉంటుందా?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... కొయ్యను

ప్రశ్న:
కొయ్య ద్రవరూపంలో ఉంటుందా?

జవాబు: ప్రకృతి సహజమైన కొయ్యను కరిగించడానికి వీలు లేదు. అది మామూలు ద్రావకాలలో కూడా కరగదు. కానీ ఈ మధ్య ద్రవరూపంలో ఉండే కొయ్యను శాస్త్రజ్ఞులు రూపొందించారు. దీనితో లౌడ్‌ స్పీకరు పెట్టెల నుంచి పెన్సిళ్లు, తుపాకీ మడమలే కాకుండా అనేక వస్తువులను తయారు చేస్తారు. ఈ పదార్థంలో ఉండే ప్రధాన అంశం కొయ్యలో ఉండే 'లిగ్నిన్‌' అనే పాలిమర్‌. లిగ్నిన్‌ మొక్కలలో ఉండే కణాలకు స్థిరత్వాన్ని సమకూరుస్తుంది. కాగితపు పరిశ్రమలో వాడే కొయ్య నుంచి లిగ్నిన్‌ను వ్యర్థపదార్థం కింద తీసేస్తారు. ఎందుకంటే ఇది కాగితానికి అవసరం లేని పసుపు రంగును ఇస్తుంది. అలా తీసేసిన లిగ్నిన్‌ను ప్రకృతి సహజమైన నారు, పీచు, వివిధ రంగులతో కలపడంతో అది ఒక జిగురు పదార్థంగా ఏర్పడుతుంది. అదే ద్రవరూపంలో ఉండే కొయ్య.

  • - ప్రొ|| ఈవీ.సుబ్బారావు,-హైదరాబాద్ఎ
  • =========================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...