Friday, September 02, 2011

ఒళ్ళు గగుర్పాటు చెందితే రోమాలు లేచి నిలబడతాయి ఎందుకు ?, Why do some time hair become straight ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

చలి , భయము , అందోళన వంటివి కలిగినప్పుడు మన శరీరము పై గల రోమాలు లేచి నిలబడతాయి . అప్పుడు శరీరము గగుర్భాటు చెందుతుంది . . . శరీరము పై ఉండే ప్రతి వెంట్రుక క్రింద చిన్న కండరము ఉంటుంది . అది సంకోచించినప్పుడు ఆ వెంట్రుక లేచి నిలబడుతుంది . మన శరీరము లోని స్వతంత్ర నాడీవ్యవస్థ ప్రభావము తో రోమాలు నిక్కబొడుచుకుంటాయి . దీనిని శాస్త్రీయముగా " Pilo erection " అంటాము . ఆ సమయము లో వెంటుకల మధ్య గాలి బంధింపబడుతుంది . గాలి గదులు తయారవుతాయి . ఆ గాలి ఉష్ణబందక పదార్ధము గా ఉంటుంది . అందువల్ల శరీరము లోని వేడి బటటికి పోదు . శరీరము వెచ్చగా ఉండి చలి నుండి తట్టుకోగల శక్తి వస్తుంది .

జంతువులలో ఈ పక్రియ తమ శత్రువుల్ని బెదిరించడానికి ఉపయోగపడుతుంది . పిల్లిలో ఇలా జరిగితే లావుగా తయారై చూడడానికి భయంకరం గా ఉంటుంది . దానిని చూసి శత్రువులు పారిపోతారు . మనకి ఆ అవసరము లేకపోయినా పరిణామరీత్యా (on the way of evolution) పాత గుర్తులు ఉందిపోయాయి . ఆ శరీర ధర్మమము అలాగే ఉండిపోయింది . అది తప్పించుకోవాలంటే వేడినిచ్చే బట్టలు వేసుకోండి . భయము తగ్గిందుకోండి . కామ్‌ గా ఉండండి .
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.


No comments:

Post a Comment

your comment is important to improve this blog...