Sunday, September 04, 2011

రాత్రివేళ డ్రైవ్ చేస్తుంటే ఎదురుగా ఉన్న లైట్స్ చుట్టూ వలయాలేర్పడతాయెందుకు ? , Circles arround the lights when driving during nights-Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్ర : రాత్రివేళ డ్రైవ్ చేస్తుంటే ఎదురుగా ఉన్న లైట్స్ చుట్టూ వలయాలేర్పడతాయెందుకు ? ,

జ : కను పాప ద్వారా కాంతికిరణాలు కంటిలో ప్రవేశిస్తాయి. పగటి వెలుతురులో కను పాప చిన్నదిగా అయి కాంతికిరణాలు లెన్స్ పై కేంద్రీకరింపజేస్తుంది . రాత్రి వెలుతురు తక్కువగా ఉండడము వలన కనుపాప మరింత పెద్దది అయి ఎక్కువ కాంతికిరణాలను లోనికి ప్రవేశ పెడుతుంది . అందువలన కంటిలోని లెన్స్ పై ఎక్కువమేర కాంతికిరణాలు పడతాయి మరియు ఒకచోట కేంద్రీకరింపబడవు . లెన్స్ గుండ్రముగా ఉండడము వలన గుండ్రని వలయాలుగా కనిపిస్తాయి.

రాత్రి , పగలు అన్నివేళలా ఇలాగే కనిపిస్తూ వుంటే క్యాటరాక్ట్ వచ్చే సూచనగా పరిగణించాలి .
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...