Friday, September 09, 2011

ఆసుపత్రులలో వాడే బట్టలు ఆకుపచ్చే ఎందుకు?, Why do hospital clothes are in Green color?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న: ఆసుపత్రులలో వాడే బట్టలు, తెరలు, తువ్వాళ్లు సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయెందుకు?

జవాబు: ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. సాధారణంగా ఆసుపత్రులలో రక్తపు మరకలు అంటుకునే అవకాశాలు ఎక్కువ. వేరే రంగుల దుస్తులు వాడితే ఆ ఎరుపు రంగు మరింత ప్రస్ఫుటంగా కనిపించి రోగులను, వారి బంధువులను భయాందోళనలకు గురి చేసే అవకాశం ఉంది. ఆకుపచ్చ బట్టలపై రక్తం చిందినా అది ఎర్రగా కనిపించదు. నల్లగా కనిపించడం వల్ల ఎరుపు ప్రభావం కనబడదు. ఎందుకంటే ఆకుపచ్చ, ఎరుపు రంగులు పరస్పర విలోమ వర్ణాలు(mutually complementary colours). అంటే రెండూ కలిసినప్పుడు పరస్పరం శోషించుకుని నలుపు రంగులోకి మారతాయి. అందుకనే ముఖ్యంగా ఆపరేషన్‌ థియేటర్లలో వైద్యులు, నర్సులు ఆకుపచ్చ బట్టలను కట్టుకుంటారు.

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...