Monday, May 25, 2020

April fool birth

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

      ఏప్రిల్ ఫూల్ ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా?

మొదలెట్టేశారా? ఉదయం లేవగానే ఏప్రిల్ ఫూల్ అంటూ సన్నిహితులను, కుటుంబ సభ్యులను ఫూల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా? ఫూల్స్ డే అనగానే ప్రతీ ఒక్కరిలో ఒక చిన్నపిల్లాడు బయటకు వచ్చేస్తాడు. సరదాగా అందరినీ పూల్ చేయడం కోసం ఏవేవో గాలి వార్తలు చెబుతుంటారు. విన్నవారు అవునా నిజమా? అని అడిగేసరికి ఏప్రిల్ ఫూల్ అంటూ గట్టిగా నవ్వేస్తారు. ఎక్కడ చూసినా ఆ రోజంతా ఇవే సరదాలు, ఆనందాలు, నవ్వులు. పిల్లలైతే ముందురోజునుంచే ప్లాన్ చేసేస్తారు. ఎలా హడావుడి చేయాలా అని. అయితే అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుందా? ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫూల్స్ డే సాంప్రదాయం యూరప్‌లో పుట్టి ప్రపంచానికి పాకింది. 1582కి ముందు.. యూరోప్‌లో మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారు. 1582లో మాత్రం జూలియన్
క్యాలెండర్ స్థానంలో 13వ పోప్ గ్రేగరీ ఓ కొత్త క్యాలెండర్‌ని విడుదల చేశారు. దీని ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి అనేక దేశాలు తిరస్కరించాయి. ఆ క్యాలెండర్‌ని అనుసరించమని స్పష్టం చేశాయి. దీంతో గ్రెగోరి తరపున కొంతమంది ప్రజలు నిలిచారు. జనవరి 1న మాత్రమే కొత్తసంవత్సరం వేడుకలు
జరుపుకునేవారు. అంతేకాక.. ఏప్రిల్ ఒకటిన కొత్త సంవత్సరం అని నమ్మేవారిని ఫూల్స్‌గా జమకట్టి ‘ఏప్రిల్
ఫూల్స్’, ‘ఏప్రిల్ ఫిష్’ అంటూ ఏడిపాంచేవారు. ఇలా వచ్చిన ఏప్రిల్ ఫూల్ ప్రపంచమంతా పాకింది.

  • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Cheers ..Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ఛీర్స్ ఎందుకు చెబుతారో తెలుసా?

డ్రింక్స్‌ తాగేట‌ప్పుడు ఛీర్స్ కొట్టుకుంటారు. అయితే డ్రింక్స్‌ తాగే ముందు గ్లాసులు తాకించి ఛీర్స్‌ చెప్పుకోడం ఇప్పుడైతే సెలబ్రిటీల సింబల్‌. కానీ అది ఆరంభమైంది మాత్రం ఒక అనుమానపు చేష్టగా. మధ్యయుగం నాటి సముద్రపు దొంగలు ఈ సంప్రదాయానికి ఆద్యులు. వీరు ఓడలను దోచుకున్నాక ఆ సొమ్మును పంచుకోవడానికి, తమ విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఏదైనా దీవిపై దిగేవారు.

అయితే కొందరు దొంగలు తమ తోటివారి వాటాలను కాజేయడానికి వారి మద్యంలో విషం కలిపేవారు. అందువల్ల పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేమిటంటే మద్యం తాగే ముందు తమ గ్లాసుల్లోని మద్యం ఒకదానిలోంచి మరోదానిలోకి చిందేలా గట్టిగా తాకించుకోవడం.

అలా చేసేప్పుడు వారు ‘ఛీర్స్‌’ అనుకునేవారు. అంటే చావు భయం వద్దు… ఈ మద్యం ఇచ్చేది ఆనందం మాత్రమే అనేది వారి భావన. అలా గ్లాసులు తాకించుకొని ఛీర్స్‌ చెప్పుకునే సంప్రదాయం మొదట బ్రిటన్‌లోకి, ఆ తరువాత అది పరిపాలించిన వలస రాజ్యాల్లోకి వ్యాపించి మన దాకా చేరింది. ఇలా కొన్ని వల సంవ‌త్స‌రాల నుంచి ఈ ఛీర్స్ సంప్ర‌దాయం కొన‌సాగుతూనే వ‌స్తోంది.

Courtesy with : Andhravilas.net
  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Sun & Moon appears big at Sea Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: సాధారణ ప్రదేశాల్లో కన్నా సముద్రం దగ్గర సూర్యుడు, చంద్రుడు ఎందుకు పెద్దగా కనిపిస్తారు? ఎందుకు?.

సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయ సమయాల్లో సముద్ర ప్రాంతాల్లోనే కాకుండా.. భూమ్యాకాశాలు కలిసినట్లుగా కనిపించే చోట సూర్యుడు, చంద్రుడు పెద్దగా అగుపిస్తారు. మిట్టమధ్యాహ్నం కన్నా ఉదయం, సాయంత్రాల్లో సూర్యుడు పెద్దగా కనిపించడానికి మానవ దృష్టి భ్రమ (హ్యూమన్ ఆప్టికల్ ఇల్యూషన్) కారణమని పరిశోధనల్లో తేలింది. నిజానికి సూర్య, చంద్రుల పరిమాణాల్లో పెద్దగా తేడాలు ఉండవు. సముద్రతీరాల్లో, ఉదయం, సాయంత్రం వేళల్లో తీసిన.. అలాగే వేరే ప్రాంతాల్లో, వేరే సమయాల్లో తీసిన చిత్రాల్లో సూర్య, చంద్రుల పరిమాణాలు దాదాపు ఒకేలా ఉంటాయి.

-ప్రొ.ఎ.రామచంద్రయ్య, నిట్ వరంగల్, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)

  •  ============================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, May 14, 2020

Can aeroplane move backwards?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ప్రశ్న: విమానాలు వెనక్కు వెళ్తాయా?  విమానాలు వెనక్కు ప్రయాణించగలవా?

సా*ధారణ విమానాలు వెనక్కు ప్రయాణించలేవు. అంతెందుకు? అవి విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ (పైకి ఎగరడం) కోసం ఉన్న చోటు నుంచి వెనక్కు పోలేకపోవడంతో వాటిని ట్రాక్టరు లాంటి భారీ యంత్రం వెనక్కు లాగుతుంది. విమానాలు ప్రయాణించే యంత్రాంగంలో రెక్కలకు బిగించి ఉన్న ఇంజన్లు.. గాలిని పీల్చుకొని దహన వాయువుల్ని అధిక పీడన వేగంతో వెనక్కి నెట్టడం ద్వారా ముందుకు వెళ్తాయి. అయితే యుద్ధ విమానాల్లో ఇంజన్లను అటూఇటూ తిప్పే వ్యవస్థ ఉండటం వల్ల అవి ఎటైనా వెళ్లగలవు. హెలికాఫ్టర్లు కూడా ఏ వైపైనా వెళ్లగలవు. *

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, /నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)
 ===============================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

What is purpose of setelite sent in space

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

 ఆ అంతరిక్షనౌకల పనేంటి?

అంతరిక్షంలోకి మానవరహిత అంతరిక్షనౌకల్ని ఎందుకు పంపుతారు. వాటివల్ల ప్రయోజనాలు ఏమిటి?/*
 *పయనీర్‌-10, వాయేజర్‌-1, వాయేజర్‌-2 లాంటి అనేక మానవరహిత అంతరిక్షనౌకల్ని అంతరిక్షంలోకి పంపారు. ఇంకా అవసరాన్ని బట్టి పంపుతున్నారు. ** *సౌరవ్యవస్థలోని భాగాలను అధ్యయనం చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ** *ఇవి ఎన్నో ఛాయాచిత్రాల్ని తీసి భూకేంద్రానికి పంపుతున్నాయి. ఈ ఛాయా చిత్రాలు శాస్త్రీయవిజ్ఞానం కోసమేగాక ఇతర గ్రహాలు, చందమామ పైకి మానవసహిత అంతరిక్షనౌకలు పంపే మార్గాలు ఎలాగో తెలుపుతాయి. ** *శుక్రుడు, అంగారకుడిపైన ఉన్న వాతావరణం, వాటి ఉపరితలం ఎలా ఉన్నదో? కొంత సమాచారం ఈ అంతరిక్షనౌకల వల్లే తెలిసింది. ** *నిర్దేశించిన పనులతో పాటు ఖగోళ వస్తువుల సమాచారం తెలియజేసే ఏర్పాట్లు కూడా ఈ మానవరహిత అంతరిక్షనౌకల్లో ఉంచారు. అక్కడ జీవులుంటే భూవాతావరణం, భూమి మీద ఉన్న మానవుల గురించి సమాచారం తెలుస్తుంది. వీటిలో మనుషులకు సంబంధించి అనేక ఛాయాచిత్రాలు, 53 భాషల్లోని స్వరాల రికార్డింగ్‌, చంటి పిల్లల ఏడ్పులు, మానవుడి గుండెచప్పుళ్లు, పక్షుల రాగాలు, సాగర ఘోషల శబ్దాల రికార్డింగ్‌లు ఉన్నాయి.
*/- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం/* *
====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.- 

How the soap kills Virus?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

Q ; సబ్బు వైరస్‌ను ఎలానాశనం చేస్తుంది?

ans : సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల చేతుల మీద ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లాంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ లభిస్తుంది. ఎందుకంటే వాటిని నాశనం చేయగల అణుధర్మాలు సబ్బుకు ఉన్నాయి. చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు రుద్దుకుని కుళాయి కింద కడుక్కోవాలి. ** *ఇలా చేస్తే చేతుల మీద ఉండే వైరస్‌, అది కరోనా అయినా సరే.. నీటితోపాటు చేతి మీద నుంచి ఖాళీ అయిపోతుంది. ఇంతటి సామర్థ్యం సబ్బుకు ఉండటానికి గల రహస్యం దాని హైబ్రిడ్‌ నిర్మాణమే. ** *సబ్బు అణువుకు ఉండే తలభాగాన్ని హైడ్రోఫిలిక్‌, తోకభాగాన్ని హైడ్రోఫోబిక్‌ అంటారు. హైడ్రోఫిలిక్‌ భాగం తక్షణమే నీటితో బంధం ఏర్పరచుకోగలదు. ● హైడ్రోఫోబిక్‌ భాగం నూనె, కొవ్వు వంటి వాటితో అనుసంధానం అవుతుంది. సబ్బుకు ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటంటే మన చర్మానికి వైరస్‌కు నడుమ ఉండే జిగురు వంటి పదార్థాన్ని తొలగించగలుగుతుంది. ● నీటి ప్రవాహంలో సబ్బుతో శుభ్రం చేసుకున్న చేతులు ఉంచినపుడు ఆ నీరు సబ్బు అణువుకున్న హైడ్రోఫిలిక్‌ భాగాన్ని తనతో తీసుకుపోతుంది. ** *దీంతో సబ్బు అణువు తోకభాగం వద్ద ఉన్న నూనె, కొవ్వు, వైరస్‌లు సైతం సబ్బు అణువుతో చేతి నుంచి విడుదలై బయటకు వెళ్లిపోతాయి. సబ్బు మాత్రమే చాలా ప్రతిభావంతంగా ఇలా వైరస్‌ను నాశనం చేసి చేతులను శుభ్రంగా ఉంచుతుంది. */- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం/*
 ================================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-