Thursday, November 19, 2015

పురుగులు చిన్నగా ఉంటాయేం?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...పురుగులు చిన్నగా ఉంటాయేం?








ప్రశ్న: పురుగుల పరిమాణం జంతువుల, పక్షుల కన్నా తక్కువగా ఉంటుంది. ఎందువల్ల?

జవాబు: వాతావరణంలోని గాలిలో ఆక్సిజన్‌ శాతం ఇప్పటి కన్నా ఎక్కువగా ఉండి ఉంటే, పురుగుల దేహ పరిమాణం కూడా ఇప్పటి కన్నా ఎంతో ఎక్కువగా ఉండి ఉండేది. వెన్నెముక లేని ప్రాణుల పరిమాణం వాటికి లభించే ఆక్సిజన్‌ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. అతి సన్నని గొట్టాల రూపంలో ఉండే వ్యవస్థ పురుగుల దేహమంతా వ్యాపించి వాటికి ఆక్సిజన్‌ను అందజేస్తుంది. అందువల్ల, పురుగు పరిమాణం పెద్దదయే కొలదీ, దాని దేహానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే వ్యవస్థ విస్తారమైనదే కాకుండా క్లిష్టంగా, చిక్కుపడి ఉంటుంది. అలాంటి వ్యవస్థ పరుగుల పరిమాణంపై కొంత పరిమితిని విధిస్తుంది. వాతావరణంలోని గాలిలో ఉండే ఆక్సిజన్‌ పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే, వాటి దేహంలోని వ్యవస్థ అంత ప్రతిభావంతంగా పనిచేస్తుంది.

ప్రస్తుతం గాలిలో ఆక్సిజన్‌ 21 శాతం ఉంటే, భూమిపై జీవం ఏర్పడి ప్రాణులు తిరుగాడుతున్న తొలి రోజుల్లో గాలిలో ఆక్సిజన్‌ 35 శాతం ఉండేది అందువల్ల ఆ రోజుల్లో రెక్కల పరిమాణం 760 మిల్లీ మీటర్లు ఉండే రాక్షస తూనీగలు ఉండేవి.

అంతేకాకుండా, పురుగుల గరిష్ఠ పరిమాణంపై ఆంక్షలు విధించే మరో అంశం- పురుగుల శ్వాసనాళాల పరిమాణంలో కొంత పరిమితి ఉంటుంది. అందువల్ల పురుగుల పరిమాణం ఆ పరిమితిని దాటితే, ఆ భాగాలకు ఆక్సిజన్‌ లభించదు. అందువల్లే పురుగుల శరీర పరిమాణం అంత తక్కువగా ఉంటుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,-హైదరాబాద్‌ visit My website > Dr.Seshagirirao - MBBS.-
  • ================================
dr.seshagirirao.com/

No comments:

Post a Comment

your comment is important to improve this blog...