Thursday, November 19, 2015

పప్పు తింటే చీము పడుతుందా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్రశ్న: శరీరానికి గాయమయినపుడు పప్పు తింటే చీము పడుతుందంటారు నిజమేనా?

జవాబు: పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం శ్రేయస్కరం. అసలు చీము అంటే ఏమిటి? గాయమయినపుడు ఆ గాయపు రంధ్రం గుండా కన్నంలోంచి దొంగలు దూరినట్లు రోగకారక బాక్టీరియాలు తదితర పరాన్న జీవులు శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో పోరాడి మరణించిన మన తెల్లరక్త కణాలే! మన రక్షణ వ్యవస్థలో భాగమైన ఈ మృతవీరులే గాయమైన చోట చీముగా కనిపిస్తాయి. నశించిన ఈ తెల్ల రక్తకణాల సైన్యం స్థానంలో కొత్త తెల్ల రక్తకణాలు ఏర్పడాలంటే మన శరీరానికి తగినన్ని పోషక విలువలున్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కావాలి. ఈ రెండూ అమితంగా ఉన్న ఆహార పదార్థం పప్పు. బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు సరికదా పుండు తొందరగా మాని పోతుంది. పప్పు తినకుండా ఉంటేనే గాయానికి ప్రమాదం.


-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  •  =======================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...