Wednesday, December 17, 2014

వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
 ప్ర : వైద్యులు నాడి పట్టుకుని చూస్తారెందుకు?.

జ : ప్రస్తుత వైద్యులు  రోగిని తాకడం తగ్గించారు. . కానీ పాతరోజుల్లో వైద్యులు తమ రోగిని ముంజేయి దగ్గర పట్టుకుని చూసేవారు. అది నాడిని పట్టుకోవడము అని మనము అనుకుంటాము . వాస్తవములో వైద్యుడు రక్తనాళము పట్టుకుని చూస్తాడు . రక్తనాళము లో రక్తము ఒక క్రమవేగముతో ప్రవహిస్తుంది. అది కాకుండా ధమని గోడలు గుండె కొట్టుకోవడము మాదిరిగానే పల్స్ కొట్టుకొంటుంది. అది ఎన్నిసార్లు కొట్టుకుంటున్నాదో లెక్కపెడతారు. అనారోగ్యానికి గురి అయినప్పుడు ఆ రక్తప్రవాహ వేగము మారుతుంది. ఆ వేగము తగ్గిందా , పెరిగిందా అనేది చేయి పట్టుకుని తెలుసుకొని దానిని బట్టి రోగాన్ని అంచనావేయడము వైద్యులు చేస్తారు.
  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...