Saturday, December 13, 2014

దురద కలిగించే మొక్కలుంటాయా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

  •  
ప్ర : దురద కలిగించే మొక్కలుంటాయా?

జ : ఉంటాయి... కొన్ని రకాల మొక్కలు , గడ్డి  మన చర్మానికి తాకినప్పుడు  దురద పెడుతుంది. మన ప్రాంతాలలొ దొరికే " దురదగుండాకు " అందరికీ తెలినదే. ఇంగ్లీష్ లో స్టింగింగ్ నెటిల్ అంటారు. ఇది గ్రామాల్లో , ఊరి బయట రోడ్డు పక్కన పెరిగే ఓ పిచ్చి మొక్క. ఆ మొక్కల ఆకుల మీద సూచ్మ రూపములో గొట్టాలవంటి సూదులు ఉంటాయి. వాటి అంచుల్లో దురద కలిగించే రసాయనము ఉంటుంది . ఆ రసాయనము  ప్రభావము వలన దురద వస్తుంది. అది ఆ మొక్కలు రక్షణకోసము ఏర్పరచుకున్న వ్యవస్థ . 

ఈ విషయము తెలిసిన జంతువులు ఆ మొక్కలను మాత్రము తినవు . వాటికి దూరము గా ఉంటాయి. ఆత్మరక్షణ వాటి ఉద్దేశము . కాని మనిషికే ఇబ్బంది.
  •  ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...