ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : మెహిందీ కి హెన్నా కి తేడా ఏమిటి ?
suguna -- Srikakulam Town.
జ : మగువలు ఎంతో ఇష్టపడే
గోరింటాకు ముద్దనే మెహిందీ అంటారు . గోరింట మొక్కనే ఇంగ్లిష్ లో హెన్నా గా పిలవడం జరుగుతూ ఉన్నది . హెన్నా పౌడర్ లేదా హెన్నా డై అంటే ఒక్క గోతింటాకే కాదు ... మరికొన్ని మూలకాలు కలిపి చేసే మిశ్రమము లేదా ముద్ద . దీనికి అనాదిగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అతివలు ఎంతో ముచ్చటపడి తమ అరచేతుల నిండా తీర్చిదిద్దించుకునే గోరింటాకు పేదా, గొప్ప తారతమ్యం లేకుండా అందరినీ ఆనందంలో ముంచెత్తడం సహజం. అయితే నేటి ఆధునిక యుగంలో ముఖ్యంగా పట్టణాల్లో గోరింటాకు డిజెైన్లను వేయడం నేర్చుకుని దానినే ఉపాధిగా మలుచుకుంటున్నారు నేడు చాలా మంది యువతులు. ఈ క్రమంలోనే నగరంలో పలు చోట్ల మెహిందీ డిజెైన్ల కోసం ప్రత్యేకంగా సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో బ్యూటీపార్లర్లతోపాటు పలు పర్యాటక ప్రాంతాల్లో కూడా ఈ యువతులు గోరింటాకు డిజెైన్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారు.
అంతేగాక మరికొందరు పెళ్లిళ్లు, పేరాంటాలు, పండుగల సీజన్లలో కస్టమర్ల ఇంటివద్దకే వచ్చి గోరింటాకు డిజెైన్లు వేయడం, ప్రత్యేకంగా పెళ్లికూతుళ్లకోసం గోరింటాకు డిజెైన్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటుచేసి ఉపాధి పొందడం విశేషం. ఇదిలా ఉండగా నగంరలోని పలు ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో కొందరు చెక్క డిజెైన్ అచ్చులతో రంగు రంగుల డిజెైన్లు అరచేతుల్లో వేస్తున్నా, అచ్చమైన గోరింటాకు డిజెైన్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలువురు యువతులు తెలిపారు. ఈ రోజుల్లో కెజి నుండి పిజి వరకు చదివే విద్యార్థినులెైనా, గ్రామాలు, పట్టణాల్లో నివసించే పడతులెైనా ఎవరెైనా ఈ గోరింటాకును తమ చేతుల్లో నింపుకోడానికి ఎంతో మక్కువ చూపుతుండడం సర్వ సాధారణమైన విషయం. ఇక మార్వాడీలు, ఉత్తర భారతీయులు ఈ మెహిందీని చేతులకేగాక, పాదాలకు సైతం డిజెైన్లుగా వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా వీరు పండుగలు, పెళ్లిళ్లలోనేగాక సాధారణ రోజుల్లో కూడా ఈ విధమైన డిజెైన్లు వేసుకుంటుంటారు. ఏదేమైనా గోరింటాకు డిజెైన్లతో ఉపాధి ఏర్పర్చుకుని చాలా మంది యువతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుండడం అభినందనీయమేమరి.
మందారంలా పూసినా, గన్నేరులా పూసినా... చేతులను చూసుకొని మురిసిపోతుంటారు. పెళ్లిళ్లలో, పండగల్లో మగువల మనసుల్లో వెంటనే మెదిలేది మెహిందీ. అసలు ఏ సందర్భమూ లేకుండా చేతులకు గోరింటాకు పెట్టకోవడం కూడా ఒక వేడుకే కదా. అయితే ఏదో చేతికొచ్చింది కాకుండా మనసుపెట్టి గీయడానికి అరచేతులను కాన్వాస్‌గా మలుచుకోవాలనుకునేవారికి వెబ్‌సైట్లలో లెక్కకు మించి డిజైన్ల ఉన్నాయి. అరబిక్, పాకిస్తానీ, ఇండియన్, బ్రైడల్, రాజస్థానీ...ఒకటేమిటి? కళ్లు చెదిరిపోయే డిజైన్లను చూస్తూ కూర్చోకుండా గోరింటతో అరచేతులకు అందాలు అద్దండి.
హెన్నా పౌడర్ అంటే ఒట్టి గోరింటాకు పొడే అనే అభిప్రాయం చాలామందికి ఉన్నది. హెన్నా పౌడర్‌లో చాలా హెర్బల్ పౌడర్స్ కలుస్తాయి. వాటిలో కొన్ని గోరింటాకు పొడి, మెంతుపొడి, అవ్లూపౌడర్, ట్రిప్‌లా ఇలా ఇంకా కొన్ని కలుపుతారు. ఈ మొత్తం కలిపినదే హెన్నా పౌడర్. హెన్నా కురులకు మేలు చేయడమే కాకుండా చుండ్రును కూడా నివారించగలుగుతుంది.
కావలసిన పదార్థాలు :గోరింటాకు పౌడర్ - 2 కప్పులు
నిమ్మకాయలు - 3
పెరుగు - 1/2 కప్పు
టీ డికాషన్ - 1 కప్పు
గ్రుడ్లు - 2
తయారుచేయు విధానం :ఇవ్వన్నీ వేసి మెత్తగా పేస్టులాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత సుమారు 6 గంటల పాటు దానిని వుంచాలి. తరువాత చేతులకు గ్లౌజులు వేసుకుని వెంట్రుకలను పాయలు పాయలుగా తీసుకుని స్కాల్స్ నుంచి వెంట్రుక చివరిదాకా ఈ పేస్టును రాయాలి. జుట్టు అంతా పట్టించి ఒక ముడిలాగా మాడుపైన పెట్టుకోవాలి. మొత్తం పెట్టాక 2 గంటలు వుంచుకోవాలి. ఇది త్వరగా ఆరాలని ఫ్యాను క్రిందగాని ఎండలోగాని నించోకండి. 2 గంటలు అయిన తర్వాత తలస్నానం చేయాలి. చక్కగా నిదానంగా నీళ్ళతో షాంపు చేసుకోవాలి. తర్వాత తలను సహజసిద్ధంగా ఆరనిస్తే కురులు మరింత ఆరోగ్యవంతంగా వుంటాయి.
హెన్నా వలన లాభాలు*శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
*శరీరానికి హెన్నా కారణంగా ఎలాంటి హానీ కలగదు. చర్మానికి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ ఉండవు.
*హెన్నా చర్మానికి, శిరోజాలకూ మేలుచేసే సాధనం.
*కురులకు మంచి కండిషనర్.
*ఇది యాంటీ ఫంగల్‌గా పనిచేస్తుంది. చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడంలోని అసలు పరమార్థం ఇదే!
*చుండ్రును సమర్థవంతంగా అరికడుతుంది
- ======================================
visit My website >
Dr.Seshagirirao - MBBS.