Sunday, October 17, 2010

అక్కడి నీరు ఎక్కడిది? ,How do we get water in Fridge?



ప్రశ్న: రిఫ్రిజిరేటర్‌లో డీప్‌ఫ్రీజర్‌ అర అడుగున, చుట్టుపక్కల మంచు పేరుకుపోతుంది కదా? అక్కడ గడ్డకట్టే నీరు ఎక్కడిది?

-బి. వెంకట సాయిరామ్‌ రెడ్డి, 8వ తరగతి, ఆదోని

జవాబు: మనం ఫ్రిజ్‌ను వాడేప్పుడు చాలా సార్లు దాని తలుపు తెరుస్తుంటాము కదా. బయటి గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌లాంటి వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుందని చదువుకుని ఉంటారు. మనం తలుపులు తీసినప్పుడల్లా గాలి లోపలికి చొరబడి డీప్‌ఫ్రీజర్‌కి తగులుతూ ఉంటుంది. ఆ గాలిలోని నీటి ఆవిరి అక్కడి అత్యల్ప ఉష్ణోగ్రతకి గురై క్రమేణా మంచు పొరల్లాగా మారుతుంటుంది. ఫ్రిజ్‌ లోపల చల్లని పరిస్థితుల్లో పీడనం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లనే తలుపులు తీసినప్పుడల్లా బయటి గాలి వేగంగా లోపలికి చొరబడుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...