Sunday, July 04, 2010

ఎ.టి.యం డబ్బిచ్చేదెలా? , A.T.M-How it gives money




ప్రశ్న:
మీటలు నొక్కితే డబ్బులిచ్చే ఏటీఎం ఎలా పనిచేస్తుంది?

జవాబు:
ఏటీఎం (ATM) అంటే Automatic Teller Machine. ఖాతాదారులు ఈ యంత్రం ద్వారా డబ్బులు తీసుకోడానికి వీలుగా బ్యాంకులు ఏటీఎం కార్డును ఇస్తాయనేది తెలిసిందే. ఆ కార్డుపై ఉండే అయస్కాంతపు బద్దీ(magnetic strip)లో ఖాతాదారుని వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. కార్డును ఏటీఎం యంత్రంలోని స్లాట్‌లో జొప్పించగానే అందులోని PIN (Personal Identification Number) బ్యాంకులోని ఖాతాకు అనుసంధానమవుతుంది. ఖాతాదారునికి మాత్రమే తెలిసిన ఆ నెంబర్‌ను మీటల ద్వారా నొక్కితేనే తదుపరి లావాదేవీలు జరిపేలా రక్షణ ఏర్పాటు ఉంటుంది. సరైన ఖాతాదారు తనకు కావాల్సిన డబ్బు ఎంతో సూచించగానే ఆ సంకేతాలు బ్యాంక్‌లో ఉండే కేంద్రీయ(central) కంప్యూటర్‌కి అందుతాయి. అది ఆ ఖాతాలో బ్యాలన్స్‌ను సరిచూసి తిరిగి ఏటీఎంకు సంకేతాన్నిస్తుంది. వెంటనే ఏటీఎంలో యంత్రవిభాగాలు స్పందించి నోట్లను లెక్కిస్తాయి. కేంద్రీయ కంప్యూటర్‌తో అనుసంధానమై ఉండే పరారుణ స్పర్శీయ సాధనం (Infrared Sensing Device) ఆ డబ్బు సరైన మొత్తంలో ఉందో లేదో గమనిస్తుంది. పొరపాటు ఉంటే 'రిజెక్ట్‌ బాక్స్‌'కి పంపిస్తుంది. సరిగా ఉంటే కరెన్సీ నోట్లు ఏటీఎంలోని డెలివరీ స్లాట్‌కు రోలర్ల సాయంతో చేరుకుని నెమ్మదిగా విడుదల అవుతాయి. ఆపై అతడు జరిపిన లావాదేవీ వివరాలను తెలిపే స్లిప్‌ కూడా బయటకి వస్తుంది. ఆపై ఏటీఎం ద్వారా బ్యాంకుకు సంకేతం అందగానే అక్కడి కేంద్రీయ కంప్యూటర్‌ ఎకౌంట్‌ను అప్‌డేట్‌ చేస్తుంది. ఎప్పుడైనా డబ్బు తీసుకునే అవకాశం ఉండడంతో కొందరీ యంత్రాన్ని సరదాగా 'Any Time MoneyÑఅంటారు.
-
A.T.M. వాడకము లో జాగ్రత్తలు :
బ్యాంకులలో పొడవాటి క్యూలలో గంటల తరబడి నిలబడే దాదాపు ఎక్కడపడితే అక్కడ అమర్చిన " ఏ.టి.ఎం " వినియోగం ఈ రోజుల్లో భా పెరిగింది . ఎప్పుడు కావాలంటే అప్పుడు , ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి భలే సదుపాయము గా ఉంది .
  • ఏ.టి.ఎం. కార్డును మీరు వినియోగించే సమయము లో చుట్టుప్రక్కలవారెవ్వరూ మీ పిన్‌ నెంబరును గమనించకుండా జాగ్రత్త పడాలి .
  • కార్డు నెంబరు , పిన్‌ నెంబరు ఏ సందర్భములోనూ ఇతర వక్తులకు చెప్పద్దు .
  • కొన్ని ఏ.టి.ఎం. లలో ట్రాంసాక్షన్‌ జరిపేందుకు ఏటిఎం లోని స్లాట్ లో కార్డును ఇంసర్ట్ చేయాలి ... కొన్ని మెషిన్‌ లలో స్క్రాపింగ్ సిస్టం ఉంటుంది ... అటువంటి సమ్యాలలో దాని పంప్యూటర్ స్క్రీన్‌ పై వచ్చే సూచనలు జాగ్రత్తగా గమనించాలి . తర్చుగా ఒక ట్రాంసాక్షన్‌ పూర్తికాగానే " do you want to proceed further " అనే ప్రశ్న స్క్రీన్‌ పై కనిపిస్తుంది . మరో ట్రాంసాక్షన్‌ అవసరము లేనపుడు ' no' బటన్‌ క్లిక్ చేస్తే మీ పని పూర్తి అవుతుంది , లేదంటే మెమరీ లో మీకార్డు డేటా తరువాతవారు చూసే అవకాశము ఉంటుంది .
  • ఏటిఎం కార్డు ను డెబిట్ కార్డు వలె ఉపయోగించాలి . ఏటిఎం - కమ్‌-డెబిట్ కార్డు తో షాపింగ్ కనుక చేస్తే ఆ సమ్యములో కార్డు ఒకసారికి మించి స్కాప్ కాకుండా జాగ్రత్త వహించాలి . ఒకవేళ అలా జరిగితే దానిని గమనించి షాపింగ్ రశీదును మీ వద్ద జాగ్రత్త గా దాచుకోవాలి .
  • షాపింగ్ వేళల్లో కార్డు మీ దృష్టిపధం లోనే ఉండేలా చూసుకోవాలి ఆలా చేయడం వల్ల కార్డు ఏసందర్భములోనూ దుర్వినియోగం కాకుండా ఉంటుంది .
  • ఏటిఎం కార్డు వెనుకవైపు కార్డు వెరిఫికేషన్‌ వ్యాల్యు (సి.వి.వి.) నెంబరు ఉంటుంది .. ఆనెంబరు నూ మీరు ఒకచోట రాసి భద్రపరుచుకోవాలి . ఈ నెంబరు కూడా ఇతరులము తెలియనివ్వకూడదు . ఈ నెంబరు చాలా ముఖ్యమైనది . ఈ నెంబరు మీవద్ద ఉంటే కార్డు లేకున్నా ఏ ఇంటర్నెట్ నుంచి అయినా షాపింగ్ చేసుకునే వీలుంటుంది .
  • ఏటిఎం కార్డు పోగొట్టుకున్న సందర్భాలలో సదరు బ్యంక్ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి కార్డు వివరాలు తప్పక తెలియజేయాలి . కాల్ సెంటర్ లో మీ పేరు నమోదు చేయించుకొని " కంప్లైంట్ నెంబరు " ను తప్పక నోట్ చేసుకోండి .
ఏ.టి.ఎం. కార్డు పోయినట్లైతే :
కార్డు పోయిన వెంటనే కార్డు జారీచేసిన బ్యాంక్ కు ఆ సమాచారము అందించాలి . ఇందుకోసం కాల్ సెంటర్ లో కంప్లైంట్ నమోదుచేసుకొని ' కంప్లైంట్ నెంబరు ' నోట్ చేసుకోవాలి . మీ కంప్లైంట్ అందగానే బ్యాంక్ మీ ఏటిఎం నెంబర్ ను బ్లాక్ చేస్తుంది . తరువాత మీరు ఆ కంప్లైంట్ నెంబరును ఉదహరిస్తూ పోలీష్ స్టేషన్‌ లో పిర్యాదు చేసి , ఎఫ్.ఐ.ఆర్ ను నమోదు చేయించుకోవాలి .
మీకు తెలియకుండా ఎవరైనా మీ ఏటిఎం కార్డును వినియోగిస్తే ఆ వ్యక్తి భారతీయ శిక్షాస్మృతి ప్రకారము శిక్షార్హుడవుతాడు .
బ్యాంక్ పిర్యాదు నమోదులో జాప్యము జరిగినా లేదా నమోదు చేసుకోకపోయినా , వినియోగదారుడు '' కన్‌స్యూమర్ యాక్ట్ " కింద బ్యాంక్ పై కేసు పెట్టవచ్చును .
  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...