పూర్వము 2000 (రెండు వేల)ఏళ్ళ క్రితం చైనా లో ఓ వంటవాడు తమాసా గా ఒకరోజు వంటగదిలోని మూడు పొడులను కలిపి ఏదో చేద్దామని బానలి (పెనము) పై వేడి చేసున్నాడు . ఇంతలో పొయ్యిలోనుంచి ఒక నిప్పురవ్వ పడి ఆ మిశ్రమము పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది . ఆ పొడులు సాదారణము గా వంటగదిలో ఉండే .. బొగ్గుపొడి , గంధకము , ఒక రకమైన ఉప్పు . ఇక దాంతో ప్రయోగాలు మొదలు పెట్టేడు . ఆ పొడులను కలిపి వెదురు బుంగ లో కూరి మంటలో పడేస్తే అది ' డాం ' అని పేలింది . అలా పుట్టింది బాణాసంచా.
బాణాసంచా కనిపెట్టింది చైనా వాళ్ళయినా వాటిని అద్బుతమైన కళగా మార్చింది ఇటాలియన్ లు . రంగురంగులతో మిరుమిట్లు గొలిపే సామగ్రిని తయారు చేసింది వాళ్ళే . బాణాసంచా కాలుస్తున్నప్పుడు ఏర్పడే రంగులకు కారణము రసాయనాలే ... బేరియం నైట్రేట్ వల్ల ' ఆకుపచ్చ కాంతి ' , కాపర్ సాల్ట్ వల్ల ' నీలము ' , స్టాటియం నైట్రేట్ వల్ల ' ఎరుపు ' , కార్బన్ వల్ల ' కాసాయము ' , మెగ్నీషియం-అల్యూమినియం వల్ల ' తెలుపు ' , సోడియం సాల్ట్ వల్ల పసుపు కాంతి విడుదల అవుతాయి .
బాణాసంచా రికార్డులు :
- జపాన్ లో 1988 లో తయారు చేసిన అతిపెద్ద చిచ్చుబుడ్డి గిన్నెస్ రికార్డుల్లోకి ఎక్కింది . 54.7 అంగులాల వ్యాసము , 750 కిలోల బరువు ఉండే దీన్ని వెలిగించినపుడు రవ్వలు 3,937 అడుగుల వ్యాసము వరకూ విరజిమ్మినాయి .
- మలేషియా లో 1988 లో 33,38,777 టపాలను ఉపయోగించి చేసిన 18,777 అడుగుల పొడవైన దండ ను పేల్చితే 9 గంటలు 27 నిముషాల పాటు ఆగకుండా పేలింది .
- పోర్చుగల్ లో 2006 లో ఏకంగా 66,326 ఫైర్ వర్క్స్ ను కాల్చి ప్రపంచరికార్డు సృస్టించారు . ఇవి ఒకదాని తర్వాత ఒకటి గా ఆకాశములోకి దూసుకుపోఇ వెలుగుపూలు విరజిమ్మాయి .
- బ్రిటన్ లో కేవలం 30 సెకనుల్లో 56405 ఫైర్ వర్క్స్ కాల్చడం ఒక రికార్డు .
- బ్రితన్ లో బీచ్ నుంచి ఒకేసారి 40.000 తారాజువ్వల ను వెలిగించి వదిలారు .
- అమెరికాలో 1992 లో ఇడాహో జలపాతము దగ్గర అతిపెద్ద భూచక్రాన్ని కాల్చారు . 47.4 అడుగుల వ్యాసము ఉన్న ఇది 3 నిముషాల 47 సెకనులు పాటు గిర్రుమంటూ తిరిగింది .
- =============================