Thursday, May 06, 2010

పిన్‌కోడ్‌లో ఆరు అంకెలేల? , PinCode contains six digits Why?





ప్రశ్న:
తపాలా చిరునామాలో వాడే పిన్‌కోడ్‌లో ఆరు అంకెల సంఖ్యనే ఎందుకు వాడతారు?

జవాబు:
పిన్‌ అనేది పోస్టల్‌ ఇండెక్స్‌ నెంబర్‌ (Postal Index Number)కి సంక్షిప్తనామం. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (postal regions)గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే ఢిల్లీ అన్నమాట. 20 నుంచి 28 వరకు ఉత్తర ప్రదేశ్‌, 29ను ఉత్తరాంచల్‌కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కి 50 నుంచి 53, కర్నాటకకి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (cluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే వరంగల్‌. 500 అంటే హైదరాబాద్‌. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. అమెరికాలో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.



  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...