Tuesday, May 11, 2010

ముక్కుకు రెండు రంద్రాలు ఏల ? , Why do humans have two nostrils when we only have one nose?





మనిషికి ముక్కు ఒక్కటే అయినా రెండు రంద్రాలు విడివిడి గా ఉంటాయి . చూడడానికి రెండూ ఒకే లా ఉన్నా, ప్రక ప్రక్క నృ ఉన్నా రెందు రంద్రాలు భిన్నము గా పనిచెస్తాయి . మానవ శరీరములొ అవయవాలు కొన్ని తప్ప అన్నీ అర్ధ నారీశ్వరము గా అమరి ఉంటాయి . ఒకటి పని చేయడం లో తేడా వచ్చినపుడు శరీరము ఇబ్బంది పడకుండా అలా అవరి ఉన్నాయని అనుకోవాలి . రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు ఆరోగ్యం గా ఉన్నప్పుడు వాటి పనిని సర్ది పంచుకొని కొచం భిన్నం గా పనిచెస్తాయి . జీవ పరిణామ క్రమములో ఒకజీవి నుండి పరివర్తనం చెంది మరొక జీవి పుట్టేవే కాబట్టి పురాతన జీవులలో రెండు నాసికా రంధ్రాలు వేరు వేరు పనులు నెరవేర్చేందుకు వాడబడేవని అనుకో్వాలి .

వాసన వచ్చేదిశ పసిగట్టేందుకు రెండు ముక్కు రంద్రాలు బిన్నముగా స్పందిస్తాయి . అంతేకాదు ఒక రంధ్రం ఒకలాంటి వాసం లను గ్రహిస్తే , రెడెవ రంధ్రం మరోరకం వాసనలను గ్రహిస్తుంది .

రెండు ముక్కు రంధ్రాలలొ గాలి ప్రవహించే వేగం ఒకేలా ఉండదు . . రక్త సరఫరా జరిగే తీరు లో కూడాకొద్ది తేడా ఉంటుంది . వీటివలన నాసికారంధ్రాలు రెండూ భిన్నం గా పనిచేస్తాయి .


  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, May 08, 2010

రేడియో ధార్మికత అంటే ఏమిటి ?, Radioactivity-what is it?




ప్రశ్న:
రేడియో ధార్మికత అంటే ఏమిటి? అది ఏ పదార్థాల్లో ఉంటుంది? దాని వల్ల ఉపయోగమేమిటి? దీనిని ఎవరు కనిపెట్టారు?

జవాబు:
విశ్వంలో మొదట ప్రాథమిక కణాలు (elementary particles) ఏర్పడ్డాయి. వాటిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ప్రధానమైనవి. ఇవి ఒక బృందంగా ఏర్పడడం వల్ల పరమాణువులు, వాటిలో ఒకే తరహా పరమాణువులు కలవడం వల్ల మూలకాలు (elements), వేర్వేరు మూలకాల కలయిక వల్ల సంయోగపదార్థాలు (compounds) ఏర్పడ్డాయి. సాధారణంగా మనం చూసే ప్రపంచం ఈ మూలకాలు, సంయోగపదార్థాల సమాహారమే. ఇక పరమాణువుల కేంద్రకాల్లో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయని చదువుకుని ఉంటారు. ఈ కణాల సంఖ్య తక్కువైనా, మరీ ఎక్కువైనా స్థిరత్వం ఉండదు. ఎక్కువ పరిమాణం ఉండే కేంద్రకాలకు అస్థిరత్వం ఎక్కువ. కేంద్రకంలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఒక పరిమితికి మించి ఎక్కువైతే ఆ కేంద్రకాలు చిన్న చిన్న కేంద్రకాలుగా మారే ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నంలో ఆయా కేంద్రకాల నుంచి ఆల్ఫా కణాలను, ఎలక్ట్రాన్లను (బీటా కణాలు), కొంత శక్తిని గామా కిరణాల రూపంలోనూ పోగొట్టుకుంటూ స్థిరమైన కేంద్రకాలుగా మారతాయి. ఈ ప్రక్రియనే రేడియో ధార్మికత (Radioactivity) అంటారు. ఈ విషయాన్ని 1896లో హెన్రీ బెకెరల్‌ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అణు విద్యుత్‌ ఉత్పాదనలోను, వైద్య రంగంలోను, పంటల రోగ నిరోధక శక్తిని పెంచే ప్రక్రియల్లోను రేడియో ధార్మికత ఎంతో ఉపయోగపడుతోంది.

==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, May 06, 2010

భూమి కంపించనేల? , Earth Quake cause?




ప్రశ్న:
అసలు భూకంపాలు ఎలా సంభవిస్తాయి?

జవాబు:
భూమి అనేక పొరలు కలిగి ఉంటుంది. పై పొరను క్రస్ట్‌ (crust) అంటారు. భూమి మొత్తాన్ని ఒక యాపిలు పండుతో పోలిస్తే దాని తొక్క ఎంత పల్చగా ఉంటుందో, భూమికి క్రస్ట్‌ కూడా అంత పల్చగా ఉంటుంది. దీని మందం దాదాపు 70 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇదంతా రకరకాల ఆకారాల్లో ఉండే విశాలమైన ముక్కల సముదాయం. ఈ ముక్కలను 'ఫలకాలు' అంటారు. ఈ ఫలకాలన్నీ భూమి అంతర్భాగంలో ద్రవస్థితిలో ఉండే లోపలి పొర (మాంటిల్‌)పై తేలుతూ ఉంటాయి. ఇలాంటి రెండు ఫలకాలు ఒక దానికి ఒకడి రాపిడికి గురికావడం వల్లనే భూకంపాలు ఏర్పడతాయి. ఫలకాలు కలుసుకునే సరిహద్దుల్లోనే ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. ఈ ఫలకాలు ఒకదానినొకటి ఢీకొనడం, రాసుకోవడం చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. పైగా సులువుగా జరిగేది కూడా కాదు. రెండు ఫలకాలు ఒకదానిని ఒరుసుకుని ఒకటి కదలడం వల్ల విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి మొత్తం ఒకేసారి బయట పడదు. సంవత్సరాల తరబడి ఫలకాల మధ్య పేరుకున్న ఒత్తిడి శక్తి రూపంలో భూమి పొరల్లో వ్యాపిస్తుంది. ఆ శక్తి అంతకంతకు పెరిగి మొదట భూమి పొరలను వంచి, తర్వాత ఫలకాలు పగిలిపోయే దశకు చేరుస్తుంది. ఆ దశలో ఫలకాలు ఒక్కసారిగా ఊగిపోతాయి. ఫలకాలు పగిలే దశలో ఏర్పడే శక్తి తరంగాలనే 'సీస్మిక్‌ తరంగాలు' అంటారు. ఈ తరంగాలు కొన్ని వేళల్లో శబ్దాలతో కూడుకుని భూమి మొత్తాన్ని కంపింపచేస్తాయి. అప్పుడే ఆ ప్రదేశాల్లో భూకంపాలు సంభవిస్తాయి. భూకంపాలు ఎక్కువగా అగ్నిపర్వతాలు ఉండే ప్రదేశాల్లో ఏర్పడతాయి. కారణం రెండింటికీ మూలం ఫలకాల కదలికలే.

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

తేనెటీగలు కుడితే ప్రమాదమా? , Honey Bee Stings Dangerous?




పశ్న:
తేనెటీగలు కుడితే మనిషి చనిపోతాడా? అయితే అందరూ అలా చనిపోరేం? వాటికి విషం ఉంటుందా?

జవాబు:
తాచుపాము కాటు విషపూరితమైనదే. కానీ కాటుకు గురైన వారందరూ చనిపోరు. విషం పరిమాణం, వ్యక్తి నిరోధకశక్తి, చికిత్స అందేలోగా గడిచిన కాలం లాంటి అంశాలను బట్టి ప్రమాదం తీవ్రత ఉంటుంది. తేనెటీగల కాటులో విషం ఉంది. అయితే ఒకే ఒక్క తేనెటీగలో మనిషిని చంపేంత మోతాదులో విషం ఉండదు. వందలాది తేనెటీగలు ఒకేసారి కుట్టినప్పుడు ఆ మొత్తం విషం ప్రభావానికి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఏమైనా తేనెటీగలు కుట్టినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరం.

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆ శిల్పాల కధేమిటి ?, Arches of American National Park Story ?




ఏ శిల్పీ చెక్కలేదు... ఏ కూలీ కట్టలేదు... సహజంగా ఏర్పడ్డాయి...ఒకటా రెండా? వేల కొద్ది ఆకారాలు... అదే అమెరికాలోని ఆర్చెస్‌ నేషనల్‌ పార్క్‌!

ఆకాశంలో మేఘాలు రకరకాల ఆకారాలుగా కనిపిస్తేనే సంబరపడతాం. అలాంటిది వేలాది ఎకరాల్లో విస్తరించిన ప్రదేశంలో శిలలన్నీ అద్భుతమైన రూపాల్లో ఉంటే ఎలా ఉంటుంది? అలా అబ్బురపరిచే ప్రాంతమే అమెరికాలోని ఆర్చెస్‌ నేషనల్‌ పార్కు. అక్కడ ఎటు చూసినా కనిపించేది సాండ్‌స్టోన్‌ పరుచుకున్న ప్రదేశమే. ఇదంతా కోట్లాది ఏళ్లుగా ప్రకృతిలో ఏర్పడిన మార్పుల వల్ల రకరకాల ఆకారాలను సంతరించుకుని ఆశ్చర్యపరుస్తూ కనిపిస్తాయి. కొన్ని గుడి గోపురాల్లా ఉంటే, మరి కొన్ని చర్చి శిఖరాల్లా ఉంటాయి. ఇక పుట్టలు, మెలికలు తిరిగే వంపులు, గుమ్మటాల్లాంటివెన్నో రూపాలు కనిపిస్తాయి. మీకు సహజ శిలా తోరణమంటే తెలుసుగా? ఒకే శిల ఈ వైపు నుంచి ఆ వైపు వరకు ఒక తోరణంలా, వంతెనలా ఏర్పడడం. ఇలాంటి శిలాతోరణాలు ఇక్కడ ఏకంగా రెండువేలకు పైగా కనిపిస్తాయి. అందుకే దీన్ని ఆర్చెస్‌ నేషనల్‌ పార్క్‌ అంటారు. ఇక్కడుండే శిలాతోరణాల్లో అతి పెద్దది ఏకంగా 290 అడుగుల వరకు వెడల్పుతో ఉంటే, చిన్నవి మూడు అడుగుల వెడల్పుతో చూడముచ్చటగా ఉంటాయి.

అమెరికాలోని ఉతా (Utah)లో విస్తరించిన ఈ అందాల ప్రదేశం విస్తీర్ణం ఎంతో తెలుసా? 76 వేల ఎకరాల పైనే. దాదాపు 30 కోట్ల ఏళ్ల కిత్రం ఈ ప్రదేశమంతా సముద్రంతో నిండి ఉండేదని చెబుతారు. ఆ సముద్రం భౌగోళిక మార్పుల వల్ల ఇగిరిపోయింది. అందుకనే ఇక్కడి భూగర్భమంతా ఉప్పు మేటలు, ఇసుకరాతి శిలలతో కూడి ఉంటుంది. క్రమంగా ఇవి గట్టిపడిపోయి సాండ్‌స్టోన్‌ గుట్టలుగా మారింది. కాలక్రమేణా గాలులు, వర్షాల కోత వల్ల ఈ శిలలన్నీ వింత ఆకారాల్లోకి మారిపోయాయన్నమాట.

ఇక్కడి శిలాతోరణాల్లో డెలికేట్‌ ఆర్చ్‌ ఎంతో అందమైనదిగా పేరొందింది. 52 అడుగుల ఎత్తుతో ఉండే ఈ తోరణంలో నుంచి 2002లో శీతాకాల ఒలింపిక్స్‌ టార్చిని పట్టుకెళ్లారు. గతంలో ఈ ఆకారాలపైకి రాక్‌ క్త్లెంబింగ్‌కు అనుమతి ఇచ్చేవారు. కానీ అవి దెబ్బతింటున్నాయన్న కారణంగా వీటిపైకి ఎక్కనివ్వడంలేదు. 1929 నుంచి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రకటించింది. ఏటా సుమారు 8 లక్షల పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.


==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఉల్కలు భూమి మీదకు ఎలా వస్తాయి? ,




ఉల్కల కథేంటీ?
ప్రశ్న:
ఉల్కలు భూమి మీదకు ఎలా వస్తాయి? ఎక్కడ నుండి వస్తాయి?

జవాబు:
ఆకాశంలో రాత్రి వేళల్లో కొన్ని మెరుస్తున్న పదార్థాలు జారి పడుతూ నక్షత్రాల్లా కనిపిస్తాయి. వీటిని రాలే నక్షత్రాలు (falling stars) లేదా దూసుకుపోయే నక్షత్రాలు (shooting stars) అంటారు. కానీ అవి నక్షత్రాలు కానేకావు. ఉల్కలు. నక్షత్రాలు అలా వూడి పడవు. గ్రహాలు ఏర్పడిన తొలి రోజుల్లో వాటి ఆకర్షణకు లోనుకాని కొన్ని శిలలు, ధూళి కణాలు విడివిడిగా మిగిలిపోయాయి. గ్రహాల్లాగానే ఇవి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే తోక చుక్కల తోక భాగం లోని మంచు ముక్కలు, శిలా శకలాలు వాటి నుంచి వేరయి అంతరిక్షంలో పరిభ్రమిస్తుంటాయి. అలాగే అంగారక గ్రహం, చంద్రుని నుంచి వెలువడిన ధూళి కణాలు కూడా అంతరిక్షంలో ఉంటాయి. వీటన్నింటినీ 'మెటియోరైడ్స్‌' అంటారు. భూమి తన కక్ష్యలో తాను తిరుగుతూ ఇవుండే ప్రాంతాలకు వచ్చినప్పుడు వీటిలో కొన్ని భూమ్యాకర్షణ శక్తికి లోనై భూవాతావరణంలోకి గంటకు 30,000 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తాయి. ఆ వేగం వల్ల వాటి ఉష్ణోగ్రత సుమారు 1650 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు పెరుగుతుంది. ఇవి భూవాతావరణంలోకి దూసుకు వచ్చేప్పుడు గాలిపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తాయి. దాంతో గాలి వేడెక్కుతుంది. ఆ ఉష్ణాన్ని గ్రహించిన మెటియోరైడ్‌ కాంతిని వెదజల్లే ఉల్కగా మారి పడిపోతుంది.

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పిన్‌కోడ్‌లో ఆరు అంకెలేల? , PinCode contains six digits Why?





ప్రశ్న:
తపాలా చిరునామాలో వాడే పిన్‌కోడ్‌లో ఆరు అంకెల సంఖ్యనే ఎందుకు వాడతారు?

జవాబు:
పిన్‌ అనేది పోస్టల్‌ ఇండెక్స్‌ నెంబర్‌ (Postal Index Number)కి సంక్షిప్తనామం. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (postal regions)గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే ఢిల్లీ అన్నమాట. 20 నుంచి 28 వరకు ఉత్తర ప్రదేశ్‌, 29ను ఉత్తరాంచల్‌కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కి 50 నుంచి 53, కర్నాటకకి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (cluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే వరంగల్‌. 500 అంటే హైదరాబాద్‌. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. అమెరికాలో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.



  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

అయస్కాంత తాతయ్య కధ ఏవిటి ? , Maganetic Man Story-What?




అయస్కాంతానికి దగ్గరగా ఓ ఇనుప వస్తువును తీసుకెళితే ఏమవుతుంది? లటుక్కున అతుక్కుపోతుంది కదా. ఆ తాతయ్య దగ్గరకి తీసుకెళ్లినా అంతే! అందుకే ఆయన్ని 'అయస్కాంత మనిషి' అంటారంతా. ఇంతకీ ఏమిటి ఈయనగారి కథ?

మీరు మలేషియా వెళ్లి 'మ్యాగ్నెటిక్‌ మేన్‌' తెలుసా అని ఎవరినైనా అడగండి. 'ల్యూతో లిన్‌ కదా? ఎందుకు తెలియదు?' అని ఎదురు ప్రశ్నిస్తారు. ఆయన అంత ప్రముఖుడు మరి. ఈ 78 ఏళ్ల అయస్కాంత తాతయ్య దగ్గరకి చెంచాలు, రేకులు, కడ్డీలు, ఇస్త్రీ పెట్టెలు ఇలా ఏ ఇనుప వస్తువైనా తీసుకెళ్తే చటుక్కున అంటుకుపోతుంది. అందరూ సరదాగా 'హలో.. మిస్టర్‌ మాగ్నట్‌' అంటారందుకే. ఈ శక్తి లిన్‌కే కాదు, ఆయన ఇద్దరు కొడుకులు, ఇద్దరు మనుమలకి కూడా ఉంది.

చెంచాలే కాదు 36 కిలోల బరువున్న ఇనుప వస్తువులు కూడా ఆయనకి అతుక్కుని ఊడిరావు. లిన్‌ తాతయ్య ఒంటికి కొక్కెం ఉన్న రేకును అతికించి, ఆ కొక్కేనికి ఇనుప గొలుసు తగిలించి, రెండో కొసను బస్సులకి, కార్లకి తగిలించినా లాగేస్తాడు! ఇంతకీ ఈయన శరీరానికి నిజంగానే అయస్కాంత శక్తి ఉందా? లేదనే చెబుతున్నారు ఈయనపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు. ఈయన శరీరానికి ఇనుప వస్తువుల్ని పీల్చుకునే గుణం ఉందిట. లిన్‌ తాతయ్య మంచి వాడు కూడా. తనకున్న ఈ శక్తితో ప్రదర్శనలు చేసి ఆ డబ్బుని బడుగులకి విరాళంగా ఇస్తాడు.

  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, May 05, 2010

బంబార్డియర్‌ బీటిల్ సంగతేమిటి? , Bombardier beetle abouts?




చూడ్డానికి చిన్న కీటకమే. కానీ దాని దగ్గర ఓ ఆయుధం ఉంది. పట్టుకోడానికి వెళ్తే ఓ ద్రవాన్ని మీదకి చిమ్ముతుంది. అదెంత వేడిగా ఉంటుందో తెలుసా? 100 డిగ్రీల సెల్సియస్‌! అంటే నీరు మరిగే ఉష్ణోగ్రతన్నమాట. దాని పేరు బంబార్డియర్‌ బీటిల్‌. పైగా ఈ వేడి ద్రవాన్ని సుమారు 20 సెంటీమీటర్ల దూరం చిమ్మగలదు. ఇంతకీ ఆ ద్రవం ఏమిటో తెలుసా? హైడ్రోక్వినాన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ రసాయనాల మిశ్రమం. దాని పొత్తి కడుపులో రెండు వేర్వేరు గదుల్లో ఈ రసాయనాలు ఉంటాయి. కావాలనుకున్నప్పడు ఇది కండరాలు బిగించి వీటిని కలిపి బైటకి పిచికారీ చేయగలదన్నమాట. ఇక దీనికి భయం ఏమిటి చెప్పండి? తిందామని ఆశగా వచ్చిన ఏ జంతువైనా సరే దీని పిచికారీకి పిచ్చెక్కి పలాయనం చిత్తగిస్తుంది! ఉత్తరమెరికా, దక్షిణ అమెరికా, యూరోప్‌, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లో కనిపించే ఈ కీటకాలు సుమారు రెండు సెంటీమీటర్లుంటాయంతే.
  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

రామన్‌ ఎఫెక్ట్‌ అంటే? , What is Raman Effect?




ప్రశ్న:
రామన్‌ ఎఫెక్ట్‌ అంటే ఏమిటి? నిత్య జీవితంలో దాని ఉపయోగాలేమిటి?

జవాబు:
సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతి లోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది (చెదిరి) మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్‌ సి.వి. రామన్‌ సిద్ధాంతీకరించారు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే 'రామన్‌ ఎఫెక్ట్‌' అంటారు.

కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్‌ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి. చాలా ఫోటాన్లు పడేటప్పటి పౌనఃపున్యంలోనే చెదిరిపోతే, కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనఃపున్యంతో చెదురుతుందన్నమాట. ఇదే రామన్‌ ఎఫెక్ట్‌. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. రామన్‌ ఎఫెక్ట్‌ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, పరమాణు నిర్మాణాల పరిశీలనకు, పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగులు, వైద్య రంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు ఉపయోగపడుతుంది.
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సన్ డే అంటే ఏమిటి ? , What is Sun Day ?




ఇవాళ 'సన్‌'డే. 'అదేంటి? సోమవారం కదా?' అని ఆశ్చర్యపోకండి. మదర్స్‌డే, ఫాదర్స్‌డే, చిల్డ్రన్స్‌డే లాగే సూర్యుడికీ ఓ రోజుంది. మే 3 అంతర్జాతీయ సూర్యుని దినం. మరి సూరీడు చెప్పే వింత నిజాలు తెలుసుకుందామా!

* మన భూమితో పోలిస్తే సూర్యుడు ఎంత పెద్దవాడో తెలుసా? భూమిని గుండు సూది తల అనుకుంటే, సూర్యుడు బాస్కెట్‌ బాలన్నమాట.
* సూర్యుడు ఒక గోళం అనుకుంటే అందులో ఎన్ని భూగోళాలు పడతాయో తెలుసా? 10 లక్షలు!
* సూర్యుడి వయసు 460 కోట్ల సంవత్సరాలు. మరో 500 కోట్ల ఏళ్ల వరకు సరిపడినంత హైడ్రోజన్‌ సూర్యుడిలో ఉంది.
* సూర్యుడి మధ్య భాగంలో ఎంత వేడి ఉంటుందో తెలుసా? 1,50,00,000 డిగ్రీల సెల్సియస్‌.
* సూర్యుడి బరువుతో సమానంగా తూగాలంటే ఎన్ని భూగోళాలు కావాలో తెలుసా? 3 లక్షలు!
* మీరు ఒక కారులో సూర్యుడి దగ్గరకు బయలుదేరారని అనుకోండి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పయనించినా అక్కడికి చేరడానికి 200 ఏళ్లకుపైగా పడుతుంది. సూర్యుడు మన భూమి నుంచి 14,96,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు మరి.
* సూర్యుని ఉపరితలం నుంచి వెలువడిన కాంతి 8.3 నిముషాల్లో భూమిని చేరుతుంది.
* సూర్యుని ఆకర్షణ శక్తి ఎంత గొప్పదో తెలియాలంటే ఫ్లూటోని అడగాలి. సూర్యుడి నుంచి 590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఇది ఆయన ఆకర్షణ పట్టులోనే ఉంది.
* తన చుట్టూ తాను తిరగడానికి సూర్యుడికి 27 రోజులు పడుతుంది.
* సూర్యుడి నుంచి ఒక్క సెకనులో విడుదలయ్యే శక్తి మన వెయ్యేళ్ల అవసరాలు తీరుస్తుంది

  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మన శరీరంలో ఎన్ని కణాలుంటాయి?, How many cells present in human body?




ప్రశ్న:
మన శరీరంలో ఎన్ని కణాలుంటాయి? కణం ఎంత పరిమాణంలో ఉంటుంది?

జవాబు:
ఒక సాధారణ మనిషిలో సుమారు 10 వేల కోట్లు నుంచి వంద లక్షల కోట్లు వరకు జీవకణాలుంటాయి. ఒకో కణం పరిమాణం శాస్త్రీయ పరిభాషలో 10 మైక్రాన్లు ఉంటుంది. ఒక మిల్లీమీటరులో వెయ్యో వంతు భాగాన్ని లేదా మీటరులో పదిలక్షలవ వంతు భాగాన్ని మైక్రాన్‌ అంటారు. ఇక బరువు విషయానికి వస్తే మిల్లీగ్రాములో పదిలక్షలవ వంతు ద్రవ్యరాశి మాత్రమే ఒకో కణం తూగుతుంది. రాబర్ట్‌ హుక్‌ అనే శాస్త్రవేత్త 1665లో సూక్ష్మదర్శిని సాయంతో కణాలను కనుగొన్నాడు. స్కీడన్‌, ష్వాన్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1839లో జీవానికి ప్రాథమిక ప్రమాణం కణాలే అని తేల్చారు. దీన్నే కణసిద్ధాంతం అంటారు. ఏయే కణాలు ఎంతెంత కాలం మన్నుతాయన్న విషయం ఆయా కణాల తత్వాన్ని బట్టి ఉంటుంది. చర్మం మీద కణాలు చాలా తొందరగా పోయి కొత్తవి వస్తుంటాయి. రక్తకణాలు కొన్ని రోజుల పాటు ఉండగలవు. అదే మెదడు కణాలు, నాడీ కణాలు ఎక్కువ కాలం (దాదాపు దశాబ్దాల వరకు) ఉంటాయి. గుండె కణాలు కూడా చాలా కాలమే ఉంటాయి.

  • ==============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

ఇంద్రధనుస్సు పాము సంగతేమిటి?, Rainbow Snake






రంగురంగుల ఇంద్రధనుస్సును చూస్తే ఆనందిస్తారా? అయితే ఆ పాముని చూసి కూడా అలా చేయండి. 'అమ్మో..' అంటారు కదూ! మీరు ఆనందించినా, భయపడినా ఆ పాము పేరు మాత్రం 'రెయిన్‌బో స్నేక్‌'. అంటే ఇంద్రధనుసు పామన్నమాట. ఇంద్రధనుస్సు మీదుగా పాక్కుంటూ వచ్చిందా అన్నట్టుగా, దీని ఒంటి మీద ఎన్నో రంగులు కనిపిస్తాయి. ఈ పాముని ఈమధ్యనే కొత్త జాతికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి ఇది ఎప్పటి నుంచో తెలిసినా, వేరే జాతిదనుకున్నారుట. ఆ తర్వాత జరిగిన పరిశోధనల వల్ల దీనికో ప్రత్యేకమైన జాతి ఉందని బయటపడింది. అంటే ఒక విధంగా 'సరికొత్త పాత పాము' అన్నమాట.ఇక దీని కోరలు, నాలుక చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఎందుకో తెలుసా? మండుతున్న నిప్పులాగా ఎర్రటి రంగులో ఉంటాయి. కోరల్లో విషం లేకున్నా కాటేస్తే భరించలేని నొప్పి పుడుతుంది. అయిదడుగుల పొడవు వరకూ పెరిగే ఇది ఎక్కువగా దక్షిణాసియాలోని మలేషియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేషియాల్లో కనిపిస్తుంది. ఆహారంగా కప్పలతో పాటు బల్లుల్ని, తొండల్ని కూడా ఆంఫట్‌ అనిపించేస్తుంది. దీనిలో వింతైన లక్షణం ఏంటో తెలుసా? కోపం వచ్చిందనుకోండి, దీని మెడ ముదురు నారింజ రంగులోకి మారిపోతుంది.
  • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మిణుగురు పురుగులు మెరుస్తాయేం? , Sparkle insects emit light why?




ప్రశ్న:
మిణుగురు పురుగులు ఎందుకు మెరుస్తాయి?

జవాబు:
మిణుగురు పురుగులు ప్రపంచం నలుమూలలా ఉష్ణమండల ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఇవి లార్వా దశలో ఉన్నప్పుడే వాటి నుంచి మెరుపులు వస్తాయి. పెద్దవయ్యాక ఈ మెరుపులను అవి సంకేతాలుగా ఉపయోగించుకుంటాయి. ఇవి వెలువరించే కాంతి ఆకుపచ్చ, పసుపు పచ్చల మిశ్రమం. ఈ కాంతిని వెలువరించే శరీర భాగాలు వేరేగా ఉంటాయి. వీటిని ఫోటోఫోరస్‌ అంటారు. జీవ రసాయన పద్ధతుల్లో వెలుగులు జిమ్మే శరీర భాగాలను జీవ దీప్తి (bio-luminesence) అంటారు. మిణుగురుల దేహంలో 'ట్యాసీఫెరిన్స్‌' అనే పదార్థాలు ఆక్సీకరణం చెంది కాంతి శక్తిగా మారుతాయి. ఈ కాంతితో పాటు ఉష్ణం విడుదల కాదు కాబట్టి దీన్ని శీతల కాంతి అంటారు.

  • ==================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, May 04, 2010

పుణ్యప్రురుషులు అంటే ఎవరు ? అలా ఎందుకు అంటారు ?,Who are Holy-Persons




పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నాడు శతకకారుడు . అయితే ఆ పుణ్యపురుషులు ఎవరు? .. వారిని గుర్తించడం ఎలా ? ..

ఎవరైతే స్వార్ధం తో జీవిస్తారో , తన అవసరాలు తప్పించి పక్కవారికి సహాయపడరో , అటుమంటివారిని అధమపురుషులు అంటారు .

ఎవరైతే తన జీవితం జీవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించుకుండా ... ఇస్టమైతే సహాయపడతారో అటువంటివారిని మధ్యమ పురుషులంటారు .

ఇతరులకు మంచి చేస్తూ ఎవరైతే స్వార్ధరహిత జీవితం గడుపుతారో అటువంటివారిని ఉత్తమ పురుషులు అంటారు . వీరే పుణ్యపురుషులు . ఇక్కడ పురుషులు అంటే మనుషులు అని అర్ధము . ఇది మనుషులందరికీ వర్తిస్తుంది .

  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Pancha Gangalu Names? , ఫంచ గంగలు అంటే ఏవి ?


ప్రశ్న : ఫంచ గంగలు అంటే ఏవి ? వాటి విశిస్టత ఏమిటి ?

జవాబు :
  1. కావేరి ,
  2. తుంగభద్రా ,
  3. కృష్ణవేణి ,
  4. గోదావరి ,
  5. గంగానది ,
అనే ఈ అయిదు నదులను హిందూ ధర్మ శాస్త్రం ప్రకారము పంచగంగలు అంటారు . వీటిని తలచుకొని ప్రతిరోజు స్నానము చేయాలి , లేదా దగ్గరలో వున్న ఈ నదుల్లో స్నానం చేసినా ఎంతో పుణ్యము వస్తుంది అని పురాణ పురుషులు అంటారు ..







  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

ఆటవస్తువులు ఎందుకు మెరుస్తాయి , Playing dolls are glazing-Why?






కొన్నిరకాల ఆటవస్తువులు చీకటిలో వెలుగునివ్వటం వెనకున్న రహస్యం వాటి తయారీలో వాడిన పదార్ధాలు . ఫాస్ఫరస్ , జింక్ సల్ఫైట్ , స్ట్రాన్క్ష్ షియం , అల్యుమినేట్ లను వెలుగు విరజిమ్మేందుకు ఉపయోగిస్తారు . ఈ రసాయనాల మీద కాంతి పడినా , చార్జింగ్ చేసినా , అందులోని ఎలక్ట్రాన్క్ష్స్ ఉత్తేజితమవుతాయి . ఆ తర్వాత ఆ ఎలక్ట్రాకిక్ లు ఆ శక్తిని వెలుగు రూపం లో తిరిగి వెదజల్లుతాయి . అలా వెదజల్లడం వల్లే ఆ వస్తువులు చీకటి సమయం లో వెలుగునిస్తాయి . వీటినే రేడియం వెలుగుగు అంటాము
  • ==================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.