Thursday, April 30, 2009
కాలి గోళ్ళు చేతి గోళ్ళు లలో తేడ ఎందుకు ?
కాలి వేళ్ళకు , చేతివేళ్ళకు వున్నా గోళ్ళు ఒకేలాగే ఏర్పడినా వాటి మందము, ఎదుగుదల లో తేడా ఉన్నట్లుగా కనిపిస్తుంది . చేతి గోళ్ళు త్వరగా పెరుగుతాయి ... కాలి గోళ్ళు కొంచం తక్కువ వేగం తో పెరుగుతాయి . కాలి గోళ్ళ పై చెప్పులు , బూట్లు రాపిడి ,, చిన్న చిన్న దెబ్బలు ప్రభావం నుండి పై పై పొరలు రాలిపోతుంటాయి . అందువలన వాటి ఎదుగుదల కుంటుపడి నెమ్మదిగా ఉంటుంది ... పై గా రక్తప్రసరణ విషయములో కుడా కాలి గోళ్ళ కు తక్కువగా ఉంటుంది. .. కావున ఎదుగుదల తక్కువగా ఉండును .
గోళ్ళు ఎదుగుదల వారానికి 1/2 మిల్లి మీటర్ నుండి 1 & 1/2 మిల్లిమీటార్ వరకు ఉంటుందని అంచనా . వ్యక్తీ ఆరోగ్య స్తితి పై ఆధారపడి వుంటుంది .
కొందరు నిద్రలోనడుస్తారుఎందుకు ?,Sleep walking possible?
నిద్రలో లేచి నడుచుకుంటూ వెళ్ళే వారున్నారు ... అయితే వారు అలానడిచి వెళుతున్న విసయము వారికి తెలియదు . 6 నుండి 12 సంవస్తరాలు వయసు పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది . పిల్లల లో అప్పుడప్పుడు మాత్రమే ఇలా నిద్ర నడక రావడానికి కారణం -
///డా . శేషగిరిరావు ///
- 'అలసటతో' వచ్చే మొద్దు నిద్ర .
- నిద్రలేమి తో భాదపడే వారిలో ,
- వత్తిడికి గురైన వారిలో ను ,
///డా . శేషగిరిరావు ///
Monday, April 27, 2009
గుడ్లగూబ లక్ష్మి వాహనం ఎందుకయ్యింది ?
విష్ణుమూర్తి సరసన ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆయన వాహనమైన గరుడ పై ప్రయాణము చేస్తుంది.
ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె వాహనం గుడ్లగూబ ... గుడ్లగుబ పగటివేళ నిద్రిస్తుంది , రాత్రిపూట తిరుగుతుంది , ఈ కారణము గా లక్ష్మీదేవి ఒంటరిగా రావాలంటే చీకటిలోనే వచ్చి , అదే చీకటిలోనే వేల్లిపోతుందన్న నమ్మకం ఉంది . విష్ణుమూర్తి వెంట ఉన్నపుడు మాత్రమె ఆమె పగటి వెలుగులో వస్తుంది .
అందుకే దీపావళి చీకట్లు ముసిరేవేల దీపాలను వెలిగించి ఆ తల్లి ని ఆహ్వానిస్తారు .

Subscribe to:
Posts (Atom)