ప్రశ్న: అప్పుడే పుట్టిన పిల్లల కళ్లు నీలి రంగులో ఉంటాయా?
జవాబు: మామూలుగా కొందరు తెల్లరంగులో ఉండే పిల్లలు పుట్టగానే వారి కళ్లు నీలిరంగులో ఉంటాయి. అలాంటి వారి కళ్లు పుట్టిన వెంటనే పూర్తిగా వృద్ధి చెందకపోవడంతో వారి కంటిపాపలో పిగ్మెంట్ తగినంత మోతాదులో ఉండదు. పిల్లలు పుట్టి పెరుగుతున్న తొలి రోజుల్లో వారి కంటి పాపలోని నీలిరంగులో ఉండే పిగ్మెంట్ వల్ల కాకుండా వారి కంటి పాపలపై పడే కాంతిలో ఉండే ఒక అంశం నీలిరంగు ప్రతిఫలించడం వల్ల ఏర్పడుతుంది. నిజానికి ఆ దశలో పసిపాపల కంటిపాపలు ఏ రంగు లేకుండా మామూలుగా ఉంటాయి.
మామూలుగా తెల్లని దేహచ్చాయ గల వ్యక్తులు ముఖ్యంగా పాశ్చాత్యదేశస్థుల్లో మెలానిన్ అనే పదార్థ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల వారికి పుట్టిన పిల్లల కంటిపాపల్లో తగినంత మోతాదులో పిగ్మెంట్ ఉండదు. అందువల్ల ఆ పిల్లల కళ్లు నీలి రంగులో ఉంటాయి. అదే దేహం రంగు నల్లగా లేక చామన ఛాయలో ఉండే వారు మెలానిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల వారికి పుట్టిన పిల్లల కంటి పాపల్లో పిగ్మెంట్ శాతం ఎక్కువగా ఉండటంతో వారి కంటిపాపలు పుట్టినపుడు గోధుమ రంగులో ఉండి వయసుపెరిగే కొలదీ ముదురు గోధుమ రంగులోకో లేక నల్లగానో మారుతాయి.
- ప్రొ॥ ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
vandana.appanna
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...