Monday, November 05, 2012

కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుంది ?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుంది ?

జ : కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.

ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి  జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి  శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

  •     గోపికలు ఉన్నా అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయం ఏంటంటే.. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. అంటే స్కలనం అనేది ఎరుగడు. నెమలి పరవశించినపుడు మగనెమలి అశ్రు ధారను ఆడ నెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగలదట. అంతేకాని అవి సంభోగించవు. అందుకే కృష్ణుడు తల  పై నెమలీక ధరిస్తాడు. మరో ముఖ్య విషయం. పిల్లన గోవిని గోవిందుని పెదవుల వద్ద స్థానం ఎలా సంపాదించావని ఒక మహర్షి అడిగాడట. అప్పుడు పిల్లనగ్రోవి ఇలా చెప్పిందట. ఇలా చూడు నాలో ఏముందని అడిగిందట. నాలో ఏమీ లేదు. ఏ కల్మషమూలేదు. ఏ కోరికలూ లేవు.. ఈ కామ, క్రోధ,లాభ, మోహ , మధ, మాత్సర్యాధి హరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకుంటే జీవితం చక్కని స్వరంలా సాగిపోతుంది. తనదంటూ ఏదీ కోరని వారినే దేవుడు తన మధుకలశాల వద్ద ఉంచుకుంటాడని చెప్పిందట పిల్లనగ్రోవి.
   
  •  మనవి : పైన ఇచ్చిన జవాబు  పురాణ పురుషుల ఊహాగానాలే . ప్రతీ జీవి లోనూ సంపర్కము వలనే పురరుత్పత్తి జరుగుతుంది. అది ప్రకృతి సహజము .పురుష బీజకణాలు , స్త్రీ బీజ కణాలు కలయిక వలనే పిండోత్పత్తి జరుగుతుంది. పురుష ఇంద్రియం నోటిద్వారా త్రాగడము ద్వారా పిండోత్పత్తి ఏజీవిలోనూ జరుగదు. జీవపరిణామ క్రమమములో క్లోయకా ద్వారా నెమళి లో గర్భోత్పత్తి జరుగుతుంది.

శ్రీకృష్ణుడి కుటుంబము
శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యల ద్వారా కూడా ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది. --Source : Wikipedia.org
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...