Friday, November 30, 2012

What about Salt Hotel?- ఉప్పు హోటలు సంగతేమిటి ?




  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

  
Q  : ఉప్పు హోటలు సంగతేమిటి ?
A :    అదొక హోటల్‌... 12 పడక గదులున్నాయి... మంచాలు, కుర్చీలు ఉన్నాయి... ఇందులో ప్రత్యేకత ఏముంది? ఇవన్నీ ఉప్పుతో కట్టినవే!
ఆ హోటల్‌లో మీరు తింటున్న పదార్థంలో ఉప్పు తక్కువైందనుకోండి. గోడను కాస్త గీరి కలుపుకుని తినేయచ్చు. ఎందుకంటే ఆ హోటల్‌ మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు మరి! ప్రపంచంలో ఉప్పు దిమ్మలతో కట్టిన హోటల్‌ ఇదొక్కటే! అయితే ఇందాకా చెప్పినట్టు గోడలు గీకడాలు  చేయకూడదు. ఈ హోటల్‌లోకి ఎవరైనా వెళ్లవచ్చు కానీ, ఒకటే షరతు! అదేంటో తెలుసా? 'ఇచ్చట గోడలు నాకరాదు!' అని ముందే చెబుతారు.

బొలివియా దేశంలోని ఉయుని పట్టణం దగ్గర ఈ 'లవణ మందిరం' ఉంది. విశాలమైన 12 గదులు, మంచాలు, కుర్చీలు, ఇతర వస్తుసామగ్రి మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు. దీని పేరు 'పాలాసియో డి సాల్‌'. అంటే స్పానిష్‌ భాషలో ఉప్పు ప్యాలెస్‌ అని అర్థం. దీని నిర్మాణానికి 15 అంగుళాల ఉప్పు ఘనాలను ఏకంగా 10 లక్షలు తయారు చేసి వాటితో కట్టారు. ఇందులో అలంకరణ కోసం పెట్టిన శిల్పాలు, కళాఖండాలు కూడా ఉప్పుతో మలిచినవే. ఇందులోని ఈతకొలనులో ఉప్పు నీరే ఉంటుంది. హోటల్‌ బయట గోల్ఫ్‌ కోర్స్‌ కూడా ఉప్పు మయమే.

అసలు దీన్నెందుకు కట్టారంటే ఆ ప్రాంతం గురించి చెప్పుకోవాలి. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉండే అక్కడి ప్రదేశమంతా ఎటుచూసినా ఉప్పే. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉప్పు క్షేత్రం. దీని మొత్తం విస్తీర్ణం 10,582 చదరపు కిలోమీటర్లు. అంటే హైదరాబాద్‌ నగరానికి 20 రెట్లు పెద్దదన్నమాట! కనుచూపుమేర ఎటుచూసినా అంతులేని ఉప్పు మేటలతో, ఉప్పు ఎడారిలా ఉంటుంది. దీన్ని చూడ్డానికి నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. వాళ్ల వసతి కోసమే ఈ ఉప్పు హోటల్‌ను కట్టారు.

దీన్ని నిజానికి 1993లోనే కట్టినా రెండేళ్లలోనే మూసివేశారు. తిరిగి 2007లో సకల సౌకర్యాలతో నిర్మించారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులు గోడల్ని నాకకుండా సిబ్బంది పరిశీలిస్తూ ఉంటారు.

  • Courtesy with : Eenadu Hai bujji.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 23, 2012

No oily stikyness on Tounge Why?నాలుకపై జిడ్డుండదేం?



  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 



ప్రశ్న: మన శరీరం మీద నూనె, నెయ్యి తదితర తైల పదార్థాలు పడితే జిడ్డు అంటుకుని సబ్బుతో కడిగితే కానీ పోదు. కానీ మనం నూనె వస్తువులను ఎప్పుడు తిన్నా నాలుక మీద జిడ్డు అంటదు. ఎందుకని?

జవాబు: మన శరీరంలో చర్మపు ఉపరితలం సేంద్రియ (ఆర్గానిక్‌) పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. నూనె, నెయ్యి లాంటి తైలాలు కూడా సేంద్రియ ద్రవాలే. కాబట్టి చర్మం మీద నూనెలు పడితే వాటి మధ్య తేలికపాటి రసాయనిక బంధాలు ఏర్పడి చర్మానికి అంటుకుంటాయి. సబ్బుతో కడిగితే కానీ పోవు. కానీ నాలుక ఎపుడూ తడిగా ఉంటుంది. ఉపరితలం అంతా లాలాజలంతో కప్పుకుని ఉంటుంది. అంటే ఒక విధంగా నాలుక ఉపరితలం నిరింద్రియ (ఇన్‌ఆర్గానిక్‌) పదార్థమయం. నూనెలకు, నీటికి పడదు. కాబట్టి నూనెల్ని జలవిరోధ (hydrophobic) పదార్థాలు అంటాము. నూనెలు కలిసిన ఆహార పదార్థాలను నమిలినప్పుడు నోటిలో ఎక్కడ చూసినా లాలాజలపు చెమ్మ ఉండడం వల్ల ఆ నూనెలు నాలుకకు అంటుకోవు.


-ప్రొ.ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Metalic vessles shining fades Why?-గిన్నెల మెరుపుకొన్నాళ్లు వాడిన తర్వాత ఉండదేం?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: లోహపు పాత్రల మెరుపు కొన్నప్పుడు ఉన్నట్టుగా కొన్నాళ్లు వాడిన తర్వాత ఉండదేం?

జవాబు: లోహపు పాత్రలను తయారు చేసిన తర్వాత ఒక రకం పొడితో రుద్దడం ద్వారా వాటిని తళతళా మెరిసేటట్టు చేస్తారు. ఇలా రుద్దడం వల్ల ఆ పాత్రల ఉపరితలం మొత్తం ఒకే రీతిగా చదును అవుతుంది. అందువల్ల ఆ పాత్రపై పడిన కాంతి కిరణాలన్నీ ఒకే విధంగా ఒక నిర్దిష్ట దిశలో పాత్ర ఆకారాన్ని బట్టి పరావర్తనం (reflection) చెందుతాయి. అందువల్లనే అవి మెరుస్తూ కనిపిస్తాయి.

వాడుతున్న కొద్దీ పాత్రలపై ఎగుడు దిగుడు గీతలు ఎర్పడి వాటి ఉపరితలం గరుకుగా మారుతుంది. దాంతో ఆ పాత్రలపై పడే కాంతి కిరణాలు ఒక క్రమ పద్ధతిలో కాకుండా చిందరవందరగా పరిక్షేపణ (scattering) చెందుతాయి. అందువల్ల కొన్నప్పటి మెరుపును అవి కోల్పోతాయి. పాత్రలపై ఏర్పడిన గీతలలో చేరిన మురికి, వాతావరణంలోని ఆక్సిజన్‌ వల్ల లోహాలు ఆక్సీకరణం (oxidation) చెందడం వల్ల కూడా పాత్రలు మెరుపును కోల్పోతాయి. స్టెయిన్‌లెస్‌ స్టీలు పాత్రలు వాటిలో ఉండే క్రోమియం వల్ల అంత తొందరగా మెరుపును కోల్పోవు.

-ప్రొ.ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Nitrous Oxide gas produce Laughter?-నైట్రస్‌ ఆక్సైడు వాయువు పీలిస్తే నవ్వు వస్తుందా?

  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: నైట్రస్‌ ఆక్సైడు వాయువును నవ్వు పుట్టించే వాయువు అంటారు. దాన్ని పీలిస్తే నిజంగా నవ్వు వస్తుందా?

జవాబు: నైట్రస్‌ ఆక్సైడు (N2O)వాయువుకి రంగు ఉండదు. పీలిస్తే హాయిగా అనిపిస్తుంది. రుచికి తీయగా ఉంటుంది. నవ్వు పుట్టించే వాయువు (లాఫింగ్‌ గ్యాస్‌) అనే పేరున్నప్పటికీ దీన్ని పీలిస్తే ఎవరికీ నవ్వు రాదు. అయితే దీన్ని పీల్చినప్పుడు మత్తు కలుగుతుంది. అందుకే వైద్యులు రోగులకు శస్త్రచికిత్స చేయడానికి ముందు ఈ వాయువును ఉపయోగించి మత్తు కలిగిస్తారు. ఆందోళన, నొప్పి భావనలతో కాకుండా ఆహ్లాదకరమైన భావనతో మత్తులోకి పోయేలా చేయడం వల్ల దీనికా పేరు వచ్చింది. అంతేతప్ప దీన్ని పీల్చినవారంతా విరగబడి నవ్వుతారని అనుకోకూడదు.

-ప్రొ. ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 22, 2012

How to solve Differences in a Couple -ఆలుమగల మధ్య అంతరాలు నివారించికోవడం ఎలా?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : -ఆలుమగల మధ్య అంతరాలు నివారించికోవడం ఎలా?
జ : -ఆలుమగలు ఎలాంటి అరమరికలు, అపార్థాలు లేకుండా అన్యోన్యంగా జీవించే ఇల్లు భూతల స్వర్గంగా ఉంటుంది. అయితే ఆలుమగలు ఎంత అనురాగంతో ఉన్న ఏదో ఒక సందర్భంలో కలతలు మూమూలుగానే వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లోనే భార్యాభర్తలు తెలివిగా మసలుకోవాలి, ప్రేమలు రెట్టింపు కావడానికి, మనస్పర్థలు పెరిగిపోవడానికి అవే మూలం. మనస్పర్థలు, భేదాలు వచ్చినపుడే కొంచెం సేపు లేదా కొన్ని గంటలు ఎడమొఖం పెడముఖంగా ఉన్నా, ముందు ఉక్రోషాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని తప్పెవరిదో కూల్‌గా ఆలోచించుకోవాలి. తప్పెవరిదైనా ఎవరో ఒకరు పట్టుదల సడలించుకుని రాజీకి ప్రయత్నించాలి. ఎవరెక్కడ పుట్టిపెరిగినా గతంలో పరిస్థితులు ఎటువంటివైనా ఆలుమగలుగా సంసారం మొదలుపెట్టిన తరువాత ఇద్దరూ వేరు కాదనే నిజాన్ని అన్ని కోణాలనుంచి అర్థం చేసుకోవాలి. భార్యదగ్గర భర్తకు, భర్తదగ్గర భార్యకు భేషజం అనేది ఉండకూడదు. ఎవరెంత ఆత్మాభిమానం కలవారైనా ఆలుమగలు ఒకరిదగ్గర మరొకరు ఆత్మాభిమానం ప్రదర్శించుకోవడం అర్థం లేనిపని, అందుకే అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడే రాజీకి చొరవతీసుకుంటే అదేదో లొంగిపోయినట్టు, ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టినట్టుకాదు. రాజీకి చొరవ తీసుకుని పట్టు వీడి ఆనంద సామ్రాజ్యంలో మునిగి తేలుతున్నవేళ అవసరమనుకుంటే అప్పుడే తమ ఉక్రోషాన్ని, దు:ఖాన్ని బయట పెట్టుకోవచ్చు.ఇలా చేయడం వలన కోపతాపాలు పోయి అభిమానం రెండింతలవుతుంది. అలా కాకుండా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడే ఎవరికివారే తమ వాదాన్ని బలపరుచుకుని ఆత్మాభిమానంతో మొండిగా కూర్చుంటే ఆ పట్టుదలలు పెరిగి, స్పర్థలు అధికమై పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

ఆలు మగల మధ్య ఏర్పడే అభిప్రాయ బేధాలు వినేవారికి, చూసేవారికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఇవి భార్యాభర్తలకు అగ్నిపర్వతాల్లా అనిపిస్తాయి.చివరికి అగ్ని పర్వతం బద్దలైనట్టు అవుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే ఆలుమగల సంబంధాలు ఒక్క గొడవ మూలంగానో, ఒక్క కారణం చేతనో దెబ్బతినవు. కాబట్టి తరచూ ఏర్పడే గొడవలకు ఇద్దరూ కారణమవుతారు. మనస్పర్థలు ఏర్పడిన ఆలు మగలు ఒకరిపై ఒకరు చేసుకొనే ప్రధాన ఫిర్యాదు ”అస్సలు మాట వినిపించుకోరని”. ఈ సమస్యకు పరిష్కారం చాలా తేలిక. ఒక మాట చెప్పినపుడు వినిపించుకోనప్పుడు కోపం తెచ్చుకోకుండా సరైన సందర్భం చూసుకుని అలవోకగా అదే మాట చెప్తే పాజిటివ్‌ రిజల్ట్‌ వస్తుంది. ఈ సైకాలజీని ఆలుమగలు గ్రహించాలి. స్త్రీ, పురుష అహంకారాలు, పుట్టింటి వారి ఆర్థిక బేదాలు, శరీర రంగులు తేడాలు, ఇతర హోదాలు అలుమగలు పోల్చుకోవటమంత బుద్ది తక్కువ తనం మరొకటి ఉండదు. స్వీట్‌ హోంలా పోల్చదగ్గ కాపురంలో వాటికి తావుండకూడదు. ఏదో ఒక సందర్భంలో భార్యను భర్త విసుక్కున్నా, భర్తని భార్య విసుక్కున్నా ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని, మనస్సు కష్టపెట్టుకోకుండా సరిపెట్టుకోవాలి. అవసరమైతే సహకరించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే కష్టపెట్టినందుకు తమకు తామే ఎంతో నొచ్చుకుని మరింత దగ్గరవుతారు. అలానూ గాకుండా ప్రతిమాట పట్టించుకుని పంతం ప్రదర్శించే వారైతే ఆ చిన్న సమస్య పెరిగి పెద్దదవుతుంది. ఆలుమగలు పరస్పర భావోద్రేకాలను, శారీరక మానసిక అవసరాలను గురించి అవగాహన గలిగినప్పుడే ఆ సంసారంలో అనురాగమే తప్ప, అపార్థానికి తావుండదు. ఏమైనా చిన్న చిన్న చికాకులు ఏర్పడినా వాటంతటవే సర్దుకుపోతాయి. ప్రేమ సామ్రాజ్యంలో లొంగిపోవటమే గొప్ప తప్ప, ఆధిక్యత ప్రదర్శించటం ఏమాత్రం గొప్పకాదనేది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రాన్ని పాటించిన ప్రతి ఇల్లూ స్వీట్‌ హోమ్‌ అవుతుంది. అటువంటి అభిప్రాయం ఒకరికి ఉండి మరొకరిని మార్చటం సాధ్యం కానప్పుడు, ఆ విషయం బయట పెట్టకుండా ఒక మంచి సందర్భం చూసుకుని, ఇరువురూ చర్చించుకుని కౌన్సిలింగ్‌లో సలహా తీసుకోవచ్చు. ఇలాంటి కౌన్సిలింగ్‌ ఏమాత్రం తప్పుకాదు. ఆలుమగలు madhya అనురాగానికి, ఆగ్రహానికి తేడా చాలా తక్కువ . ఆలుమగల మధ్య ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అనే ప్రసక్తి ఉండకూడదని గ్రహించిన నాడే అది తప్పక స్వీట్‌ హోమ్‌ అవుతుంది. జీవపరిణామ క్రమములో మగవాడు ముందు ... తరువాత ఆడుది పుట్టినవి అయినందున మూర్ఖత్వము  కొన్ని జంతులక్షణాలు మగవారికే ఉంటాయి. కావున స్త్రిలే సర్దుకు పొవాలి. భర్తకు ఇత్ష్టము లేనిది భార్యకు ఎంత ఎష్టమైనా వదుకోవడమే ఉత్తమము మరియు అలా గ్రహించిన నాడే అది తప్పక స్వీట్‌ హోమ్‌ అవుతుంది.

ఫలప్రదమైన అనుబంధాలు చాలా వరకు అర్థవంతమైన సంభాషణల మీదే ఆధారపడి ఉంటాయి. అయితే సంభాషణలు సహజంగా, దాపరికం లేకుండా సాగాలి. అలా చర్చించుకోవలసినవి.
-కెరీర్ : దంపతులు ఇరువురూ ఉద్యోగాలు చేస్తున్నా, కొంతమంది జీవిత భాగస్వామికి తమ సమస్యేమిటో చెప్పే ప్రయత్నమే చేయరు. నిజానికి సంస్థలు వేరు వేరయినా, చాలా సార్లు ఆ సమస్యలు ఒకేలా ఉంటాయి. అందుకే జీవిత భాగస్వామి నుంచే ఒక గొప్ప పరిష్కార మార్గం లభిస్తుందనే విషయాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు.
-ఆర్థిక విషయాలు : కుటుంబ ఆర్థిక విషయాల గురించి ఉమ్మడిగా చర్చించుకోవడం ద్వారా, ఎన్నో సమస్యలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చు. కుటుంబానికి సంబంధించి, అప్పులు, ఆదాయాలు ఇలా అన్ని విషయాలూ ఇద్దరికీ పూర్తిగా తెలిసి ఉండడం వల్ల, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా వాటిని అధిగమించడం సులువవుతుంది.
-కుటుంబ బంధాలు : దంపతులిద్దరూ పరస్పరం రెండు కుటుంబాల విషయాల్లో బా«ధ్యతగానే ఉండాలి. ఇది దంపతుల మధ్య ఒకరి పట్ల మరొకరికి గౌరవ భావం పెరిగేందుకు కూడా తోడ్పడుతుంది.
-హాబీలూ ముఖ్యమే : ఎంతసేపూ కుటుంబ నిర్వహణ విషయాలకే పరిమితం కాకుండా, తమ తమ హాబీల విషయంలోనూ పరస్పరం చర్చించుకోవడం ఎంతో మేలు. దీనివల్ల ఒకరి పురోగతికి మరొకరు తోడ్పాటును, ప్రోత్సాహాన్నీ అందించినట్లు అవుతుంది.
-భవిష్యత్తు పై ఒక భరోసా : కొందరిని భవిష్యత్తు గురించిన ఒక అభద్రతా భావం కుదిపేస్తూ ఉంటుంది. ఒక పక్కా ప్రణాళిక ఏదీ లేకపోవడమే దీనికి కారణం. అందుకే,భవిష్యత్తు గురించిన ఒక నిశ్చింత ఏర్పడే ఆలోచనా క్రమం నిరంతరం సాగాలి. అందుకే భవిష్యత్తు విషయాలపై కూడా దృష్టి నిలపడం ఏ జంటకైనా ఎంతో ముఖ్యం.
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, November 19, 2012

Who are the five mothers in Hindu epics?-హిందూ పురాణాలలో పంచమాతలు అని ఎవరిని అంటారు ?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ఫ్ర : హిందూ పురాణాలలో పంచమాతలు అని ఎవరిని అంటారు ?

జ : మాత అంటే అమ్మ అని అర్ధము . జన్మనిచ్చేదానిని అమ్మ అంటాము . ప్రతిజీవికి అమ్మ ఉంటుంది . అమ్మను ప్రేమించని జీవి అంటూ ఉండదు . బిడ్డను నిస్వార్ధము గా ప్రేమించేది అమ్మే . అటువంటి అమ్మను ప్రతివారు శ్రద్ధతో , అమూల్యముగా కాపాడు కోవడము వారి బాధ్యతగా తీసుకోవాలి. ఇక్కడ హిందూ పురాణాలలో పంచమాతలు అనగా :

1.విశ్వమాత : - వాతావరణ కాలుష్యము నుండి కాపాడుకోవాలి.
2.పృధ్వీమాత : విధ్వంశకర శక్తులనుండి భూమాతను కాపాడుకోవాలి,
3.దేశమాత : మన దేశాన్ని ఇతరదేశాల నుండి  మనమే కాపాడుకోవాలి .
4.జన్మనిచ్చిన మాత : తల్లి ఋణము తీరేదాకా కడదాకా కంటికి రెప్పలా కాపాడుకోవాలి.
5.గోమాత : బహు ప్రయోజనకారి , ఆరోగ్యప్రదాయని అయిన గోమాతను కాపాడుతూ ఉండాలి .
  • =================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Saturday, November 17, 2012

what is Phantom vibration Syndrome?-ఫాంటం వైబ్రేషన్‌ సిండ్రోం అంటే ఏమిటి ?

  •  
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
Q : what is Phantom vibration Syndrome?-ఫాంటం వైబ్రేషన్‌ సిండ్రోం అంటే ఏమిటి ?

జ : నేటి నవీన యుగము లో సెల్ ఫోన్‌ వాడకము బాగా పెరిగిపోయినది. మానవ జీవితము ఏపని అయినా , అలవాటు నైనా , వస్తువునైనా అతిగా వాడడాన్నే వ్యసనముగా భావిస్తారు. వ్యసనాలు ఉండడము మామూలే అయినా దానికి బానిస అయిపోవడమే అనారోగ్యము . ఇదే కోవకు చెందినది ఎక్కువగా సెల్ ఫోన్‌ వాడకము . నెలకు సుమారు 3000 నుండి 4000 వరకూ మెసేజ్ అందుకోవడమో , పంపడమో చేస్తూ ఉంటారు . కొంతమంది అవసరమున్నా ... లేకపోయినా కాల్ చేస్తూ ఉంటారు ... కాల్స్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు . ఇలా మెసేజ్ లు , కాల్స్ వలన ఒకరకమైన శబ్దము వినిపిస్తుంది.  ఈ శబ్దము పదే పదే వినడము మూలము గా మన మెదడు లోని వినికిడి కేంద్రము ఒకరమైన భ్రమకు లోనై ఫోన్‌ రాని సమయములో కూడా ఎదో ఒక రకమైన సెల్ఫోన్‌ ధ్వని వినిపిస్తున్నట్లు భావన కలుగుతుంది. దీనినే " ఫాంటం వైబ్రేష్‌ సిండ్రోం " అంటారు. సుమారు 10 శాతము మంది ఈ మానసిక వ్యాధికి గురి అవుతున్నారు. బాత్ రూం లోస్నానము చేస్తున్నా , టి.వి.చూస్తున్నా , పాటలు వింటున్నా , పనిలో మునిగి ఉన్నా , సినిమా చూస్తున్నా , ఫంక్షన్‌ లో ఉన్నా వారి "స్పెసిఫిక్ రింగ్ టోన్‌ " వినిపిస్తున్నట్లు గా ఫీలవుతారు.  వీరిలో వినికి లోపాలు తల ఎత్తే అవకాశము ఎక్కువ .

చికిత్స :
  • క్రమేపీ సెల్ ఫోన్‌ వాడకము తగ్గించాలి.
  •  రింగ్ టోన్‌ మార్పు చేస్తూ ఉండాలి .
  • అవసరమున్నపుడే కాల్ చేయాలి . కాల్ తక్కువ సమయము లో ముగించాలి .
  • నిద్రపోయేటప్పుడు సెల్ ఆఫ్ లో ఉంచితే మంచిది.

  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, November 16, 2012

Why do doctors get more value in the Society?-సమాజములో వైద్యులకు ఎందుకంత విలువ ?

doctor
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : Why do doctors get more value in the Society?-సమాజములో వైద్యులకు ఎందుకంత విలువ ? 

జ : మన దేశము లో వృత్తిచిద్య ల గురించి కొన్ని చులకనైన అభిప్రాయాలు ఉన్నాయి. నీళ్ళు రాకపోతె రిపేరు చేసే " ప్లంబరు" , కరంటు రిపేరు చేసే " ఎలక్ట్రీషియన్‌" , ఫర్నిచర్ బాగుచేసే " కార్పెంటర్ " , కారును రిపేరు చేసే " మెకానిక్ " వీరంతా రోజూకూళీవాళ్ళని , వీరికంటే ఆఫీసులో నెలకి మూడు , నాలుగు వేలు తెచ్చుకునే గుమాస్తా ఉద్ద్యోగము మర్యాదగా ఉంటుందని ఓక రకమైన తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి.

లండన్‌ లో ప్లంబర్ కు ఉన్న పలుకుబడి  డాక్టర్ కి ఉండదు . ఇంటికి వెళ్ళి వైద్యం చేసే డాక్టరు సంపాదన కంటే పంపు రిపేరు చేసే ప్లంబరు ఎక్కువ సంపాదిస్తాడట . అతనికి కాఫీ ఇచ్చి తమతో సమానము గా చూస్తారట . అందుకనే ఒక భారతీయ వైద్యుడు M.D పాసై లండన్‌ లో ప్రాక్టీస్ పెట్టి రోజుకి రెండు కేసులు కూడా రాక ప్లంబర్ పని నేర్చుకొని ... ఆ పనిలో పదిరెట్లు ఎక్కువ సంపాదించుకుంటున్నాడు . " డాక్టర్ మానవదేహాన్ని రిపేరు చేస్తే , తాగే మంచినీళ్ళ పంపుల్ని బాగుచేసి పలంబర్ గా ఎక్కువ సంపాదించుకుంటున్నాను " అని అంటున్నాడట .

మన దేశములో నాలుగో వంతు జనాభా పాతికేళ్ళలోపువారు ఉన్నారు . అందులో 80 శాతము మంది చదువు మధ్యలోనే మానేసి స్కూల్ డ్రాప్ అవుట్స్ గా ఉన్నారు. ఇటువంటి వారికి ఎలక్ట్రీషియన్‌ , కంప్యూటర్ మెకనిక్ , ప్లంబ్లింగ్ , కార్ మెకానిజం వంటి శాఖల్లో ట్రైనింగ్ స్కూల్సు పెట్టి ... ప్రతిభావంతులైన మెకానిక్స్ గా శిక్షణ యిస్తే వారు నెలకి 40-50 వేలు వరకు సంపాదించుకోవచ్చును.  మనము వృత్తిని గౌరవించడము నేచుకోవాలి. డాక్టర్ ని ఆహ్వానించినట్లే ఎలక్ట్రీషియన్‌ ని  ప్లంబర్ ని , మెకానిక్ ని ఆహ్వానించగలిగితే పరిస్థితులు బాగుపడతాయి.

డాక్టర్ వృత్తిలో మానవ చావు .. పుట్టుకల్తో సంబంధము ఉంటుంది కావున ... సమాజము లో ఆ మాత్రము గౌరవము ఉండడము న్యాయమే కదా !.

మూలము : మాలతీచందూర్ జవాబులు
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, November 13, 2012

What is the specialty of finger-prints? -వేలి ముద్రల ప్రత్యేకత ఏమిటి?

  • image courtesy with Wikipedia.org.
  • ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
 ప్ర : వేలి ముద్రల ప్రత్యేకత ఏమిటి? -What is the specialty of finger-prints?

జ : వేలిముద్రలు అనేవి సూక్ష్మాతిసూక్ష్మమైన ఎత్తుపల్లాల వంటి నిర్మాణాలతో ఏర్పడినవి.  వేళ్ళ మీద ఉండే ముద్రలు ఏ ఇద్దరు మనుషులకూ ఒకలా ఉండవు . అచ్చుగుద్దినట్లు ఒకేలా పుట్టిన కవలపిల్లలకూ వేలిముద్రలలో తేడా ఉంటుంది. వేలి ముద్రలు పుట్టినప్పటినుండీ మరణిచేవరకూ మారవు . ఈ ప్రత్యేకత వల్ల వేలిముద్రలను మనుషులను  గుర్తించేందుకు ఉపయోగిస్తారు.
  • సాధారణముగా ఎడమ చేయి బొటన వేలిముద్రలను తీసుకుంటారు. ఆడ , మగ తేడాను  గుర్తించేందుకు కొంతమంది ఆడువారికి కుడి చేయి బొటన వేళి ముద్రలను తీసుకుంటారు. 

  • ================== 
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, November 05, 2012

కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుంది ?


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...




ప్ర : కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుంది ?

జ : కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.

ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి  జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి  శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

  •     గోపికలు ఉన్నా అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయం ఏంటంటే.. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. అంటే స్కలనం అనేది ఎరుగడు. నెమలి పరవశించినపుడు మగనెమలి అశ్రు ధారను ఆడ నెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగలదట. అంతేకాని అవి సంభోగించవు. అందుకే కృష్ణుడు తల  పై నెమలీక ధరిస్తాడు. మరో ముఖ్య విషయం. పిల్లన గోవిని గోవిందుని పెదవుల వద్ద స్థానం ఎలా సంపాదించావని ఒక మహర్షి అడిగాడట. అప్పుడు పిల్లనగ్రోవి ఇలా చెప్పిందట. ఇలా చూడు నాలో ఏముందని అడిగిందట. నాలో ఏమీ లేదు. ఏ కల్మషమూలేదు. ఏ కోరికలూ లేవు.. ఈ కామ, క్రోధ,లాభ, మోహ , మధ, మాత్సర్యాధి హరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకుంటే జీవితం చక్కని స్వరంలా సాగిపోతుంది. తనదంటూ ఏదీ కోరని వారినే దేవుడు తన మధుకలశాల వద్ద ఉంచుకుంటాడని చెప్పిందట పిల్లనగ్రోవి.
   
  •  మనవి : పైన ఇచ్చిన జవాబు  పురాణ పురుషుల ఊహాగానాలే . ప్రతీ జీవి లోనూ సంపర్కము వలనే పురరుత్పత్తి జరుగుతుంది. అది ప్రకృతి సహజము .పురుష బీజకణాలు , స్త్రీ బీజ కణాలు కలయిక వలనే పిండోత్పత్తి జరుగుతుంది. పురుష ఇంద్రియం నోటిద్వారా త్రాగడము ద్వారా పిండోత్పత్తి ఏజీవిలోనూ జరుగదు. జీవపరిణామ క్రమమములో క్లోయకా ద్వారా నెమళి లో గర్భోత్పత్తి జరుగుతుంది.

శ్రీకృష్ణుడి కుటుంబము
శ్రీకృష్ణుడికి భార్యలందరితోనూ ఒక్కొక్కరి వల్ల పదేసి మంది పిల్లలు పుట్టారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు, పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే సంతానం కలిగింది. జాంబవతికి కలిగిన ఈ బిడ్డలంటే కృష్ణుడికి ప్రత్యేకమైన ప్రేమ ఉండేది.నాగ్నజితి, కృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అనే పిల్లలు కలిగారు. కృష్ణుడికి కాళింది వల్ల శ్రుతుడు, కవి, వృషుడు, వీరుడు, సుబాహుడు, భద్రుడు, శాంతి, దర్శుడు, పూర్ణమానుడు, శోమకుడు అనే కుమారులు జన్మించారు. లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది. మిత్రవింద, కృష్ణులకు వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు. కృష్ణుడికి భద్ర అనే భార్య వల్ల సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనే పిల్లలు పుట్టారు. ఈ అష్ట మహిషులే కాక మిగిలిన పదహారు వేల వంద మంది కృష్ణుడి భార్యల ద్వారా కూడా ఒక్కొక్కరికి పది మంది సంతతి కలిగింది. --Source : Wikipedia.org
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Thursday, November 01, 2012

Earth rotation not known why?-భూమి తిరుగుడు తెలియదేం?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమ్మీద ఉన్న మనము, ఇతర జీవులు ఎందుకు తిరగరు?



జవాబు: భూమి ఆత్మప్రదక్షిణం చేస్తూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నమాట నిజమే. ఆ భూమితో పాటు ఇతర జీవులు మనం కూడా తిరుగుతూనే ఉన్నాయి. మనం ఏదైనా బస్సులాంటి వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు కదులుతున్న భావన మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయాల్లో వాహనం మీద ప్రోద్బలమో (forwarding force), లేదా వ్యతిరేక బలమో (force of resistance), భూమ్యాకర్షణకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో కొన్ని బలాలు పనిచేస్తూ ఉంటాయి. ఏ బలమూ పనిచేయని వాహనంలో సమవేగంతో మనం ప్రయాణిస్తుంటే మనకు ఎలాంటి కుదుపులు తెలియవు. భూమి మీద అపలంబ బలము, అపకేంద్ర బలము, సూర్యుడు గ్రహాల వల్ల కలిగే గురుత్వబలము కలగలిపి పనిచేసినా వాటి నికర బలం(effective force) శూన్యం. అందువల్ల భూమి భ్రమణ, పరిభ్రమణాల ప్రభావం మన మీద పడదు. అందువల్ల మనం కదలనట్టే భావిస్తాము.


-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-