Friday, September 07, 2012

క్లోనింగ్ ప్రయోగము మనుషులపైన ఏ దేశములోనైనా చేసారా?,Do cloning expermented on humans?





ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


  • ప్ర : పధహారు సంవత్సరాల క్రితం గొర్రె (డాలీ) నుంచి క్లోనింగ్ ద్వారా మరో గొర్రెను సృష్టించారు . అ పద్ధతి ద్వారా ఈ ప్రయోగము మనుషులపైన ఏ దేశాం లోనైనా చేశారా?

జ : ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్‌ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్‌, చెర్రీలాంటి పండ్లు లభిస్తాయి.

  • ఒక కణం నుండి కేంద్రకాన్ని తొలగించి, దానిని, కేంద్రకం క్రియా రహితం చేయబడిన లేదా తొలగించిన వేరొక ఫలదీకరణం చెందని అండకణం లోనికి ప్రవేశ పెట్టే ప్రక్రియ క్లోనింగ్. క్లోనింగ్ రెండు విధాలుగా ఉంటుంది:

ప్రత్యుత్పాదక క్లోనింగ్ : కొంత విభజన తరువాత అండకణాన్ని గర్భాశయంలో ప్రవేశపెట్టినపుడు అది దాత కేంద్రకంతో జన్యుపరంగా సారూప్యత కలిగిన పిండంగా అభివృద్ధి చెందుతుంది.

  • చికిత్సాయుత క్లోనింగ్ : అండాన్ని రాతి గిన్నె (పెట్రి డిష్ )లో ఉంచినపుడు అనేక రుగ్మతలపై ప్రభావ వంతంగా పనిచేసే పిండ మూలకణాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇవి రోగాల చికిత్సలకు ఉపయోగిస్తారు .

1997 లో రోస్లిన్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ఇయన్ విల్ముట్ తన సహచరులతో కలిసి గొర్రె క్షీర గ్రంధుల నుండి డాలీ అనే గొర్రె పిల్లను క్లోనింగ్ ప్రక్రియ ద్వారా విజయవంతంగా సృష్టించినపుడు ఇది మీడియా దృష్టిని ఆకర్షించింది. డాలీని సృష్టించిన ప్రక్రియ లోనే మానవ క్లోనింగ్ కూడా సాధ్యమేనని చాలా మంది భావించారు. ఇది నైతిక వివాదాలను సృష్టించింది. ఇటువంటి క్లోనింగ్ మనుషులమీద చేస్తే ఎక్కువకాలము బతకరనీ , త్వరగా చనిపోతారనీ, ఇది చాలా అపాయకరమైన ప్రయోగమని , చెయ్యవద్దని " విల్ మట్ " స్పష్టముగా చెప్పారు . ఈ హ్యూమం క్లోనింగ్ ని అమెరికా , బ్రిటన్‌ వంటి దేశాలు నిషేదించడమే కాదు ... ఇటువంటి ప్రయోగాలు మానవజాతిపట్ల జరిగే అపచారం , హత్యతో సమానం అని అన్నారు
  • ================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...