ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
Q : శీతల రక్త జంతువులు అంటే ఏమిటి ?.
A : శీతల రక్త జంతువు లంటే ఆ జంతువుల రక్తము ఐస్ లాగా చల్లగా ఉంటుందని కాదు . .. ఆ జంతువులకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకునే శక్తి ఉండదు . వాతావరణములో ఉష్ణోగ్రత మార్పును బట్టి వాటి శరీర ఉష్ణోగ్రత మారుతుంది . చేపలు ,కప్పలు , పాములు , బల్లులు వంటివి ఈ తరహా జీవులు .
కప్పలు శీతల రక్త జంతువులు. అంటే వాతావరణంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటే వాటి శరీరంలో అంతే ఉష్ణోగ్రత ఉంటుంది.
పాము శీతల జంతువు. అంటే, చల్లని వాతావరణంలో శరీర ఉష్ణోగ్రత తక్కువగాను, వేడివాతావరణంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగాను, ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ జీర్ణక్రియలోవేగం పెరుగుతుందని మనకు తెలిసిందే. ఈ విషయం పాముకు తెలుసు. అందుకే అది ఆహారం తీసుకున్న తరువాత వేడిఎక్కువ తగిలే ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటాయి శీతల రక్త జంతువుకదా అందుకని జీర్ణం కావలసిన ఆహారం వున్న భాగాన్ని మాత్రమే వేడితగిలే విధంగా వుంచి మిగిలిన భాగాన్ని బొరియలో వుంచుకుంటుంది.
సైక్లోస్టొమేటా (Cyclostomata) కార్డేటా వర్గానికి చెందిన జీవులు శీతల రక్త జంతువులు. రక్తములో తెల్ల రక్తకణాలు మరియు కేంద్రక సహిత ఎర్ర రక్తకణాలు ఉంటాయి.
పక్షులు , క్షీరదాలకు తమ శరీర ఉష్ణోగ్రత నియంత్రించుకునె శక్తి ఉంటుంది . ఉష్ణోగ్రగ మారినా ఈ జీవుల శరీర ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటుంది .అందువల్ల వీటిని ఉష్ణ రక్త జంతువులు అంటారు. మానవులు ఉష్ణరక్త జీవులు .
- =============================