Saturday, August 27, 2011

వాటికి ఆ రంగు ఎలా వచ్చింది ? , How do leaves and Fruits get their color?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.




ప్ర : పచ్చని ఆకులలో పత్ర హరితం ఉంటుంది. మరి పచ్చని రంగుల్లో ఉండే పూలల్లో కూడా పత్రహరితమే ఉంటుందా? లేదా ఇతర పదార్థాల వల్ల వీటికి పచ్చని వర్ణం వస్తుందా?

- రమ్య, పదవతరగతి,రామకృష్ణ పాఠశాల, వరంగల్‌.

జ : ఆకుల పచ్చదనానికి, పువ్వుల్లో పచ్చదనానికి, మాగని అరటి, మామిడి, జామ, నిమ్మ వంటి పళ్ళతోళ్ల (peels) లో ఉండే పచ్చదానికి ప్రధాన వర్ణద్రవ్యం (pigment) క్లోరోఫిల్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవజాతి అంతా క్లోరోఫిల్‌కు ఎంతో ఋణపడి ఉంది. దాని ద్వారానే సౌరశక్తి, కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) ద్వారా జీవులన్నింటికీ అవసరమైన ఆహారంగా తయారవుతోంది. ముఖ్యముగా క్లొరోఫిల్ లో నాలుగు / ఐదు రకాలు ఉన్నాయి . కొద్దిగా రంగులో తేడా ఉన్నా దానిలో ఉన్న ముఖ్యమైన పిగ్మెంట్ .. క్లొరోఫిల్ జాబితాలోకే వస్తుంది .



Courtesy :
prajashakti news paper / prof.A.Ramachandrayya. Editor -chekumuki janavijyaana vEdika.
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...