Monday, November 29, 2010

మరి కోతులింకా ఉన్నాయేం?, Why do monkeys still existing?




ప్రశ్న: కోతి నుంచి మానవుడు ఉద్భవిస్తే, మరి ఇప్పుడున్న కోతులు ఎందుకు అంతరించిపోలేదు?

బి. శశాంక్‌, సాయిరాజ్‌, భీమగల్‌

జవాబు: మానవుడు కోతి నుంచి పుట్టాడంటే దానర్థం, కోతుల్లాంటి జీవులు పరిమాణం(evolution) చెందగా మానవజాతి ఆవిర్భవించిందని మాత్రమే. ఇది గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడం లాంటి జీవిత చక్రం కాదు. మొక్క కాండం నుంచి కొమ్మలు వస్తాయి కానీ కాండం అంతరించిపోదు కదా? జీవన అవసరాలను అందిపుచ్చుకోవడంలో కోతులకు చెట్లు ఎక్కడం, కొమ్మల్ని పట్టుకుని వేలాడుతూ పళ్లు తినడం, కొన్ని పరికరాలను సులువుగా వాడగలగడం లాంటి నైపుణ్యాలు తరాల తరబడిన పరిణామంలో క్రమేణా అలవడ్డాయి. అవే చింపాంజీలు, ఉరాంగుటాన్లు, గొరిల్లాలు లాంటి తోకలేని కోతిగా (great apes) మారాయి. వాటి నుంచి క్రమేణా మానవజాతి పరిణామం చెందింది. మనకు తల్లిదండ్రుల పోలికలు ఉన్నా వాళ్లు కూడా మనతోనే ఉంటారు కదా. అయితే తల్లిదండ్రుల కన్నా మనం పరిమాణాత్మకంగా కొంత మెరుగ్గా ఉంటాము. ఏ జీవజాతి ప్రకృతిలోని ఒడిదుడుకుల్ని అధిగమించి నాలుగు కాలాల పాటు నిలదొక్కుకోగలదో అదే మనుగడ సాగిస్తుంది. తట్టుకోలేని జాతులు అంతరించిపోతాయి. శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌ చెప్పినట్టు ప్రకృతివరణమే(natural selection) జాతుల ఆవిర్భావానికి (origin of species)కి ఆస్కారం కలిగించింది.

ప్రొ్హ్హ ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...