Wednesday, August 05, 2009

ఎంపి 3 అంటే ఏమిటి?, What is mp3?



సుమారు ఇరవియా సంత్సరాల కిర్తము వరకు సంగీతాన్నీ టేపు రికార్డుల్లో అయస్కాంత లక్షణాల ఆధారంగానో , గ్రామఫోన్ రికార్డుల్లో గరుకుదనం ఆధారం గానో నిల్వచేసేవారు. ఇలాంటి సాధనాలను " అనలాగ్" సాధనలంటారు . ఇపుడు కంప్యూటర్లు , ఎలక్ట్రానిక్ పరికరాలు లో మిక్రోప్రోసేసర్ పద్దతులు వచ్చాక అనలాగ్ సమాచారము డిజిటల్ ఉర్పములోకి మారింది . ఇందులో 0 లేదా 1 అంకెల శ్రేణి రూపం లో భద్రపరిచే విధానాన్ని బైనరి సమాచారము అంటారు . సంగీత ధ్యనులను ఎలక్ట్రానిక్ హెచ్చు తగ్గులు గా తర్వాత బైనరీగా మారుస్తున్నారు .

motion picture Expert Group అనే సాంకేతిక సంస్థ .. అంతర్జాతీయ ప్రమాణాల సంస్థకు , ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ కి అనుబందముగా ఉంది . ఇది దృశ్య ,శబ్ద నియకాలను నిర్దేశిస్తుంది. ఈ సంస్థ సంక్షిప్త నామమైన " MPEG" లోని మొదటి రెండు అక్షరాలు ... ముడో తరగతికి చెందిన పద్ధతికీ సూచనగా 3 కలిపి MP3 గా వాడుకలోకి వచ్చాయి . మొత్తానికి ఇది సంగీత ధ్యనులను కుదించి నమోదు చేసే ఒక ప్రక్రియ అన్నా మాట.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...