ప్రశ్న: ఈ విశ్వంలో మనం కాక మరో నాగరికత ఉన్నట్లు ఎలా కనుగొనగలం?
జవాబు: శాస్త్రవేత్తలు 1960 నుంచి అతి పెద్ద రేడియో ఏంటినాల సాయంతో భూమిపైనే కాకుండా ఈ విశ్వంలో మరెక్కడైనా ప్రాణులున్నాయా అని రోదసినంతా జల్లెడ పడుతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు వారు ఆశించిన ఫలితాలు లభించలేదు.
కాలిఫోర్నియాలో రూపొందించిన ఒక టెలిస్కోపు సముదాయం ఉంది. అది బిలియన్ల సంఖ్యలో ఉండే రేడియో ఛానల్స్ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఉండే నక్షత్రాల రహస్యాలను వెలువరించగలదు. ఈ ప్రాజెక్ట్‌లో భాగమే భూమిపై కాకుండా విశ్వంలో మరేదైనా నాగరికత ఉందా అనే అన్వేషణకు అంకితమైన SETI అనే గ్రహాంతర జీవుల అన్వేషణ సంస్థ. 1960లో ఫ్రాంక్‌డ్రెక్ అనే నక్షత్ర శాస్త్రజ్ఞుడు విశ్వంలోని మరేదైనా ప్రాంతం నుంచి మరో నాగరికతకు సంబంధించిన ప్రాణుల నుంచి ఏవైనా సంకేతాలు వస్తున్నాయా అనే అన్వేషణలో, మన పాలపుంతలో అలాంటి అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ప్రకటించారు. ఈ ప్రయాసలో ఆయన ఒక సమీకరణాన్ని రూపొందించారు. ఈ సమీకరణం ద్వారా మన నక్షత్ర మండలంలో మన కన్నా సాంకేతికంగా పురోగమించిన నాగరికతల సంఖ్యను లెక్కకట్టవచ్చు. లోపమల్లా ఈ సమీకరణం ద్వారా సేకరించిన విశ్వాంతర నాగరికతల మధ్య పొంతన లేకపోవడమే.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ================
visit My website > Dr.Seshagirirao - MBBS.-