ప్రశ్న: స్కూటర్ లాంటి ద్విచక్ర వాహనాలలో పెట్రోల్‌తో ఆయిల్ ను కలిపి పోస్తారెందుకు?
జవాబు: స్కూటర్లలో పెట్రోల్‌తో ఆయిల్‌ను కలిపి నింపడానికి కారణం ఆ వాహనంలోని ఇంజన్ భాగాల మధ్య రాపిడి లేకుండా కందెన వేయడానికే. ఇంజన్‌లోని రాడ్ బేరింగ్స్, రిస్ట్‌పిన్స్, కామ్స్, ఇంజన్ సిలెండర్ వాల్స్ లాంటి భాగాల మధ్య రాపిడి లేకుండా మిషన్ భాగాలు అరిగిపోకుండా ఉండడానికే. అంతేకాకుండా ఆయిల్, పెట్రోల్ కలిపిన మాధ్యమం స్కూటర్ ఇంజన్‌లో ఉత్పన్నమయిన వేడిని తగ్గించి ఒక శీతలీకరణ మాధ్యమం లాగా పనిచేస్తుంది.
ఇలా లూబ్రికేషన్ చేయడం స్కూటర్‌లాంటి ద్విచక్రవాహనాలకే కాకుండా బస్సు, లారీల్లాంటి నాలుగు చక్రాల వాహనాలకు కూడా ఎంతో అవసరం. ఈ వాహనాలలో ఈ ల్యూబ్రికేషన్ వ్యవస్థ ప్రత్యేకంగా ఆయిల్ టాంక్, ఆయిల్‌పంపు రూపంలో ఉంటుంది. ఈ టాంక్‌లో నింపిన ఆయిల్, ఆయిల్ పంపు ద్వారా వాహనం వివిధ యంత్ర భాగాలకు సరఫరా అవుతుంది. ల్యూబ్రికేటింగ్ వ్యవస్థ వేరే ప్రత్యేకంగా ఉండటం వల్ల ద్విచక్ర వాహనాలలో లాగా ఎక్కువ పొగ వెలువడడం, స్పార్క్ ప్లగ్‌పై కార్బన్ డిపాజిట్ కావడం లాంటి సమస్యలు తలెత్తవు.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-