Wednesday, May 16, 2012

Who invented Atombomb?, అణుబాంబు కనిపెట్టిందెవరు ?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : అణుబాంబు కనిపెట్టిందెవరు ? అతడు ఏ దేశస్థుడు ?

జ: నేను విన్నదేమిటంటే ->అణుబాంబు పరిశోధనలు 1945 లో ప్రారంభమై , రెండవ ప్రపంచ యుద్ధకాలములో " ఒప్పెన్‌ హైమర్ " అనే అమెరికన్‌ శాస్త్రజ్ఞుడి పర్యవేసణలో మెక్సికో ప్రాంతాల పరిశోధన్లు పూర్తయి 1945 లో కార్యరూపము దాల్చిందని ... అణుబాంబుని 1945 ఆగష్ట్ 06 న హిరోషిమా మీద , ఆగష్ట్ 09 న నాగసాకీ మీద వేసారు . 60 సం.లు దాటినా ఆ దారుణ పరిణామాలు మానవాళి ఇంకా మర్చిపోలేదు . నాగషాకీ , హిరోషిమా ల్లో జరిగిన ఘోర నరమేధం ఈ శాస్త్రజ్ఞుడు ఊహించని రీతిలో జరగడం చేత పశ్చాత్తాప పడి , భగవద్గీత తో భారతీయ వేదాంతం లో ఓదార్పు పొందాడట. హీరోషిమా, నాగసాకిలో వేసిన అణు బాంబు వల్ల 40 వేల మంది మరణించారు. మరో 35 వేల మంది గాయపడడమో, దాని ప్రభావానికి అస్వస్థకు గురి కావడమో జరిగింది.
  • ======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, May 15, 2012

సప్తగిరులు,ఏడు కొండలు,తిరుమల గిరులు ,Saptagirulu, Seven hills,Tirumala girulu.

  • image : courtesy with Wikipedia.org/

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : తిరుమలకు ఏడుకొండలు లేదా సప్తగిరులు అని పేరు ఎలా వచ్చింది?.

జ : తిరుమల లో ఉండే ఏడుకొండలనే సప్తగిరులని కూడ అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలకు ... ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.

* 1 శేషాద్రి
* 2 నీలాద్రి
* 3 గరుడాద్రి
* 4 అంజనాద్రి
* 5 వృషభాద్రి
* 6 నారాయణాద్రి
* 7 వేంకటాద్రి

శేషాద్రి :
  • సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారిమధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏంచేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.

నీలాద్రి :
  • స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి 'నీలాద్రి'గా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమెపేరు మీద రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.

గరుడాద్రి :
  • దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు)ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.

అంజనాద్రి :
  • వానరప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్లతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.

వృషభాద్రి :
  • కృతయుగంలో... తిరుమలలోని తుంబురుతీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలంపాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రి అనీ పురాణగాథ.

నారాయణాద్రి :
  • విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణమహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.

వేంకటాద్రి :
  • కలియుగదైవం వెలసిన తిరుమల గిరి... అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. 'వేం' అంటే పాపాలు అని, 'కట' అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరిని 'వేంకటాద్రి' అంటారని ప్రతీతి.దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఓ కొడుకు పుడతాడు. అతగాడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటారా దంపతులు. మాధవుడు మాత్రం చెడుసావాసాలు పట్టి అన్నీ పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితోపాటు స్వామిదర్శనానికి వెళతాడు. దర్శనం కోసం స్వామి ఎదుట నుంచున్న మాధవుడికి ఒళ్లంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలూ నశించాయట. ఆ తర్వాత మాధవుడు శ్రీవారి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. అతడే మరుజన్మలో తొండమాన్‌చక్రవర్తిగా పుట్టాడని, స్వామికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకం.
  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Friday, May 11, 2012

ఆంజనేయుడికి 5 అంకె ఇష్టమా? , Do Anjaneya like 5 number?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : ఆంజనేయుడికి 5 అంకె ఇష్టమా? , Do Anjaneya like 5 number?

జ : అంకెలలో 5 అంటే ఆంజనేయుడికి ఎంతో ఇష్టము . అని అంటారు పురాణ పురుషులు . అది ఒక నమ్మకము . ఇష్టా ఇష్టాలు ప్రతిజీవికి ఉంటాయి. అలాగే మారుతి కి కూడా ఉండేఉండవచ్చు. కారణమేమిటో చూద్దాం : ఆంజనేయ స్వామి తల్లిదండ్రులపేర్లు చూస్తే .. ''వాయుదేవుడు'' , ''అంజనాదేవి'' పేర్లలో 5 అక్షరాలే . ''సీతారాములు '' , ''లక్ష్మణస్వామి'' లోనూ 5 అక్షరాలే . అంతేకాదు ఆయన పేర్లలో " హనుమంతుడు " , " ఆంజనేయుడు " లోనూ 5 అక్షరాలే . ఆయన తపస్సు చేసిన పర్వతము " గంధమాదవ " లోనూ 5 అక్షరాలే . ఇలా పంచముఖాంజనేయునికి ఈ 5 అంకె తంటే చాలా ఇష్టమని అంటారు .
  • ========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Wednesday, May 09, 2012

How to get patent rights on my writings?, రచయిత తన రచనలమీద పేటెంట్ రైట్స్ పొందడమెలా?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : కథా రచయిత తమ రచనలమీద పేటెంట్ రైట్స్ పొందాలంటే ఏం చెయ్యాలి ? ఆన్‌లైన్‌ మీద ఈ పద్దతి అనుసరించవచ్చా? .పేటెంట్ రైట్స్ పొందడం అంటే ఏమిటి? .

జ : కథలు , నవలలు , కవిత్వము -- ఈ సాహిత్యానికి కాపీ రైట్ ఉంటుంది కాని పేటెంట్-రైట్స్ ఉండవు . రచయితకి నూరేళ్ళపాటు బ్రతికినంతకాలమూ తన రచనలమీద సర్వహక్కులూ ఉంటాయి. ఆ తరువాత అది ప్రజలకి చెందుతుంది. రామాయణ , భారతాలు ... ఇవి అందరూ ప్రచురించుకొని అమ్ముకోవచ్చు .

ఠాగూర్ , శరత్ , గురజాడ , వీరేశలింగం వంటివారి రచనలు ఎవరైనా ప్రచురించుకోవచ్చు . సాహిత్యాన్ని కాపీ కొట్టడాన్ని " ప్లాగరిజమ్‌ " అంటారు . రచనలో కొంతభాగము యధాతధంగా కాపీచేసి అది స్వంతరచన అని ప్రకటించి నప్పుడు అది కాపీరైట్ యాక్ట్ కింద వస్తుంది . రచనలకి పేటెంట్ రైట్స్ అన్నమాట వాడరు . ట్రేడ్ మార్క్ లకీ , మందులకు , కొత్తగా కనిపెట్టిన వస్తువు పేటెంట్ రైట్స్ కింద వస్తాయి.

సినిమాలని , పుత్సకాలని మక్కికిమక్కి కాపీచెయ్యడం చాలాచోట్ల ఉన్నది . కోటుకెళ్ళిన ఉదంతాలూ ఉన్నాయి. ఆన్‌లైన్‌ లో ఈ పనులు జరుగవు . కష్టము .
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

How Ants detect sweets at long distance?,చీమలకు తీపి ఉన్నచోటును తెలుసుకునే గ్రహణ శక్తి ఎలా వచ్చింది?

  • image : Eenadu hai bujji paper.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: తీపి పదార్థం ఉన్న చోటికి చీమలు కొన్ని క్షణాల్లో వచ్చి చేరుతాయి. వాటికి అంత గ్రహణ శక్తి ఎలా వచ్చింది?

జవాబు: చీమల తలపై ఎంటెన్నాల లాంటి రెండు అతి చిన్న వెంట్రుకలను గమనించే ఉంటారు. అవే చీమలకు ఆహారాన్ని వెదకడంలో సాయపడతాయి. వేర్వేరు పదార్థాలలో ఉండే రసాయనికాల రుచిని, వాసనను ఈ వెంట్రుకలు గ్రహించగలవు. వీటికి అనుసంధానించి ఉండే జ్ఞానేంద్రియ కణాల ద్వారా ఆ సమాచారం చీమ మెదడుకు చేరుతుంది. పదార్థాలు ఎక్కడో ఉన్నప్పటికీ గాలిలో వ్యాపించే వాటి వాసనను గ్రహించడానికి చీమలు ఈ వెంట్రుకలను అటూ ఇటూ కదిలిస్తూ దారి తెలుసుకుంటాయి. వీటిని చీమ తల నుంచి తొలగిస్తే అవి దూరంగా ఉండే పదార్థాల వాసనను పసిగట్టే శక్తిని కోల్పోతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Tuesday, May 08, 2012

Why do we call the education as SARASWATI YAAGAM, చదువుని సరస్వతీ యాగముం అంటారెందుకు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్ర : చదువుని సరస్వతీ యాగముం అంటారెందుకు?

జ : సరస్వతీదేవి వెనక లక్ష్మీదేవి రావచ్చునేమో కాని లక్ష్మి వెనక సరస్వతి రావడము అరుదుగా జరుగుతుంద ... అని అంటారు . ఒక పూట అన్నం పెడితే ఆకలి తీరుతుంది . బట్టలిస్తే ఒళ్ళు కప్పుకోవచ్చు , అదే విద్యాదానము చేస్తే పదితరాలకు ఆ కుటుంబలోని అందరూ విద్యావంతులవుతారు . అన్నిదానాల్లో విద్యాదానము ఉత్తమోత్తమైనది . అందుకే గురువు తల్లిదండ్రులతో సమానము .

ఈ నాడు అన్ని వస్తువులాగానే విద్యకూడా ఖరీదైపోయింది. ప్లేస్కూల్ నుండి కాలేజీ చదువుల దాకా ఫీజులు చుక్కల్ని చూపిస్తున్నాయి. తమ పిల్లలు చదుకుని మంది స్థితికి రావాలని బీదా బిక్కీ నుంచి సంపన్నుల వరకూ అందరూ ఆశపడుతున్నారు . రిక్షాలాగే వాడి కొడుకు ఎమ్‌.ఎ చదవడం , కండక్టర్ కొడుకు కలెక్టర్ , కానిస్టేబుల్ కొడుకు డిస్టిక్ జడ్జి అవడం వంటి తీపి / చేదు వార్తలు వింటున్నాము . ప్రభుతం కూడా " సరస్వతీ నిధి " అన్న పథకాన్ని ప్రారంభంచింది . పేద పిల్లలకు చదివించేందుకు ఈ నిధి ని వాడుతున్నారు .

మనదేశము లో నిరక్షరాస్యత , పేదరికము తగ్గించండానికి అందరూ అలోచించి ఆచరణలో పెట్టడాన్నే " సరస్వతీ యజ్ఞం లేదా సరస్వతీ యాగం " అని అంటారు . మీరూ విద్యాదానము చేసి సరస్వతీ యాగము లో పాలు పంచుకోంది .
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

Monday, May 07, 2012

అంబులెన్స్‌పై అక్షరాలను తిరగేసి రాస్తారేం?,Letters write in reverse on Ambulence-Why?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న:అంబులెన్స్‌ వాహనం ముందు భాగంలో AMBULANCEఅక్షరాలను తిరగేసి రాస్తారేం?

జవాబు: అంబులెన్స్‌ వాహనం ప్రమాద స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే వాహనం. రోగిని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఈ వాహనానికి ట్రాఫిక్‌ అవాంతరాలు ఏర్పడకుండా రోడ్డు మీద అందరినీ అప్రమత్తం చేయడానికి మూడు విధానాలు పాటిస్తారు. ఒకటి: ప్రత్యేకంగా శబ్దం వచ్చే సైరన్‌ మోగించడం. రెండు: రాత్రయినా, పగలైనా బాగా కనిపించేలా ప్రత్యేకమైన ఎరుపు, నీలం రంగుల్లో తిరిగే లైటును వాహనం పైన ఏర్పాటు చేస్తారు. మూడు: అంబులెన్స్‌ వాహనం మీద అక్షరాలను దానికి ముందున్న వాహనదారులు గుర్తించేలా రాయడం. రోడ్డు మీద వాహనాల డ్రైవర్లందరూ తమ వెనుక ఏయే వాహనాలు వస్తున్నాయో తెలుసుకోడానికి 'రియర్‌ వ్యూ మిర్రర్‌' అనే చిన్న అద్దమొకటి ఉపయోగపడుతుంది. దీని ద్వారా చూసినప్పుడు అంబులెన్స్‌ వాహనం మీద రాసిన అక్షరాలు సరిగా కనబడాలంటే వాటిని తిరగేసి రాయాలి. అందుకే అలా రాస్తారు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
  • ===================
visit My website > Dr.Seshagirirao - MBBS.-