Friday, December 31, 2010

Lips are Red in color Why?, పెదవులు ఎర్రగా ఉంటాయి ఎందుకు ?

ఫ్ర : మన పెదవులు ఎరుపు గా ఉంటాయి ఎందుకు ?
రమణమ్మ కొమ్మురి .. కంపోష్టు కోలని , శ్రీకాకులం టౌన్‌,
జ: మన శరీరములో భాగాలైన అరికాళ్ళు , అరిచేతులపైన ఉండే చర్మము దళసరిగా ఉంటుంది . పెదవులపై ఉండే చర్మము పలుచగా ఉంటుంది . అందువలన పెదవులకింద రక్తనాళాల్లో ప్రవహించే రక్తం అర్ధపారదర్శకమైన పెదవుల ద్వారా బతటికి కనిపిస్తుంది . అందుకే అవి ఎర్రగా ఉంటాయి .


  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, December 28, 2010

పిడుగు పడటం అంటే ఏమిటి ? , What is thunderbolt fall on a rainy day?


పిడుగు అనేది విద్యుత్ శక్తి . పైనున్న మేఘాలు దుమ్ము , ధూళి , నీటీఅవిరితో నిండి ఉంటాయి . అవి ఒకదానితో ఒకటి వేగంగా ధీకొన్నప్పుడు విద్యుత్ పుడుతుంది . ఆ విద్యుత్ వల్ల చుట్టు ఉన్న గాలి హఠాత్తుగా వేడెక్కి వ్యాకోచిస్తుంది . అలా వ్యాకోచించిన గాలి చల్లటి గాలని బలం గా తాకినపుడు ఉరిమిన శబ్దము విడుదల అవుతుంది . అదే సమయము లో ఆ విద్యుత్ భూమిపైన మొనదేలిన కొనలు , ఎత్తయిన ప్రదేశాలపై వదలబడుతుంది . దీనినే పిడుగు పడటం అంటారు .

  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి ? , Name Astaadasha Shaktipeetaalu ?


1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.


3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

5. జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.

6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.

12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.

18. సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.


  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, December 27, 2010

How at sign for email originated?, at గుర్తు ఎలా ఆవిర్భవించింది?



How @ sign originated?, @ గుర్తు ఎలా ఆవిర్భవించింది?

మెయిల్ ఎకౌంట్లని తెలియజేయడానికి వాడే @ గు ర్తు . 1885 వ సంవత్సరము నుండే వాడుకలో ఉన్నది . అప్పటిలో ఎకౌంట్ అవసరాలకోసం at the rate of అనే పదాన్ని సూచించడానికి దీన్ని వాడేవారు . ఆ తర్వాత కాలములో 1971 వ సంవత్సరములో కంప్యూటర్ నెట్ వర్క్ అడ్రస్ లకు మధ్య @ సింబల్ సెపరేటర్ మాదిరి గా వాడడం మొదలైనది . 1885 లో ఈ సింబల్ ని కీ బోర్డ్ లో " అమెరికన్‌ అండర్ వుడ్ (American Underwood)" మొదటిగా ప్రవేశపెట్టినది . . . కొంతకాలము కనుమరుగై 1971 లో " రేమాండ్ టోమిలిసన్‌(Raymond Tomlinson )‌ ఈ మెయిల్ మెసేజ్ లో నేచురల్ డివిజన్‌(Natural Division) గా వాడినారు . ఒక్కోక్క దేశము లో @ ని ఒక్కోక పేరుతో పలుకుతారు .
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, December 26, 2010

చేపలు నీళ్లు తాగుతాయా?,Do fish drink water?





ప్రశ్న: ఎప్పుడూ నీటిలోనే ఉండే చేపలకి దాహం వేస్తుందా? అవి నీటిని తాగుతాయా?

-ఎన్‌. అమరేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌

జవాబు: ఈ ప్రశ్నకు జవాబు అవును, కాదు అని రెండు విధాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఉప్పునీటి చేపలు నీళ్లు తాగుతాయి. అదే మంచినీటిలో ఉండే చేపలు నీళ్లు తాగవు. దీనికి కారణం తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రంలోని ద్రవాభిసరణము (osmosis) అనే ప్రవాహుల (fluids) ధర్మాలను తెలుసుకోవాలి. వీటి ప్రకారం రెండు వేర్వేరు గాఢతలు (concentrations) గల ద్రవాలను ఒక సన్నని పొర (మెంబ్రేన్‌) విడదీస్తుంటే, నీరు ఎక్కువ గాఢతగల ద్రవం వైపు ప్రవహిస్తుంది.

మంచి నీటిలో ఉండే చేప శరీరంలోని ద్రవం, దాని చుట్టూ ఉండే నీటి గాఢత కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ చేప శరీరంలోకి బయటి నీరు దాని చర్మం, మొప్పల ద్వారా శోషింపబడుతుంది. అలా దాని శరీరంలోకి ప్రవేశించిన నీటిని చేప బయటకు వదలక పోతే సమయం గడిచే కొద్దీ ఎక్కువ నీరు చేరడం వల్ల దాని శరీరం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. ఇక ఉప్పునీటి చేప విషయంలో ఈ ప్రక్రియ వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇక్కడ చేప చుట్టూ ఉండే నీటి గాఢత ఎక్కువగా ఉండడంతో చేప శరీరంలోని నీరు బయటకి స్రవిస్తుంది. అందువల్ల ఉప్పునీటి చేప సమయం గడిచే కొద్దీ శరీరంలోని నీటిని కోల్పోవడం వల్ల శుష్కించి, ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఆ చేప తన చుట్టూ ఉండే నీటిని మొప్పలు, నోటి ద్వారా తాగుతుంది. ఆ నీరు దాని శరీరంలోకి చేరక ముందే మొప్పలు ఉప్పునీటిలోని ఉప్పును విసర్జిస్తాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌



  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, December 24, 2010

గంటలకు కంచు ఎందుకు వాడారారు ? , Bronze is used for Bells-Why?


  • -------------------Bronze Bell----------------
దేవాలయాలలో , చర్చిలలో గంటను మోగిస్తారు . ఆ గంటల శబ్దము ఎంతో దూరానికి వినిపిస్తుంది . ప్రార్ధనా స్థలాలు వేరైనా ఆ గంటలు ఒకలాంటివే . అవన్ని కూడా కంచు తో తయారవుతాయి . కంచు లోహమిశ్రమము . కంచుకు స్థితి స్థాపక గుణము అధికము . దీనివలన కంచును కంపింపచేసినప్పుడు గంట ఖంగుమని కంపనాలను ఎక్కువసేపు ఉంచగలదు . అలా ధ్వని వినిపించే శక్తి బంగారానికీ మరియే ఇతర లోహానికీ లేదు ... అందుకే " కంచు మోగునట్టు కనకంబు మోగునా" అన్నాడు శతకకారుడు .

  • =================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

పురాణాలలో విశిస్టమైన త్రియాలు ఏవి?, What are the Triads in Hindu epics?


  • ----------- త్రిమాతలు ------------------------------------------------త్రిమూర్తులు -----------

బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు ----------------- త్రిమూర్తులు ,
సరస్వతి , లక్ష్మి , పార్వతి ---------------------త్రిమాతలు ,
భూలోకము , స్వర్గలోకం ,పాతాళలోకం ----------త్రిలోకాలు ,
భూత , వర్త , భవిష్యత్ కాలము ----------------త్రికాలాలు ,
సత్వ, రజో , తమో గుణము -------------------త్రిగుణాలు ,
పిత్రు ఋణము , ఋషి ఋణము , దేవ ఋణము---త్రిఋణాలు ,
ఉదయము , మధ్యాహ్నము , సాయంత్రము ------త్రిసమయాలు ,
కీర్తి -కాంత-కనకం--------------------------'తాప -త్రయాలు'


కర్మత్రయం :
ఎండ,వర్షం,చలి-----------------వాతావరణం అనే విషయాన్ని సూచించే కర్మత్రయం,
అదుపు,స్వేచ్ఛ,ఉపేక్ష------------మన అధీనుల యెడల మనం అవలంబించవలసిన వైఖరి కి సంబంధించిన కర్మత్రయం,
నిజం,అబద్దం,రహస్యం-----------మనం ఇతరులకు ఏదైనా సమాచారం చెప్పవలసి వచ్చిన సందర్భంలో కర్మత్రయం,
రాజ్యం,సమాజం,వ్యక్తి------------రాజకీయ వ్యవస్థకు సంబంధించిన కర్మత్రయం,
విశ్వాసం,శాస్త్రీయత,హేతుబద్ధత----ఆలోచనా విధానానికి సంబంధించిన కర్మత్రయం,





  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, December 22, 2010

ఉదయము నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు.ఎందుకు?


ఉదయము నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు . ఎందుకు?.

మానవుని శాస్త్ర జ్ఞానము అంతగా అభివృద్ధి చిందని కాలములో ఋషులు , మునునులు ఆన్ని అరోగ్య సూత్రాలను ఆత్యాద్మికము గా రూపొందించారు . వైద్య రంగము అంతగా అభివృద్ధి చెందని కాలములో సుచి , శుబ్రత , వ్యాధినిరోదకత అన్నీ దైవకార్యాలరూపములో ఉండేవి . పుణ్యము , పురుషార్ధము వస్తుందంటే సామాన్యప్రజలు ఆనురిస్తాననేదే ముఖ్యాంశము . " అది చేస్తే ఆరోగ్యము ... ఇది చేస్తే అనారోగ్యము--- అలా చెబితే చాదస్తము గా కొట్టిపారేస్తారు " కాని అందులో ఎంతో ఆరోగ్యము , ఉత్సాహము దాగిఉన్నాయి . నిద్రలేవగానే రెండుచేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతులలో్ని ఉష్ణశక్తి , వేడి కళ్ళకు తగిలి కళ్ళలోని రక్త ప్రసరణ ఎక్కువై ఆరోగ్యవంతంగా తెజోవంతము గా ఉంటాయి. కళ్ళజబ్బులకు దూరముగా ఉండవచ్చును . కళ్ళ అద్దాల అవసము అంతతొందరగా రాదు . ఇది వైద్యశాస్త్రము చెప్పిన ఆరోగ్యసూత్రము .

కాని ఋషులు ఏమిచెప్పారు : చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతిగీతలు అనుకోకుండ చూడడం ద్వారా బ్రహ్మను పూజించినంత ఫలితము ఉంటుందని , బ్రహ్మజ్ఞానము కలుగుతుందని ... అలా ప్రతిరోజూ చేయడము వల్ల కోటి పుణ్యక్షేత్రాలు సందర్శించినంత పుణ్యము సంప్రాప్తిస్తుందని లింకు పెట్టేరు .

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, December 21, 2010

పూలకన్ని రంగులేల? , Why do flowers have many colors?


ప్రశ్న: పూలు ఎందుకు రంగురంగులుగా ఉంటాయి?

-పి. కనకంబాబు, 9వ తరగతి, ఒంగోలు

జవాబు: పూలు అనేక రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించడం వెనుక ప్రకృతిలో మొక్కల పునరుత్పత్తికి దోహదం చేసే కారణం ఉంది. ఒక పూవులో ఉండే పుప్పొడి మరొక పూవును చేరినప్పుడే ఆయా మొక్కల్లో ఫలదీకరణం సాధ్యమవుతుంది. దీన్నే పరపరాగ సంపర్కం అంటారు. ఇందుకు సహకరించే కీటకాలు, పక్షులను ఆకర్షించేలా రకరకాల పూలకు రకరకాల రంగులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. అదే పక్షుల, కీటకాల ప్రమేయం లేకుండా గాలిలో పుప్పొడి ఎగరడం ద్వారా పరపరాగ సంపర్కం సంభవించే కొన్ని గడ్డిమొక్కల విషయంలో ఆకర్షవంతమైన రంగులు కలిగి ఉండాల్సిన అవసరం ఉండదు. కొన్ని మొక్కల విషయంలో పరపరాగ సంపర్కం పూర్తికాగానే, ఇక ఎవరి సాయం అవసరం లేదని తెలియజేయడానికి వాటి పూలు రంగులు కోల్పోయి, వాటి రేకులపై మట్టి రంగులో మచ్చలు ఏర్పడతాయి. దాంతో పక్షులు, కీటకాలు ఆ పూల జోలికి పోకుండా తమను ఆకర్షించే రంగులుండే పూలవైపే వెళతాయి.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, December 20, 2010

ఆకులలా రాలిపోతాయేం?, Trees Shed Leaves Why?




ప్రశ్న: శిశిరంలో చెట్ల నుండి ఆకులు రాలిపోతాయెందుకు?

-ఎ.ఆర్‌. మురళి, వడపళని (చెన్నై)

జవాబు: చలికాలంలో చెట్ల లోని జీవక్రియ (మెటబాలిజం) చాలా వరకూ ఆగిపోతుంది. ఆ దశలో చెట్లలో ఉండే ద్రవపదార్థం ఆకుల నుండి భాష్పీభవనం చెందకుండా, చలికాలం మొదలవడానికి ముందే ఆకులు రాలిపోవడం ప్రారంభమవుతుంది. అలా కాని పక్షంలో, చలికాలంలో చెట్లకు నీరు లేకపోవడంతో అవి చనిపోయే (ఎండిపోయే) ప్రమాదం ఉంది. వేసవి కాలంలో కూడా ఆకుల ద్వారా చెట్లలోని నీరు భాష్పీభవనం చెందినా, భూగర్భజలాలు వేళ్లద్వారా అందడం వల్ల చెట్లకు ఎలాంటి హానీ జరగదు. అదే చలికాలంలో భూగర్భజలాలు ఘనీభవించడం వల్ల చెట్లకు వేళ్ల ద్వారా నీరు అందదు. అంతే కాకుండా చెట్లు తమ ఆకులను రాల్చడం ద్వారా వాటి జీవక్రియల్లో వెలువడి ఆకుల్లో పేరకుపోయిన వ్యర్థపదార్థాలను చెట్లు వదిలించుకున్నట్లు అవుతుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

తు.చ.తప్పకుండా అంటే ఏమిటి?, thu.cha.tappakunDa anTe EmiTi?


సంసృత శ్లోకాల్లో అర్ధము తో నిమిత్తము లేకుండా గణముతో సరిపెట్టడానికి " తు.చ." అని పూరణార్ధము వేసుకుంటారు . అలా వేసినవాటిని విడిచిపెట్ట కుండా ప్రమాణం గా స్వీకరించడమే దానర్ధము .
- డా.శేషగిరిరావు

సంస్కృతం లో తు, చ అనే అక్షరాలని conjunction కోసమూ, ఛందస్సు లో గణాలు సరిపెట్టడం కోసం ఒక అక్షరం అవసరమైన సందర్భాల్లోనూ వాడతారు. పద్యం కోసం వాడినప్పుడు ఈ అక్షరాలు పద్యం యొక్క అర్ధానికి కొత్తగా ఎమీ తోడ్పడవు, ఇవి తీసెయ్యడం వల్ల పద్యం అర్ధం చెడదు. కేవలం fillers లాగ పని చేస్తాయి. ఎవరైనా ఏదైనా copy చేసే సందర్భాల్లో, అర్ధానికి contribute చెయ్యవని చెప్పి ఈ అక్షరాలని వదిలెయ్యకుండా వీటిని కూడా copy చేస్తే, దీన్ని తు చ తప్పకుండా copy చెయ్యడం అంటారు. ఉన్నదున్నట్టు చెప్పడాన్ని తు చ తప్పకుండా చెప్పడం అన్న వాడుక ఈ విధం గా వచ్చింది.
-వ్రజబాల

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పితృకర్మలు వేదోక్తాలా?ఇవి చేసి తీరాలా?, Must we do Death Funeral functions?


  • ప్రతి మానవుడు జన్మించిన తరువాత ఉండే సంస్కారములు పన్నెండు. ఫుట్టక ముందు ఉండే సంస్కారములు మూడు. మరణించిన తరువాత ఉండేది ఒకటి. మొత్తము కలిపి పదహారు.

వేదం విధించిన షోడశ కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము ... విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి . ఇక కర్మలు చేయాలా? అంటే ... ఒక పేద బ్రాహ్మిణ్ కి పాతిక రూపాయిలు ఇచ్చి మంత్రం చెప్పించడం ఇస్టములేకపోతే పాతిక వేలు ఇచ్చి పత్రికల్లో ప్రకతలు ఇచ్చి అభిమానము చాటిచెప్పుకోవచ్చును .


  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఉపవాసము పండుగ , ఏకాదశి నాడే చెయ్యాలా?,Do we fast on holy day only?

ఉపవాసాలు అనేక రకాలుగా చేయవచ్చు . ఈ లోకం కంటే పరలోకం మీద విశ్వాసము ఉన్నవారికి ఏకాదశి పరమ పవిత్రమైనది . ఇహం మాత్రమే ఉన్నదనుకునే వారికి ఏ రోజైనా ఉపవాసము పాటించవచ్చును . జీర్ణకోశము కొంత విశ్రాంతి తీసుకొని శరీరము ఆరోగ్యవంతం గా ఉండే వీలుంటుంది .
ఉపవాసాలలో రకాలు - > ఇక్కడ క్లిక్ చేయండి ఉపవాసము


  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, December 19, 2010

ఆ లైట్ల అమరిక అలాగే ఉండాలా?, Car lights arranges in special Why?





ప్రశ్న: కార్ల ప్రధాన లైట్లను పలకలుగా ఉండే పెట్టెల్లో పెడుతున్నారెందుకు?

-కె. హయగ్రీవాచారి, వరంగల్‌

జవాబు: కార్లలాంటి వాహనాలు చీకట్లో ప్రయాణించేప్పుడు దారి కనిపించడం కోసం ప్రధాన దీపాలను (హెడ్‌లైట్స్‌) అమరుస్తారన్న విషయం తెలిసిందే. చాలా కాలం వరకూ వీటిని అర్థచంద్రాకారంలో (పారాబోలిక్‌) ఉండే నున్నని గోడలుగల పెట్టెల్లో అమర్చేవారు. లైట్‌ వెలిగినప్పుడు దాని నుంచి వెనక్కి ప్రసరించే కాంతి కిరణాలు సైతం, ఈ నున్నని ఆకారంపై పడి పరావర్తనం చెంది తిరిగి ముందుకే వెళ్లేవి. ఇందువల్ల వాహనం ముందు ఉండే మార్గంపై ఎక్కువ కాంతి పడేది. అయితే ఇలాంటి అమరికలో ఉండే లైట్ల వల్ల కాంతి ఒక వలయాకారంలో కేంద్రీకృతమై పడేది కానీ, మార్గానికి అటూ ఇటూ ఉండే పరిసరాలపై వెలుగు ప్రసరించేది కాదు. తర్వాత్తర్వాత ఆధునిక హేలోజన్‌ ప్రక్రియ వల్ల అధిక కాంతిని ఇవ్వగల లైట్ల తయారీ మొదలైంది. ఈ లైట్ల వెనకవైపు కాంతి పరావర్తనానికి ఉపయోగపడేలా అమర్చే గోడల పరికరాల్లో సైతం మార్పు వచ్చింది. ఇవి నున్నగా కాకుండా ఉబ్బెత్తుగా అనేక పలకలుండే ఉపరితలంతో కూడినవి వచ్చాయి. లైట్ల నుంచి వచ్చే కాంతి కిరణాలు ఈ పలకలపై పడి అనేక దిశల్లోకి పరావర్తనం చెంది చెల్లాచెదురై మార్గం పైకి ప్రసరిస్తాయి. అందువల్ల కేవలం రోడ్డు మాత్రమే కాకుండా అటూ ఇటూ ఉండే పరిసరాలు కూడా కనిపిస్తాయి. పైగా ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్ల మీద బైర్లు కమ్మేలా కాంతి పడదు కూడా.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కిరణం చివర కనబడదేం? , Why can not we see tail of a Ray?


ప్రశ్న: కాంతి కిరణం యొక్క చివరను మనం చూడలేము. ఎందుకని?

-పి. సత్యవతి, 7వ తరగతి, కనిగిరి (ప్రకాశం)

జవాబు: కాంతి కిరణం అంటే కాంతి పయనించే మార్గాన్ని చూపే సరళరేఖ. నిజానికి మనం చూసేది కాంతికిరణం (light ray) కాదు. మనకి కనబడేది కాంతి పుంజం (light beam). ఇది కొన్ని కాంతి కిరణాల సముదాయం. మన కంటివైపు నేరుగా దూసుకు వచ్చే కాంతి పుంజాన్ని మనం చూడగలుగుతున్నామంటే దానర్థం దానిలోని కాంతి శక్తి మన కంటికి చేరిందనే. కాంతి శూన్యంలో కూడా పయనించే విద్యుదయస్కాంత తరంగం. ఈ తరంగాలు సరళమార్గంలో అత్యంత వేగంగా సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో వాటిని ఏదైనా వస్తువు శోషించేవరకు కానీ, వాటి మార్గాన్ని మార్చేవరకూ కానీ పయనిస్తూ ఉంటాయి. రాత్రి వేళల్లో ఒక టార్చిలైటును ఏటవాలుగా ఆకాశంవైపు వేస్తే చీకట్లోకి అతి వేగంగా పయనించే ఆ కాంతిపుంజం ముందు భాగాన్ని మనం చూడలేం. అలాగే టార్చ్‌లైట్‌ను ఆపుచేసినా కాంతి పుంజం చివరనూ మనం చూడలేం. దానికి కారణం కాంతిశక్తి అత్యంత వేగంగా ప్రయాణించడమే.

-ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

What about Queen of the Andes (Puya raimondii),పుయా రైమండి(క్వీన్‌ ఆఫ్‌ ఆండెస్)సంగతేమిటి?


పుయా రైమండి 'క్వీన్‌ ఆఫ్‌ ఆండెస్‌'-- వందేళ్లకు పూతంట! కోటి విత్తనాలంట!!

అనగనగా ఒక మొక్క... 100 ఏళ్లకి పూస్తుంది... ఒకేసారి వేలాది పూవులు... ఏకంగా కోటి విత్తనాలు... పుష్పించగానే చనిపోతుంది!

ఖలేజా సినిమా గుర్తుందా? అందులో పదేళ్లకు ఒకసారి పూసే మొక్కను పీకేశాడని హాస్యనటుడు అలీకి వింత శిక్షను వేస్తారు. సినిమా సంగతి సరేకానీ, అలా అరుదుగా పుష్పించే మొక్కలు ఉన్నాయా? ఉన్నాయి! అలాంటిదే పుయా రైమండి. 'క్వీన్‌ ఆఫ్‌ ఆండెస్‌' అని పిలిచే ఈ మొక్క లక్షణాలన్నీ వింతైనవే. ఇది కనిపించేది ప్రపంచంలో రెండే రెండు చోట్ల. అదీ ఎత్తయిన కొండ ప్రాంతాలపై. ఎదిగేది ఏకంగా 33 అడుగుల ఎత్తుగా. జీవించేది దుర్భర పరిస్థితుల్లో. ఇది కేవలం ఏ 80 ఏళ్లకో, వందేళ్లకో పూస్తుంది. అప్పుడు ఆ మొక్కంతా చిన్నచిన్న పూలు కనీసం మూడునాలుగు వేలు విచ్చుకుంటాయి. వీటి ద్వారా ఏకంగా కోటి విత్తనాలు ఏర్పడుతాయి. ఎంత మొండి మొక్కయినా పాపం... ఇప్పుడిది అంతరించిపోయే దశలో ఉంది.

ఇవి కేవలం పెరూ, బొలివియా దేశాల్లోని ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనే కనిపిస్తాయి. కొమ్మలు, ఆకులు లేని కాండంలాగా, నిట్టనిలువుగా, ఓ పెద్ద స్తంభంలాగా ఎదిగే దీని నిండా అన్నీ ముళ్లే. పైగా ఇవి లోపలికి ముడుచుకునే తత్వం కలిగి ఉంటాయి. దీంట్లోకి చెయ్యి పెడితే ముళ్లు గుచ్చుకోకుండా తీసుకోవడం కష్టం. అందుకే ఒకోసారి పక్షులు దీనిపై వాలి వాటి ముళ్లమధ్య చిక్కుకుపోతాయి. గొర్రెలాంటి పశువుల మొఖాలు కూడా వీటి ముళ్ల వల్ల గాయపడతాయని అక్కడి జనానికి ఇదంటే కోపం. కనిపిస్తే చాలు నరికేసి నాశనం చేస్తారు.

సముద్రమట్టానికి దాదాపు 15,000 అడుగులపైగా ఉండే కొండప్రాంతాల్లోనే కనిపించే ఇవి ప్రకృతిలోని వింత మొక్కల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాయి. వీటి సంఖ్య పెరూలో 8 లక్షలనీ, బొలీవియాలో 35 వేలనీ తేల్చారు కానీ చాలా తొందరగా కనుమరుగవుతున్నాయని గమనించారు. అందుకే వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిని మొదటిసారి 1830లో పెరూలో ఓ ఫ్రెంచ్‌ శాస్త్రవేత్త కనుక్కున్నాడు. పెరూలో ఉండి అనేక ఏళ్ల పాటు వివిధ మొక్కలపై పరిశోధన చేసిన ఓ ఇటలీ శాస్త్రవేత్త పేరునే దీనికి పెట్టారు.


  • =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Longest Train history , అతి పొడవైన రైలు బండి సంగతేమిటి?


ప్రపంచంలో వేలాది రైళ్లు... అన్నింటిలో అతి పొడవైనది ఏది? అతి బరువైనది ఏది? ఈ రెండు రికార్డులూ ఒక రైలువే!
చుక్‌చుక్‌మంటూ రైలు పరిగెడుతుంటే ఎప్పుడైనా పెట్టెలు లెక్కపెట్టారా? అలా లెక్కపెట్టడం సరదాగానే ఉంటుంది కానీ, అన్ని రైళ్లకీ కాదు. ఆస్ట్రేలియాలోని ఓ రైలు పెట్టెలు లెక్కపెట్టాలంటే విసుగొచ్చేస్తుంది. ఎందుకంటే అది ప్రపంచంలోనే అతి పొడవైనదిగా గిన్నెస్‌ రికార్డు సాధించినది మరి. దీనికి అమర్చిన పెట్టెలెన్నో తెలుసా? 682. మీరు చూసే ఏ రైలుకైనా ఇంజిన్‌ ఒకటే ఉంటుంది. కొన్నింటికైతే రెండు కూడా ఉంటాయి. మరి ఈ పొడవైన రైలుకెన్ని ఇంజిన్లో చెప్పగలరా? ఎనిమిది! మరి అన్ని వందల పెట్టెల్ని లాగాలంటే ఇన్ని ఇంజిన్లు ఉండద్దేంటి?! ఇంజిన్లు, పెట్టెలు అన్నీ కలిపి చూస్తే ఈ రైలు ఎంత పొడవుంటుందో ఊహించగలరా? ఏకంగా 7.4 కిలోమీటర్లు! ఈ రైలు మొత్తాన్ని బరువు తూస్తే అది ఏకంగా 9,97,32,000 కిలోల బరువుంది! అందుకే పొడవైన, బరువైన రైలుగా రెండు రికార్డులు కొట్టేసింది.

ఆస్ట్రేలియాలోని అతి పెద్ద ఉక్కు సంస్థ వాళ్లు ఇనుప గనుల నుండి ముడి సరుకును రవాణా చేయడానికి దీనిని 2001లో తయారుచేయించారు. దీని వల్ల వాళ్లు ఒకేసారి 82,000 టన్నుల ముడి ఇనుమును తరలించగలిగేవారు. రోజుకి 426 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే దీన్ని ఇప్పుడు ఉపయోగించకపోయినా రికార్డు మాత్రం అలాగే ఉంది.

తరువాత అదే ఉక్కు సంస్థ మరో రైలుని తయారు చేసింది. అది సుమారు 72,191 టన్నుల బరువుతో 5.8 కిలోమీటర్ల పొడవు ఉంది. దీనిపెట్టెల సంఖ్య 540. దీనిని కూడా కొంత కాలం నడిపి ఆపేశారు.

ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో అతి పొడవైనదిగా పేరు తెచ్చుకున్నది ఆఫ్రికాలోని మౌరిటానియా దేశంలో ఉంది. దీని పొడవు 3 కిలోమీటర్లు. దీన్ని కూడా ఓ ఉక్కు సంస్థ వాళ్లే తయారు చేశారు. ప్రస్తుతం ఇది ప్రతి రోజు ముడి ఇనుమును 700 కిలోమీటర్ల దూరానికి చుక్‌చుక్‌మని తరలిస్తూ తిరుగుతోంది. దీనికుండే 200 వ్యాగన్లను లాగడానికి 4 ఇంజిన్లను వాడుతున్నారు. ఒక్కో వ్యాగన్‌లో 84 టన్నుల ముడి ఇనుము పడుతుంది.
మీకు తెలుసా?
*ప్యాసింజర్‌ రైళ్లలో అతి పొడవైన రికార్డు నెదర్లాండ్‌లోని రైలుది. 60 బోగీలతో నిర్మించిన దీనిని 1989లో నడిపి ఆపై ఆపేశారు.

* ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు చైనాలోని షాంగై మ్యాగ్లేవ్‌ రైలు. ఇది గంటకి 431 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.

* మనదేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైలు న్యూఢిల్లీ నుంచి భోపాల్‌ వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌. గంటకి 150 కిలోమీటర్ల వేగం దీనిది.

  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

భూమి మీద గాలి శూన్యంగా ఉన్న అంతరిక్షంలోకి ఎందుకు పోదు?,Air on the Earth not going to space Why?


మన గాలి శూన్యంలోకి పోదేం?

ప్రశ్న: గాలి అధికపీడనం నుంచి అల్పపీడనానికి వ్యాపనం చెందుతుంది కదా. మరి భూమి మీదున్న గాలి శూన్యంగా ఉన్న అంతరిక్షంలోకి ఎందుకు పోదు?

- ఆర్‌. శ్రీశైలం, 10వ తరగతి, పడకల్‌ (మహబూబ్‌నగర్‌)

జవాబు: అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి అల్పపీడనం ఉన్న ప్రాంతాల వైపు వ్యాపనం (diffusion) చెందడం గాలుల లక్షణం. భూమ్మీద గాలి ప్రవాహాలు, తుపానులు, సుడిగాలులు ఇలా ఏర్పడేవే. గాలికి ద్రవ్యరాశి (mass) ఉంది. భూమ్మీద వ్యాపించి ఉన్న మొత్తం గాలి బరువు సుమారు 5X1018కిలోలు భూమి బరువు దాదాపు 6X10 24కిలోగ్రాములు. రెండు పదార్థాల మధ్య గురుత్వాకర్షణ ఉంటుందనేది తెలిసిందే. అలాగే భూమికీ, భూమ్మీద ఉన్న గాలికీ మధ్య గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రభావం గాలికి ఉన్న వ్యాపన లక్షణం కన్నా అధికం కావడం వల్లనే భూమిని గాలి అంటిపెట్టుకునే ఉంటుంది. భూవాతావరణంలో ఉన్న గాలి సుమారు 30 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉన్నా, గాలిలోని 75 శాతం కేవలం 10 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉండే టోపోస్ఫియర్‌ పొరలోనే ఉంటుంది. చంద్రుడి ద్రవ్యరాశి వాతావరణ వ్యాపనాన్ని నివారించగల స్థాయిలో లేనందువల్ల అక్కడ గాలి లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

సిమ్మెంటు కాంక్రీటు పై నీళ్ళెందుకు చల్లుతారు , Why do water spinkle on cemment slab?


ప్ర : సిమ్మెంటు , ఇటుకలతో ఇల్లు కట్టేటపుడు నీళ్ళతో తడుపుతుంటారు ఎందుకు ?

జ: సిమ్మెంటు , ఇసుక ఒక నిర్ధిస్టమైన పాలు (రేషియో) లో కలుపుతారు ... అది ఇటుకులను గట్టిగా పట్టి ఉంచడానికి తగినంత నీరు కలిపి గోడలును కడతారు . . ప్లాస్టింగ్ కూడా అలాగే చేస్తారు . కట్టడం అయిన తరువాత ఒక వారము వరకు ఆ గోడలను తడుపుతుండడం వలన గోడ గాని , ప్లాస్టింగ్ గాని గట్టిపడుతుంది . ఇది ఒక రసాయనకిరయ . . ఇసుక , సిమ్మెంటు నీళ్ళతో కలిపినపుడు వేడి పుడుతుంది ... ఆవేడిని చల్లబరచడానికి నీరు పోయడం అవసరము . దీనివలన గోడలు ధృఢముగా తయారముతాయి .

  • ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, December 11, 2010

పాములు అటూ ఇటూ వంపులు చేసుకుంటూనే ఎందుకు పాకాలి?, Why do snakes crawl by curving their body?


ప్రశ్న: పాములు అటూ ఇటూ వంపులు చేసుకుంటూనే ఎందుకు పాకాలి? తిన్నగా ఎందుకు పాకలేదు?
-ఎమ్‌. నిఖిల్‌, హన్మకొండ
జవాబు: చలనం (locomotion) అనేది ప్రాణుల లక్షణాల్లో ప్రధానమైనది. ఏ జీవి చలనమైనా శరీరంలో కొంత భాగాన్ని నేలకి సంధానిస్తూ, అదే సమయంలో ఇతర భాగాల్ని నేల నుంచి విముక్తి చేసుకుంటూ జరగాల్సిందే. మనుషులు, పశువుల వంటి పాదచారుల విషయంలో కాళ్లు ఒకటి తర్వాత మరొకటిగా నేల మీద ఆనుతూ, పైకి లేస్తూ ఉండడం అందరూ గమనించే విషయమే. ఇలా చేసినప్పుడే న్యూటన్‌ మూడవ గమన సూత్రం ప్రకారం ప్రతి చర్య (reaction) ఏర్పడి చలనం సాధ్యమవుతుంది. కాళ్లు, పాదాలు లేని పాముల్లాంటి జీవుల చలనానికి వాటి శరీరంపై ఉండే పొలుసులే ఆధారం. పాము విషయంలో దాని పొట్ట కింద ఉండే పొలుసుల్లో కొన్ని నేలను పట్టి వెనక్కి నెట్టుతుంటే, మరికొన్ని నేలను అంటుకోకుండా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇలా జరగాలంటే రెండే పద్ధతుల్లో సాధ్యమవుతుంది. నేలను అంటిన భాగం కాకుండా మిగతా శరీర భాగం భూమికి లంబంగా (vertical)గా ఉండాలి. లేదా నేలను అంటిన భాగం కాకుండా మిగతాది నేలకు సమాంతరంగా (horijantal)గానైనా ఉండాలి. ఈ రెండూ కాని పక్షంలో నేలను ఆనుకుని ఉండే శరీరభాగాన్ని వ్యాకోచింప చేసుకోవాలి. మొదటి పద్ధతిలో గొంగళిపురుగుల్లాంటివి పాకడాన్ని గమనిస్తాం. ఇక చివరి విధానంలో వానపాముల చలనం ఉంటుంది. ఈ రెండు పద్ధతులకు పాము శరీరం అనుకూలంగా ఉండకపోవడం వల్ల అది రెండో పద్ధతిని పాటిస్తుంది. అందుకే వంకరటింకర నడక, పరుగు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, December 07, 2010

వాటి రక్తానికి మెరుపేల? , Why do their blood shine?


ప్రశ్న: వానపాముల రక్తం చీకట్లో మెరుస్తుంది. ఎందుకని?

-పి.ఎస్‌. మంజునాథ్‌, అనంతపురం

జవాబు: వానపాముల విషయంలో కన్నా బొద్దింకలు, కొన్ని రకాల కీటకాల విషయంలో దీన్ని గమనిస్తాము. రక్తం పలు జీవరసాయనాల సమ్మిశ్రమం. ఇందులో కొన్ని సేంద్రియ రసాయనాలకు (organic chemicals), సమన్వయ సమ్మేళనాలకు (coordination compounds) ఫ్లోరసెన్స్‌ లక్షణం ఉంటుంది. ఈ లక్షణమున్న పదార్థాలు ఒక తరహా కాంతిని స్వీకరించి, మరో తరహా కాంతిని విడుదల చేస్తాయి. కొన్ని కీటకాల రక్తంలోని రసాయనాలు అధిక శక్తి గల నీలం, ఊదారంగు ఫోటాన్లను శోషించుకుని, అల్పశక్తిగల పసుపు, లేత ఆకుపచ్చ రంగుల్ని ఉద్గారం (emission) చేస్తాయి. చాలా కీటకాల రక్తం ఎర్రగా కాకుండా తెల్లగా ఉంటుంది. వాటి శరీరంలో ఉన్నప్పుడు మెరుపు లేకపోయినా రక్తస్రావం జరిగినప్పుడు గాలితో చర్య జరిగడం వల్ల మెరిసే లక్షణాలు రావడం కద్దు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక.

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, December 06, 2010

పుట్టగొడుగులు ఎలా పుడతాయి ?, Mushrooms Germinate how?

వర్షాలు పడగానే కుళ్ళుతున్నటువంటి గడ్డి , పేడల దగ్గర హఠాత్తుగా పుట్టగొడుగులు కనిపిస్తాయి . వివిధ సైజుల్లో వుండే వీటినే " మష్రూమ్స్ " అని మార్కెట్ లో అమ్ముతుంటారు . మనిషి తినేందుకు వీలున్న ఇవి వృక్షజాతికి చెందినవే . అయితే వీటిలో పత్రహరితం లేనందున కుళ్ళిపోతున్న పదార్ధాలను అహారముగా గహించి జీవిస్తాయి . వీటికి పూలు , కాయలు , విత్తనాలు లేవు . వీటిలోని సిద్ధబీజాలు కొత్త పుట్టగొడుగును ఇస్తాయి . ఒక పుట్టగొడుగులో కొన్ని వేల కోట్ల సిద్ధ బీజాలు ఉంటాయి . పుట్టగిడుగులకు వేళ్ళు ఉండవు .. తంతువుల ద్వారా అహారము గ్రహిస్తాయి . వీటిలో కొన్ని విషపూరితమయిన జాతులు కూడా ఉన్నాయి .
  • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, December 05, 2010

భాషకు జన్యువులుంటాయా?, Speech is related to Genes?

  • -


ప్రశ్న: జన్యువుల్లో భాషకు సంబంధించినవి ఏవైనా ఉంటాయా?

జవాబు: మిగతా ప్రాణుల నుంచి మానవులను వేరుచేసే ప్రత్యేక లక్షణం భాష. కొన్ని సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు మానవులకు మాత్రమే మాట్లాడగల సామర్థ్యాన్ని సమకూర్చే ఒక జన్యువును ఆవిష్కరించారు. దానికి foxp2 అనే పేరు పెట్టారు. నిజానికి ఇది మానవుల్లో, కోతుల్లో కూడా ఉంటుంది. అయితే మానవుల్లో ఉండే జన్యువులో ప్రొటీన్ల అమరిక, కోతుల్లోని జన్యువులోలా కాకుండా భిన్నంగా ఉంటుందని గుర్తించారు. ఈ అమరిక ఫలితంగానే మానవులు మాట్లాడే సామర్థ్యాన్ని అలవరుచుకోగలిగారని శాస్త్రవేత్తలు నిర్ధరించారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ==========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, December 03, 2010

రుతువుల్లోనే పండ్లేల? , why do fruits apper only in Seasons?


ప్రశ్న: చాలా రకాల చెట్లు రుతువుల్ని బట్టే కాయలు కాస్తాయెందుకు?

-మద్దిలి పద్మావతి, కోట బొమ్మాళి (శ్రీకాకుళం)

జవాబు: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోందని చదువుకుని ఉంటారు. సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యామార్గానికి భూమి అక్షం లంబంగా కాకుండా, కొంచెం ఒరిగినట్టు ఉండడం వల్లనే భూమిపై రుతువులు ఏర్పడుతున్నాయని కూడా తెలిసిందే. ఇందువల్లనే ఏడాది మొత్తాన్ని పరిశీలిస్తే భూమిపై ఏ ప్రాంతంలోనూ సూర్యరశ్మి తీవ్రత ఒకే విధంగా ఉండదు. పైగా భూమి దీర్ఘవృత్తాకార (elliptical) మార్గంలో సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఏడాదిలో కొంతకాలం సూర్యుడికి దగ్గరగా, మరి కొంత కాలం దూరంగా భూమి ఉంటుంది. ఈ రెండు కారణాల సమష్టి ఫలితమే భూమిపై కొన్ని ప్రాంతాల్లో రుతువులకు పునాది. చాలా చెట్లు వేసవి కాలానికి ముందే చిగురు తొడిగి మొగ్గలు వేసి పుష్పాలుగా వికసించి, పరాగసంపర్కం ద్వారా కాయలు, పండ్లుగా రూపాంతరం చెందుతాయి. ఈ దశలన్నింటికీ వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, సూర్యరశ్మి అనుకూలత మొదలైన కారణాలు అనువుగా ఉంటాయి. మండు వేసవిలో నీటి కొరత ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ సజావుగా సాగదు. అందుకే కొన్ని చెట్లు తమకి అనుకూలమైన సమయాల్లోనే ఫలాలను ఇస్తుంటాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


  • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, December 01, 2010

ఖండాలు కదులుతాయా? , Continents Moove?




ప్రశ్న: ఖండాలు కదులుతూ ఉంటాయంటారు. నిజమేనా?

- సి. అనంత పద్మనాభరావు, విజయనగరం

జవాబు: కొయ్యలు నీటిపై తేలుతాయి. కారణం వాటి సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండడమే. ఖండాల (Continents) విషయం కూడా అంతే. ఖండాలకు సంబంధించిన భూఫలకాలను 'టెక్టానిక్‌ ప్లేట్స్‌' అంటారు. వీటి పైనే పర్వతాలూ, సముద్రాలూ కూడా ఇమిడి ఉంటాయి. ఈ భూఫలకాలు చాలా బరువైన గ్రానైట్‌ రాళ్లతో కూడి ఉన్నా అవి భూగర్భంలో ఉండే శిలాద్రవంపై తేలుతూ ఉంటాయి. భూగర్భంలో ఉండే అత్యంత ఉష్ణోగ్రత వల్ల రాళ్లు సైతం కరిగిపోయే ఈ శిలాద్రవం చిక్కని బెల్లంపాకంలాగా ఉంటుంది. దీనిపైనే భూఫలకాలు, నీటిపై తెప్పల్లాగా తేలుతూ ఉంటాయి. ఈ శిలాద్రవాన్నే Mantle అంటారు. ఈ శిలాద్రవం సాంద్రత ఘనపు సెంటీమీటర్‌కి సుమారు 3.5 గ్రాములుంటుంది. గ్రానైట్‌ సాంద్రత ఘనపు సెంటీమీటర్‌కి 2.7 గ్రాములుంటుంది. అందువల్ల తక్కువ సాంద్రత ఉన్న ఖండాలు శిలాద్రవంపై తేలుతుంటాయి. ఈ భూఫలకాలు శిలాద్రవంపై తేలుతూ ఉండడమే కాకుండా కదులతూ ఉంటాయి. దీనికి కారణం భూ ఆవరణం 3000 కిలోమీటర్ల లోతు కలిగి ఉండడమే. ఆ ఆవరణం అడుగు భాగంలోని ఉష్ణోగ్రత అనేక వేల డిగ్రీలు ఉండడంతో అక్కడ నుంచి తక్కువ సాంద్రత గల ఉష్ణ ప్రవాహాలు (Heat Currents) నిదానంగా ఆవరణ పై భాగానికి చేరుకుంటాయి. అక్కడ ఆ ప్రవాహాల ఉష్ణోగ్రత తగ్గి, సాంద్రత హెచ్చడంతో మరలా అవి ఆవరణ కింది లోతులకు చేరుకుంటాయి. వీటిని సంవహన ప్రవాహాలు (Convection Currents) అంటారు. వీటి కారణంగా భూ ఆవరణలోని రాతిద్రవం ఒక భారీ కన్వేయర్‌ బెల్ట్‌లాగా పైకీ కిందకీ తిరుగతూ ఉండడం వల్ల ఉత్పన్నమైన బలంతో శిలాద్రవంపై తేలుతున్న ఖండాలు కదులుతూ ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Flying Snakes Secreat what?, ఎగిరే పాముల రహస్యమేమిటి ?


పాములు పాకుతాయని తెలుసు... కానీ ఎగురుతాయా? అలాంటివి ఉన్నాయి! వాటిపై పరిశోధన జరిగింది... రహస్యమేంటో బయటపడింది!!

మీకు గ్త్లెడింగ్‌ అంటే తెలుసుగా? పెద్ద పెద్ద రెక్కల్లాంటి అమరిక ఉండే గ్త్లెడర్‌ని తీసుకుని ఏ కొండ మీదకో వెళ్లి దాంతో సహా దూకేసి చాలా దూరం ఎగురుతూ వెళ్లే సాహసక్రీడ అది. అచ్చం అలాగే గాలిలో ఎగిరే పాములు ఉన్నాయని మీకు తెలుసా? వాటినే ఫ్లయింగ్‌ స్నేక్స్‌ అంటారు. వీటిలో అయిదు జాతులు ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతాల్లోని అడవుల్లో కనిపించే ఇవి ఎలా ఎగరగలుగుతున్నాయనేది ఇంతవరకూ ఓ వింతే. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, వాటి రహస్యమేంటో కనిపెట్టారు.

గ్త్లెడింగ్‌ చేసే క్రీడాకారుల్లాగే ఎగిరే పాములు కూడా ఎత్తయిన ఏ చెట్టు మీదకో ఎక్కి, అక్కడి నుంచి చటుక్కున దూకేసి గాలిలో బ్యాలన్స్‌ చేసుకుంటూ కిందికి సురక్షితంగా చేరుకోగలవు. వేటాడ్డానికి, శత్రువు నుంచి తప్పించుకోడానికి ఇలా చేస్తాయి. ఇవి ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకేసి దాదాపు 100 మీటర్ల దూరాన్ని కూడా గాలిలో ప్రయాణించగలవు. ఇంత ఎత్తు నుంచి మామూలు పాముని పడేస్తే అది తలకిందులుగా కింద పడి ఎముకలు విరిగిపోవడం ఖాయం. మరైతే ఇది ఎలా ఎగరగలుగుతోంది? గాలిలోకి దూకగానే ఇవి తమ పక్కటెముకలు సాగదీసి గుండ్రని శరీరాన్ని సమతలంగా చేయగలుగుతాయని ఇంతకు ముందే తెలుసు. అయితే మరి కొన్ని పాములకు కూడా ఇలా శరీరాన్ని మార్చుకునే విద్య తెలుసు. అంటే ఎగిరే పాములు దీంతో పాటు మరో రకమైన విన్యాసం కూడా చేస్తున్నాయన్నమాట. మరి అదేంటి? అది తెలుసుకోడానికే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.

అయిదు పాముల్ని తీసుకుని వాటిపై తెల్లటి మెరిసే చుక్కల్ని అమర్చారు. ఆపై వాటిని ఎత్తయిన టవర్‌పై వదిలి అవి అక్కడి నుంచి దూకి కిందకి రావడాన్ని ఒకేసారి నాలుగు కోణాల్లో అత్యాధునిక త్రీడీ వీడియో కెమేరాలతో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను కంప్యూటర్‌లోకి ఎక్కించి, మెరిసే చుక్కల్ని బట్టి యానిమేషన్‌ మోడల్‌ పాములను సృష్టించి వాటి శరీరం ఎలాటి కదలికలకు లోనైందో గమనించారు.

ఇంతకీ ఏం తెలుసుకున్నారు? ఈ పాములు ఎత్తు నుంచి దూకుతూనే గాలి వీచే దిశని అంచనా వేస్తూ శరీరాన్ని 25 డిగ్రీల కోణంలో తిప్పడం ద్వారా బ్యాలన్స్‌ చేసుకుంటున్నాయని గమనించారు. గాలిపటాలు, విమానాలు ఎగరడంలో కింద నుంచి పైకి వీచే గాలి శక్తి ప్రధాన పాత్ర వహిస్తుంది. దీన్నే 'లిఫ్ట్‌' అంటారు. ఈ పాములు కూడా ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాయని తేలింది. తలని, తోకను వ్యతిరేక దిశల్లో చకచకా కదిలిస్తూ గాలిలోనే ఈదుతున్నట్టుగా ఎగురుతూ మార్గాన్ని కూడా మార్చుకుంటున్నాయని తేల్చారు.

  • ===================================
visit My website > Dr.Seshagirirao - MBBS.