Thursday, July 30, 2009
తిమింగలం నీరెందుకు చిమ్ముతుంది? , Why do whale spill water?
తిమింగలాలు నీళ్ళ పైకి వచ్చి పెద్ద చప్పుడు తో ముక్కుతోటి నీళ్ళను ఫౌంటైన్ లా చిమ్ముతుంటాయి ... వీటిని వేటాదేందుకు పడవలలో వెళ్ళిన వేటగాళ్ళు ఆ ఫౌంటైన్ ను చూసి ఆ చప్పుడు విని గుర్తుపడతారు . తిమింగలము చేపకాదు ... అది క్షేరద జాతి జంతువు , గుడ్లు పెట్టదు .. పిల్లల్ని కానీ వాటికి పాలిచ్చి కొంత కాలం పాటు వాటిని దగ్గరగా ఉంచుకొని సంరక్షణ చేస్తుంది . ఇవి నీళ్ళలో మునిగినపుడు వాటి ముక్కు రంధ్రాల తలుపులు ముసుకుంటాయి . .. నోటినుండి గాలివీల్లె మార్గాలు కుడా ముసుకుపోతాయి .ఈ విదంగా ఉపిరితిట్టులలోకి నీరు వెళ్ళకుండా ఏర్పాటైంది . ఇవి 5 నుంచి 10 నిముషాల కోకసారి గాలి పీల్చుకోవడానికి నీటి పైకి వస్తుంటాయి . అవసరమైతే 45 నిముశాలవరకు నీళ్ళలో మునిగి ఉండే శక్తి వాటికి ఉన్నాది . పీల్చుకున్న గాలిని ప్రాణవాయువు అయిపోయాక నీటి పైకి వచ్చి శబ్దం తో ఉపిరి వదులుతుంది ... అప్పుడు బయటికి వచ్చే గాలితో పాటు దాని ఉపిరితిత్తుల నుంచి వేడెక్కిన నీటి ఆవిరి కుడా బయటకు వచ్చి .. బయట చల్లదనం వల్ల సన్నని నీటి తుంపరలు గా మారి ఫౌంటైన్ లా కనిపిస్తుంది . అంతే కాని అది ఉపిరి గొట్టంలోకి నీళ్లు పీల్చుకొని చిమ్మడు . నీళ్లు ఉపిరి గోత్తంలలోకి వెళితే అది ఇక్కిరి బిక్కిరి అవుతుంది . నీటి మట్టానికి కాస్త దిగువన వూపిరి విదిచినట్లయితే గాలితో పాటు నీల్లుకుడా చిమ్ముతాయి .
Wednesday, July 29, 2009
జ్ఞాన దంతం ఎందుకు వస్తుంది?,Why did wisdom tooth erupt?
మనిషి జ్ఞానానికి దంతానికి అసలు సంబంధమే లేదు . మరి ఆపేరు ఎందుకు వచ్చిందో తెలయదు . మనిషికి మొత్తం 32 దంతాలు ఉంటాయి , కింది , పై దవడల్లో కుడి వైపు 8 , ఎడమ వైపు 8 దంతాలు అమరి ఉంటాయి . ఆ 8 దంతాలలో ముందుండే 2 కొరుకుడు(incissors) పళ్ళు , ఒక కోరపన్ను(canine tooth) , 2 అగ్రచర్వనాలు(premolars) , 3 చర్వనాలు(Molars) ఉంటాయి . వీటిలో అన్నిటికన్నా లోపల వుండే మూడవ చర్వనాన్ని (3 rd molar) జ్ఞాన దంతము గా పిలుస్తారు .
ఒక నాడు మనిషి దవడ మరింత పెద్దదిగా మరింత బలమైన దవడపల్లు తో ఉండేది ... కానీ ఉడికించి తినడం అలవాటైన తర్వాత దవడ రూపం తగ్గి , లోపలి చర్వనానికి స్థానం ఇరుకైనది . ఈ దంతం సాధారణం గా 15 నుండి 25 ఏళ్ళ మధ్య వస్తుంది . ఇరుకు దవడ లో ఆ పన్ను వచ్చేటపుడు చాల భాధ కలుగు తుంది .
అయితే మరో పదివేల సంవత్సరాలు గడిచేసరికి మనుషుల దంతాల సంఖ్యా లో మార్పోచ్చి అసలు జ్ఞాన దంటాలే ఏర్పదకపోవచ్చునన్నది ఉహా .
బాధ నివారణకు ఈ దంతాలను తీసివేయడం మంచిది , ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు .
ఒక నాడు మనిషి దవడ మరింత పెద్దదిగా మరింత బలమైన దవడపల్లు తో ఉండేది ... కానీ ఉడికించి తినడం అలవాటైన తర్వాత దవడ రూపం తగ్గి , లోపలి చర్వనానికి స్థానం ఇరుకైనది . ఈ దంతం సాధారణం గా 15 నుండి 25 ఏళ్ళ మధ్య వస్తుంది . ఇరుకు దవడ లో ఆ పన్ను వచ్చేటపుడు చాల భాధ కలుగు తుంది .
అయితే మరో పదివేల సంవత్సరాలు గడిచేసరికి మనుషుల దంతాల సంఖ్యా లో మార్పోచ్చి అసలు జ్ఞాన దంటాలే ఏర్పదకపోవచ్చునన్నది ఉహా .
బాధ నివారణకు ఈ దంతాలను తీసివేయడం మంచిది , ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండదు .
Sunday, July 26, 2009
సింహాన్ని మృగరాజు అంటారు ఎందుకు ?,Why is Lion called as King of forest?
=============================
సింహాన్ని మృగరాజు అని అంటారు . అయితే పులులు , సింహాలు అన్నీ ఒకలాంటివే అయినా ఒక్క సిహానికే ఆ బిరుదు ఎందుకిచ్చారో ప్రస్తావన లేదు . నిజానికి సింహాలు అడవిలా లో కన్నా గడ్డి వనాలలో ఎక్కువగా ఉంటాయి . అటువంటపుడు అవి ఎలా అడవికి రారాజు అని పిలువబడు చున్నాయో ? అలా అనడం ఎంతమాత్రమూ సరియైనది కాదు కుడా . కాని దానికుండే జులు , అది ప్రదర్శించే రాజసాన్ని బట్టి మృగరాజు అనే బిరుదు దక్కించుకుని ఉండవచ్చు. . . అంటే కాకా అది ఇతర జీవులను వేటాడి తిన్తుందే కానీ .. ఇతర జంతువులేవీ దానిని ఏమీ చేయలేవు . కాబట్టి దీనికి మృగరాజు అనే బిరుదు ఇచ్చి ఉండవచ్చు.
ఎనిమిది ఆత్మ గుణాలు అంటారు అవి ఏవి ? ,What are the eight Soul characters?
==================================
ఆత్మ, శరీరము (Psyco Somatic) ల తో కూడుకున్నది మానవ జీవితం . ఆత్మ కు చావులేదు ... శరీరము ముసలి తనము లో పంచ భుతాలలో కలిసిపోతుంది . ఆత్మ , శరీరాన్ని అదుపు చేస్తుంది ... మనసు ఆరోగ్యం గా ఉంటే నే శరీరము ఆరోగ్యం గా ఉంటుంది. మనసు మంచి దైతే మనుగడ మచిదే అవుతుంది ... ఈ మనుగడ మనసు గుణగణాల పై ఆధారపడి ఉంటుంది. అవే మంచి ఆత్మ గుణాలు :
- 1.దయ ,
- 2.క్ష మ ,
- 3.అనసూయ ( అసూయా లేకుండా వుండడం ) ,
- 4.శౌచం ,(పరిశుభ్రత),
- 5.మొండితనం లేకపోవడం ,
- 6.మధుర స్వభావము ,
- 7.అత్యాస లేకపోవడం ,
- 8.నిస్కామము (కమగ్ని లేకుండా ఉండడం),
Friday, July 17, 2009
గబ్బిలాలు తలకిందులుగా వేలడుతాయి ఎందుకు ?,Why Bats hang head down?
=======================================
పిల్లల్ని కనే క్షేరద విబాగానికి చెందినా గబ్బిలం , పక్షిలా ఎగరగాలిగినా పక్షి రెక్కలకున్న బలం దీనికి లేదు . అందుకే అది నేల మీద నుండి పైకి ఎగరలేదు .
ఒక నిర్దిష్టమైన ఎత్తుకు చేరి అక్కడ నుండి రెక్కలు విసురుతూ ఎగరగలదు . అందుకే అది ఎగిరేందుకు సిద్ధము గా ఉండే పధ్ధతి లో కాళ్ళతో కొమ్మలను పట్టుకుని కిందికి వేళ్ళాడుతుంది . దీని గోళ్ళు బలం గా ఉంటాయి . ఆ కాలూ పట్టు వదల గానే రెక్కలు విదిలించగలదు . ఇలా కిందికి వేలాడే అలవాటు వల్ల చేట్టుకోమ్మల మీద స్థానం కోసం పక్షుల తో పోటీ ఎదుర్కోవలసిన పరిస్థితి గబ్బిలాలకు ఉండదు .
ఒక నిర్దిష్టమైన ఎత్తుకు చేరి అక్కడ నుండి రెక్కలు విసురుతూ ఎగరగలదు . అందుకే అది ఎగిరేందుకు సిద్ధము గా ఉండే పధ్ధతి లో కాళ్ళతో కొమ్మలను పట్టుకుని కిందికి వేళ్ళాడుతుంది . దీని గోళ్ళు బలం గా ఉంటాయి . ఆ కాలూ పట్టు వదల గానే రెక్కలు విదిలించగలదు . ఇలా కిందికి వేలాడే అలవాటు వల్ల చేట్టుకోమ్మల మీద స్థానం కోసం పక్షుల తో పోటీ ఎదుర్కోవలసిన పరిస్థితి గబ్బిలాలకు ఉండదు .
సప్త ఋషులు అంటే ఎవరు?, Who were the seven sages?
హిందూ పురాణాలలో ఋషుల ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది . ఋషులు లేనిదే పురాణాలు ,ఇతిహాసాలు ,రామాయణం , మహాభారతాలు లేవనే చెప్పాలి . అన్నీ వారు వ్రాసినవే .
సప్త అంటే ఏడు ... ఆ సంఖ్యలోగల మహర్షులనే సప్తఋషులు అని అంటారు . వారు ..
అగస్య ముని
.
కశ్యప ముని ,
సప్త అంటే ఏడు ... ఆ సంఖ్యలోగల మహర్షులనే సప్తఋషులు అని అంటారు . వారు ..
- 1. కశ్యపుడు ,
- 2. అత్రి ,
- 3. అంగీరసుడు ,
- 4. కౌశికుడు ,
- 5. వసిష్టుడు ,
- 6. భ్రుగువు ,
- 7. అగస్యుడు ,
అగస్య ముని
.
కశ్యప ముని ,
Friday, July 10, 2009
అష్టవిధ చిరంజీవులు అంటే ఎవరు ? Who were deathless personas in Epics?
=====================================================================================
భారతీయ పురాణాలలో ఎనమండుగురు వ్యక్తుల్ని చిరంజీవులు గా పేర్కొన్నారు . చిరంజీవి అంటే చనిపోయినా బ్రతికున్నట్లు భావన . మ్రుతన్జీవి అంటే బ్రతికున్నా చనిపోయినా వాని కింద లెక్క .
పురాణ చిరంజీవులు :
- 1. అశ్వద్ధామ ,
- 2. బలిచక్రవర్తి ,
- 3. వ్యాసమహర్షి ,
- 4. హనుమంతుడు ,
- 5. విభీషణుడు ,
- 6. కృపాచార్యుడు ,
- 7 . పరశురాముడు ,
- 8. మార్కండేయ ,
Wednesday, July 08, 2009
పక్షులకు దిక్కులు ఎలా తెలుస్తాయి ? , How birds recognize directions?
నగరాలలోకి వెళితే మనకు దారి తెలియక ఇబ్బంది పడతాం . ఇక ఆకాశం లో ఎ దారి గుర్తులు ఉండని చోట పక్షులు అన్ని వందల మైళ్ళు ఎలా ఎగురు తాయి ?.
- పక్షులకు దిక్కుల పరిజ్ఞాము ఎక్కువే . అవి ఆకాశంలో ఉన్నా నక్షత్రాలు , సూర్యుడు ,చంద్రుడు , ఆధారము గా గుర్తులు పెట్టుకుంటాయి . వాటిని చూస్తూ తగిన కోణం లో ప్రయాణ మార్గం నిర్దేశించుకుని ముందుకు కదులుతాయి . అందుకే పక్షులకు దరితప్పడం అనేది జరుగదు .
Subscribe to:
Posts (Atom)